Khaidi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ చిత్రం వెనుక ఇంత జరిగిందా..?

99

Khaidi : తెలుగు లో 1983వ సంవత్సములో తెలుగు ప్రముఖ దర్శకుడు ఏ. కోదండ రామిరెడ్డి మరియు టాలివుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తదితరుల కాంబినషన్లో తెరకెక్కిన ఖైదీ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్లు సుమలత, మాధవి తదితరులు కథానాయికలుగా నటించగా ప్రముఖ స్వర్గీయ నటుడు రావు గోపాల్ రావు, చలపతి రావు, నూతన్ ప్రసాద్, రంగనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అలాగే ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ కానీ నిర్మాతలైన ధనుంజయ రెడ్డి, నర్సా రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు కలిసి సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ సినీ రచయతలైన పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ ను పూర్తిగా మలుపు తిప్పింది. అంతేగాక ఈ చిత్రం ద్వారానే చిరంజీవిలో వున్నటువంటి నటనా ప్రతిభ బయట పడింది. కాగా తాజాగా ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఈమంది రామారావు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఖైదీ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో దర్శక నిర్మాతలు మధ్య పెద్ద సంఘర్షణ జరిగిందని తెలిపాడు. అలాగే ఖైదీ చిత్రాన్ని మొదటిగా తెలుగు ప్రముఖ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణతో తెరకెక్కించాలని అనుకున్నారని కానీ సూపర్ స్టార్ కృష్ణ కి కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని తెలిపాడు. దీంతో ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి స్టార్డమ్ ఉన్నటువంటి హీరోలతో సినిమాలు చేయాలంటే వాళ్ళు చెప్పినట్లు వినాలని కాబట్టి స్టార్ హీరోలతో కాకుండా అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలను ఎంపిక చేస్తే అన్ని విధాల బాగుంటుందని ఆలోచించారట. ఆ తర్వాత ఖైదీ చిత్ర కథలో పలు మార్పులు చేర్పులు చేసి మెగాస్టార్ చిరంజీవి కి వినిపించినప్పటికీ చిరంజీవి కూడా మొదట్లో నచ్చలేదని దాంతో మళ్లీ నిర్మాతలు సందిగ్దంలో పడ్డారని చెప్పుకొచ్చాడు.

కానీ ఈ చిత్రం యొక్క మెయిన్ ట్యాగ్ లైన్ మెగాస్టార్ చిరంజీవికి నచ్చడంతో దగ్గరుండి తనకు నచ్చినట్లు స్టోరీ రాయించుకున్నాడని ఆ తర్వాత అన్ని కుదరడంతో దర్శకనిర్మాతలు కూడా ఈ చిత్రాన్ని పట్టా లెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖైదీ చిత్రం ముందు మరియు ఆ తర్వాత అని మొదలు పెట్టాల్సి ఉంటుంది.అయితే ఈ చిత్రం అప్పట్లోనే దాదాపుగా 8 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద పలు వసూళ్ల రికార్డులను కూడా నెలకొల్పింది.అలాగే 8 కోట్ల వసూళ్లను సాధించిన రెండో చిత్రం గా రికార్డులకెక్కింది.

అయితే అప్పట్లోనే 25 లక్షల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో ఈ చిత్రాన్ని హిందీ మరియు కన్నడ భాషల్లో కూడా రీమేక్ చేశారు. బాలీవుడ్ లో కూడా ఖైదీ చిత్రం బాగానే ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేందర్ నటించాడు. కాగా ఈ చిత్రంలో కూడా తెలుగులో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించిన మాధవి హీరోయిన్ గా నటించి మెప్పించింది.

Previous articleమెగాస్టార్ చిరంజీవి పెళ్ళికి రాకపోతే ఆ నటి కొడుకు తాళి కట్టనని అన్నాడు… దాంతో…
Next articlePremikula roju : ఈ హీరో డెత్ ఇప్పటికీ మిస్టరీనే… ప్రేమ వ్యవహారమే కారణమా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here