Chiranjeevi and Balakrishna movies షూటింగ్ మధ్యలో…?

932

Chiranjeevi and Balakrishna movies

chiranjeevi and balakrishna movies : కొందరు దర్శక నిర్మాతలు పలువురు స్టార్ హీరోలతో భారీ అంచనాల నడుమ తెరకెక్కించిన చిత్రాలు ఉన్నట్లుండి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని చిత్రాలు పట్టాలెక్కకముందే ఆగిపోతే మరికొన్ని మాత్రం సినిమా షూటింగ్ దాదాపుగా 50 శాతం పూర్తయిన తరువాత దర్శక నిర్మాతల మధ్య మరియు ఇతర విషయాలలో విభేదాలు రావడంతో ఆగిపోయిన సినిమాలు కూడా లేకపోలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి నటసింహం బాలయ్య బాబు లు హీరోలుగా నటించిన చిత్రాలు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయనే విషయాల గురించి తెలుసుకుందాం…

chiranjeevi movies
chiranjeevi movies

Chiranjeevi  వినాలని ఉంది షూటింగ్ నిలిపివేత :

అయితే మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో “వినాలని ఉంది” అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో భాగంగా అప్పటికే దాదాపుగా 50 శాతానికి పైగా చిత్ర షూటింగ్ పనులు కూడా పూర్తి చేశారు. అలాగే ఈ చిత్రంలోని ఐదు పాటలను కూడా రికార్డింగ్ చేశారు. ఇందులో రెండు పాటలు ఇప్పటికీ యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఏమైందో ఏమోగాని దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉన్నట్లుండి షూటింగ్ కి ప్యాకప్ చెప్పి అర్థంతరంగా నిలిపివేశాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఎందుకు నిలిపివేశాడనే విషయాల గురించి మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు.

కానీ టాలీవుడ్ సినీ వర్గాల కథనం ప్రకారం అప్పటికే రామ్ గోపాల్ వర్మ పలు బాలీవుడ్ చిత్రాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడని అందువల్లనే వినాలని ఉంది చిత్ర షూటింగ్ పనులను నిలిపివేసి బాలీవుడ్ కి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని కొందరు చర్చించుకుంటున్నారు. ఇంకొందరైతే మాత్రం దర్శక నిర్మాతలు స్క్రిప్ట్ పనుల్లో వేలు పెట్టారని దాంతో ఈ విషయం నచ్చక రామ్ గోపాల్ వర్మ ఏకంగా షూటింగ్ పనులనే నిలిపివేశాడని గుసగుసలాడుకుంటున్నారు. కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన ప్రముఖ హీరో హీరోయిన్ హీరోయిన్ టబు నటించగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చాడు. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నటువంటి క్రేజ్ కి రాం గోపాల్ వర్మ తో సినిమా పడి ఉంటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ బ్యాడ్ లక్ కదా…

balakrishna movies
balakrishna movies

బాలకృష్ణ విక్రమ సింహా భూపతి షూటింగ్ వివరాలు:

ఇక క నందమూరి బాలకృష్ణ కూడా అప్పట్లో ప్రముఖ సీనియర్ స్వర్గీయ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన విక్రమసింహ భూపతి అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 60 శాతం షూటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ దాదాపుగా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన అవుట్ పుట్ దర్శకనిర్మాతలకు నచ్చకపోవడంతో ఇంటర్వెల్ తరువాత వచ్చేటువంటి సన్నివేశాలలో మార్పులు చేర్పులు చేయాలని దర్శకుడు కోడి రామకృష్ణ కి ఈ చిత్ర నిర్మాతలు సూచించారట. దీంతో ఈ విషయం నచ్చకపోవడంతో దర్శకుడు కోడి రామకృష్ణ ఏకంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పకున్నాడట.

దాంతో సినీ నిర్మాతలు మరో ఇతర దర్శకుడితో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావించినప్పటికీ వర్కౌట్ కాకపోవడంతో దాదాపుగా ఐదు కోట్ల రూపాయలకి పైగా నష్టం వచ్చిందట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్లను చూసిన బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఒకవేళ విక్రమసింహ భూపతి చిత్రం గనుక విడుదలయి ఉంటే ఫలితాలు మాత్రం మరోలా ఉండేవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

If you like our article about chiranjeevi and balakrishna movies

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleGajala : పెళ్ళికి ముందు ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యాయత్నం
Next articleVatican city : పేరుకే చిన్న దేశం.. కానీ ప్రపంచంలో అత్యధికంగా క్రైం రేటు ఉండేది అక్కడే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here