ఈ ఒక్క ఆహారపదార్థాలతో శరీరంలో క్యాల్షియం ఎంతగానో పెరుగుతుంది

148

ఐరన్ విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాలు మాదిరిగా క్యాల్షియం కూడా మన శరీరంలో లభించి ముఖ్యమైన పోషకాలు 1. శరీరంలో ఎముకలు మరియు కండరాల తో పాటు నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి ఇది సహాయపడుతుంది. 90 శాతం మేరకు క్యాల్షియం మన శరీరంలో ఎముకలు మరియు దంతాల బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణాన్ని సరిగా పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. మన శరీరంలో ఉన్న రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కండరాలు మరియు నరాల పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది ఇది హృదయ స్పందన క్రమబద్ధీకరించడానికి దోహదపడుతుంది. ఇన్ని రకాలుగా శరీరానికి ఉపయోగపడే క్యాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో ముఖ్యమైనది పెరుగు మనం పాల ద్వారా తయారు చేసుకునే పెరుగు క్యాల్షియం ఉత్పత్తులలో ముఖ్యమైనది. బయట దొరికే పెరుగు అంత మంచిది కాదు అందుకే ప్రతిరోజు ఇంట్లోనే పెరుగు తయారు చేసుకొని తినడం మంచిది. పాలలో అలాగని పెరుగులో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే లాక్టోస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎముకల్ని దృఢంగా చేస్తుంది. సముద్రపు చేపల లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది చాపల మార్కెట్ లో చాలా తేలికగా దొరుకుతుంది. దీని ఖరీదు కూడా చాలా తక్కువ మాంసాహారం తినే వాళ్ళు అందరూ కూడా దీనిని తినవచ్చు. సముద్రతీర ప్రాంతంలో ఉండే వారందరికీ కూడా ఈ చాప గురించి తెలిసే ఉంటుంది. చేపల ద్వారా మన శరీరానికి కావాల్సిన 33 శాతం వరకు క్యాల్షియం లభిస్తుంది, అందుకే తప్పనిసరిగా వారానికి ఒకసారి ఈ చేపలను తినాలి.
అలాగే చీజ్. ఇది కూడా చాలా తేలికగా దోరుకుతుంది. ఇది కూడా పాల ఉత్పత్తి కి సంబంధించినది. దీనిలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. దీంట్లో అత్యధిక శాతం కాల్షియం ఉంటుంది.
అంజీర పండు. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది కాల్షియంతో పాటు విటమిన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి.
పచ్చని ఆకు కూరలు కాయగూరలు. వీటిలో కూడా అధికంగా కాల్షియం ఉంటుంది. తోటకూర పాలకూర బచ్చలి కూరతో పాటు బ్రోకోలి కూడా కాల్షియం అధికంగా లభిస్తుంది. అందువల్ల వీటిని ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉండాలి. బాదంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది అలాగే కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని మోతాదుకు మించి తీసుకోకూడదు ఉండటం మంచిది. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే మోతాదుకు మించకుండా తినాలి.
అలాగే రొయ్యలు. దీనిలో అధిక శాతం క్యాల్షియం ఉంటుంది అయితే వీటిని ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉండే కాల్షియం పోతుంది. అందువలన వీటిని ఎక్కువగా వేయించ కుండా తింటే మంచిది. తినడం వల్ల దానిలో ఉండే కాల్షియం గుణాలు అన్నీ కూడా ఒంటికి పడతాయి.
ఇక తరువాతి పదార్థం నువ్వులు. క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా గర్భిణీలు నువ్వులతో చేసిన పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటారు. నువ్వులతో మహిళలు వారు కోల్పోయిన కాల్షియంను పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కాల్షియం సులభంగా పొందవచ్చు. అలాగే ఆరెంజ్ ఆరెంజ్ లో క్యాల్షియం బాగానే ఉంటుంది వీటిని ప్రతిరోజూ తింటుంటే శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. అందువలన ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. సోయా పాలు సాధారణ పాలతో పోలిస్తే సోయా పాలలో క్యాల్షియం అధికంగా ఉండదు. కానీ ఒక అకౌంట్స్ పాలలో 300 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది అందువలన వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కాల్షియం అందుతుంది.
ఓట్స్. కాంప్లెక్స్ కంటే ఓట్స్ ఆరోగ్యకరమైనవి. ఇది ధర లో కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావల్సిన కాల్షియం వీటి ద్వారా అందుతుంది. తీసుకునే ఆహారంలో ఓట్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే బెండకాయ లో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి ఒక గిన్నె బెండకాయలు 175 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. 100 గ్రాముల బెండకాయ లో క్యాల్షియం 82 మిల్లీ గ్రాములు ఉంటుంది.
పీతలు. పీత మాంసంలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి ఒక కప్పు పీత మాంసంలో క్యాల్షియం 120 గ్రాముల వరకు ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్డు లో 50 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. అందువలన వీలైనంతవరకు రోజుకి ఒక ఉడకబెట్టిన గుడ్డు అయినా తినాలి. అదేవిధంగా ఖర్చు రా దీంట్లో క్యాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. వీటిని కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. చూశారు కదా క్యాల్షియం దొరికే ఆహార పదార్థాలు వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలో క్యాల్షియం శాతాన్ని పెంచుకోవచ్చు.

Previous articleఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసే పొట్లకాయ
Next articleతన కడుపులో డైనోసరాస్ నీ దాచుకున్న అతి పెద్ద జీవి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here