ఈ ఆలయాన్ని ఒక్కసారి చూస్తే ఎంతటి పాపమైన పోతుంది

149

మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి వాటితోపాటు రాజులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిలో చెన్నకేశవ ఆలయం ఒకటి.
ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో దక్షిణ కాశి అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా కట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెన్నకేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అని సందేహం కలుగుతుంది. ఈ ఆలయాన్ని మృదువైన సున్నపురాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవస్వామిని పూజిస్తారు. ఇక్కడ పురాణాలలోని అనేక గాధలను ఏనుగులను రామాయణంలోని అనేక శిల్పాలను కూడా చూడొచ్చు. వీటితో పాటు అనేక రంగులలో చెక్కిన నవయవ్వన పడుతున్న చిత్రాలు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరిణి అంటే మెట్ల బావి ఉంటుంది. ఇక్కడ వివిధ నర్తకిగా శిల్పాలు ద్వారం వద్ద వివిధ భంగిమలలో కనిపిస్తాయి రథాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా దర్పణం సుందరి  బస్మ మోహిని అనేవి చెప్పుకోదగినవి. ఆలయం అంతర్భాగంలో రాజ గోపురాలు చిన్ని గర్భాలయాలు  లక్ష్మీ దేవి ఆలయం ఇరువైపులా ఉంటాయి. ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.


కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా వేలూరు పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హొయసల రాజ వంశస్థులు నిర్మించినట్లు చెబుతారు. వేలూరు కర్ణాటక లోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లాలో కేవలం బెంగళూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది యాగాచి నది ఒడ్డున ఉంది. ప్రాచీనమైన దేవాలయాల విశిష్టత వలన దీనిని అందరూ దక్షిణ కాశి అంటారు. బెంగళూరు హోయసల సామ్రాజ్యం రాజధాని గా ఉంది గనుక చారిత్రకంగా చూసుకున్నా కూడా వేలూరు విశిష్టమైనది. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలీ బిట్ కూడా హొయసలుల రాజధానిగా ఉంది. ఇది కూడా చాలా పురాతనమైన నగరం. ఈ రెండు నగరాలు హోయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధమైన ఉదాహరణలు. తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారు. విష్ణు భగవానుని కోసం నిర్మించిన ఈ ఆలయం గాలి గోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది. వేలూరు లో అన్నిటికంటే ప్రసిద్ధమయిన ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయమే. ఈ ఆలయంలో ఉన్న రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయి అన్నంతగా అందంగా ఉంటాయి. కర్ణాటకలోని హసన్ జిల్లా వేలూరు లోని అత్యంత రమణీయమైన దేవాలయాలలో ఒకటైన చెన్నకేశవస్వామి ఆలయం తప్పకుండా చూడదగినది. ఆలయం యొక్క అంతర్భాగం లో విజయనగర సామ్రాజ్యపు రోజులలో ఆలయ గోపురాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం కూడా ఉంది. మహా స్తంభం లేదా కార్తీకదీపోత్సవం స్తంభం అని పిలువబడే ఈ 42 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే ఒక వైపు ఆధారం నేలని తాకి ఉండదు. మూడువైపులా ఆధారం మీద నిలిచి ఉంటుంది. హోయసల శైలి శిల్ప కళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం ఉంటుంది.

Previous articleOld Sculpture : అందరిని ఆశ్చర్యపరుస్తూ సైకిల్ మీద కనిపించిన శివుడు
Next articleకొండా అంచులో పడిపోకుండా వేల ఏళ్ల నుంచి ఉన్న మహిమగల రాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here