చిత్రా రామక్రిష్ణ : స్టాక్ మార్కెట్ గుట్టు ఆ హిమాలయాలలో ఉన్న రహస్య యోగి చేతిలోకి ఎలా వెళ్ళింది.

475
చిత్రా రామక్రిష్ణ
చిత్రా రామక్రిష్ణ

చిత్రా రామక్రిష్ణ ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాలంలోకి ?

చిత్రా రామక్రిష్ణ : ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం స్రుష్టిస్తోంది. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ ను ఫాలో అయ్యేవారికి ఈమె పేరు భాగా తెలుసు. చిన్న స్థాయి నుంచి తన స్కిల్స్ తో ఎంతో ఎత్తుకు ఎదిగారు చిత్ర రామక్రిష్ణ. ఎన్ఎస్ఈ అంటే జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పేరు మార్మోగింది. దేశంలోని వ్యాపార మహిళలకు ఆమె లీడర్. బ్యాంకింగ్ లో ఆమెది అందెవేసిన చేయి. స్టాక్ మార్కెట్ ను నడపడంలో చిత్ర తర్వాతే ఎవరైనా అంటూ రారాణిగా మీడియా చిత్రను ఆకాశానికి ఎత్తేసింది. కానీ ఓ అద్రుశ్య శక్తి ఆమె జీవితంలోకి వచ్చాడు. అతనే వచ్చాడా…లేదంటే ఆమెనే పిలిచిందా అనేది ఇప్పుడు ఈస్టోరీలో చూద్దాం. అసలు ఆకాశం నుంచి పాతాలంలోకి చిత్ర రామక్రిష్ణ ఎందుకు పడిపోయిందో ఒక సారి ఆమె జీవిత కథను దాని వెనుకున్న మిస్టరీని చూద్దాం. ఈ రారాణి చేసిన లీలలు కూడా అన్నీ ఇన్నీ కావు. తెలివిగా ఎంత దోచుకోవాలో అంత వెనకేసి పెద్ద పదవైనా సరే రాజీనామా చేసి ఇంటికెళ్లింది. కానీ ఆలస్యంగానైనా పాపం పండింది. ఈ మిస్టీరియస్ లేడీ మిస్టరీ ఏంటో మీరూ చూడండి.

చిత్ర రామక్రిష్ణ మొదట చార్టెడ్ ఎకౌంటెంటె గా కెరీర్ ను ప్రారంభించారు. అయితే తన బిజినెస్ స్కిల్స్ తో మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఆమె టాలెంట్ ఐడీబీఐ బ్యాంక్ అధికారులను ఆకర్షించింది. అందులో కొన్నాళ్లు పనిచేసిన తర్వాత 1985లో ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ గా చేరారు. అక్కడి నుంచి ఆమె వెను తిరిగి చూడలేదు. ప్రతి మూడేళ్లకు ఒక సారి ప్రమోషన్ తో తారాపథంలో దూసుకెళ్లింది.

బిజినెస్ సర్కిల్ లో చిత్ర పేరు తెలియని వారు లేరు. ఆమె పేరు ముఖేష్ అంబానీ నుంచి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సామాన్యంగా కెరీర్ మొదలు పెట్టి కష్టపడి సొంత టాలెంట్ తో ఎదిగారు చిత్ర. ఆ తర్వాత సెబీలో పనిచేశారు. కొంత అనుభవం వచ్చిన తర్వాత ఆమెను మళ్లీ ఐడీబీఐ పిలిచి మంచి ఆఫర్ ఇవ్వడంతో పాత బ్యాంక్ కే వెళ్లారు. స్టాక్ ఎక్స్ జేంజ్ మేనేజ్మెంట్ పై ఆమె ఎంతో నేర్చుకున్నారు. సెబీలో జరిగే చిన్న విషయం నుంచి స్టాక్ లు పెరగడం, తగ్గడం దాని వెనుకున్న కారణాలు సహా అన్నింటిని ఆమె చూస్తూనే అవపోసాన పట్టారు. ఆ టాలెంట్ నాటి ఐడీబీఐ చైర్మన్ ఎస్ ఎస్ నదకర్ణీ ద్రుష్టిలో పడేలా చేసింది. అతనితో పరిచయం అంటే ఇక టాప్ పొజిషన్ కు వెళ్లినట్లే. చిత్రా విషయంలో అదే జరిగింది.

స్టాక్ మార్కెట్ లో హర్షద్ మెహతా కుంభకోణం తర్వాత అవతవకలకు చోటు లేకుండా ఒక ట్రేడింగ్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలనుకుంది కేంద్ర ఆర్ధిక శాఖ. అందుకోసం ఐదుగిరితో నాటి కేంద్రం ఒక కమిటీ వేసింది. అందులోకి ఐడీబీఐ చైరర్మన్ రికమండేషన్ తో చిత్రా రామక్రిష్ణ చేరారు. అప్పటికే ఆమెకు సెబీలో ఎంతో అనుభవం ఉంది. స్టాక్ మార్కెట్ పై పూర్తి పట్టు ఉన్న వ్యక్తిగా చిత్రకు పేరు. పైగా ఐడీబీఐ చైర్మన్ సూచించడంతో చిత్రా చూస్తుండగానే పతాక స్థాయికి చేరుకుంది. కేంద్ర ఆర్ధిక శాఖ ద్రుష్టిలో పడింది. ఆ పరిచయాలతో తన వ్రుద్దికి తానే మెట్లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్లింది చిత్ర. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ కి మొదటి ఎండీ రవి నరైన్. ఆయన టీమ్ లో చిత్రా రామక్రిష్ణ మెంబర్. మొత్తం కోర్ టీమ్ లో ఆమెనే బెస్ట్ టాలెంట్ అని రవి కూడా నమ్మారు. దీంతో 2009 లో రవి రిటైర్ అవ్వగానే ఆయన స్థానంలో ఎండీ అయ్యారు. అసలు దక్షిణ ఆసియా, ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలో ఇంత పెద్ద స్టాక్ ఎక్స్ చేంజ్ కు ఎండీ కావడం మహిళగా ఆమె రికార్డ్ క్రీయేట్ చేసింది. అంతే కాదు తన పనితనంతో స్టాక్ మార్కెట్ ను కొత్త పుంతలు తొక్కించింది. పారదర్శకంగా మార్కెట్ పనులు జరిగేలా ఏర్పాట్లు చేసింది చిత్ర. ఓ ట్రేడ్ ఎక్స్ చేంజ్ లో అద్భుతంగా రాణిస్తూ ప్రపంచ వ్యాప్తంగా చిత్రా రామక్రిష్ణ పేరు తెచ్చుకున్నారు. దేశంలోనే టాప్ ఎక్స్ చేంజ్ గా ఎన్ఎస్ ఈ ని చిత్ర రూపుదిద్దారు. 2013 లో ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్ఎస్ ఈ షరవేగంగా దూసుకెళ్లింది.

అదే ఏడాది ఫోర్బ్స్ మేగజైన్ లో సైతం బిజినెస్ లీడర్స్ కేటగిరీలో వుమన్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డ్ దక్కించుకున్నారు. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ అవార్డు లతో చిత్ర పేరు మార్మోగింది. ప్రభుత్వం కూడా ఆమె సలహాలు తీసుకునే రేంజ్ కి ఎదిగారు. ఫార్చ్యూన్ టాప్ వరల్డ్ లీడర్స్ లో 17వ స్థానంలోనూ అదే ఏడాది అంటే 2013 లో శక్తివంతమైన మహిళా లీడర్లలో ప్రపంచంలోనే నెంబర్ టూ పొజిషన్ ను చేజిక్కించుకుని అంతర్జాతీయ కీర్తి సంపాదించారు. ఇది బయటి ప్రపంచానికి తెలిసిన సత్యం. ఆమె ఎంత దేశముదురో ఆలస్యంగా బయటపడింది. ఎందుకంటే తిమింగలమైనా అరగలేనంత తింటే వాంతి చేసుకుంటుంది. చిత్ర పని కూడా అంతే అయ్యింది.

2014 నుంచి చిత్రా రామక్రిష్ణ పరిధి దాటారని ఎన్ఎస్ఈ బోర్డ్ గుర్తించింది

2014 నుంచి చిత్రా రామక్రిష్ణ పరిధి దాటారని ఎన్ఎస్ఈ బోర్డ్ గుర్తించింది. కానీ ఆమె శక్తి ముందు వారంతా చిన్నవారయ్యారు. ఆర్దిక అవతకవలకు పాల్పడుతుందని తెలిసినా కూడా మందలించలేకపోయారు.2013 నుంచి 2016 వరకు నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సీఈవోగా, ఎండీ గా బాధ్యతలు నిర్వహించిన ఆమె తనకు నచ్చిన పనులు చేశారు. యేథేచ్చగా ఆర్ధిక ఉల్లంఘలనకు పాల్పడ్డారు. అందులో ఒకటి కొలొకేషన్ స్కామ్. అంటే తనకు నచ్చిన స్టాక్ మార్కెట్ బ్రోకర్లకు ముందుగా డేటాతో పాటు ప్రైస్ తెలిసేలా సర్వర్ లకు హై స్పీడ్ కనెక్టివిటీ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు ఈలోపు చిత్రారామక్రిష్ణ స్కామ్ లతో కోట్లు వెనుకేయడం మొదలు పెట్టింది. అందరికీ అన్నీ తెలుస్తున్నా బోర్డ్ ఏమీ అనలేదు. అంటే వారికి కూడా లంచాలు ఇచ్చారో మరేం జరిగిందో ఏమో తెలియదు. ఈ టైమ్ లోనే ఆమెకు హిమాలయాల్లో ఉండే యోగి పరిచయం అయ్యారు. అతనంటే చిత్రకు వేదవాక్కు. ఆ యోగి చెప్పినట్లు నడుచుకునేది. మామూలుగా స్టాక్ మార్కెట్ కు చెందిన లావా దేవీలు కానీ, ప్రైస్ విషయాలు కానీ తన ఇంట్లో వారికి కూడా మొహామాటానికి సైతం చెప్పకూడదు. ఎంతో నమ్మకంగా స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నడుస్తాయి. కానీ ఏ స్టాక్ ఎలా కదులుతుంది. దేని రేటు ఎంత అనే విషయం తో పాటు తన స్టాఫ్ ఎవరెవరో కూడా ఆ రహస్య యోగితో పంచుకున్నారు. తన అధికారికి మెయిల్ నుంచి అతనికి రిపోర్ట్ లు, డాక్యుమెంట్ లు పంపారు. అంతే కాదు యోగి చెప్పాడని ఆనంద్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని జీవోవోగా నియమించారామె. అతని జీతం ఏడాదికి 15 లక్షలు ఇతర అలవెన్స్ లు. కానీ ఏడాది తిరగకముందే ఆనంద్ కు కోటి 38 లక్షల జీతం పెంచారు. మరుసటి ఏడాది 20 శాతం పెంచి గ్రూప్ ఆఫీసర్ గా ప్రమోషన్ ఇచ్చారు చిత్రా. ఆమె కారణంగా ఎన్ఎస్ఈలో ఆనంద్ హవా నడిచింది. ఇష్టం వచ్చినట్లు ఉద్యోగం చేసేవారు ఆనంద్. వారానికి మూడు రోజులు పనిచేయడానికి అనుమతించి ఎండీ స్థాయి పోస్ట్ క్రీయేట్ చేసి ఆనంద్ కు ఇచ్చారు. వారిద్దమరి మధ్య ఉన్న రహస్య సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు.

అయితే సెబీకి అనుమానం కలిగింది. ఎన్ఎస్ఈ లో ఏదో జరుగుతుందని నిఘా పెట్టింది. మామూలుగా అడ్వైజర్ గా వచ్చిన వ్యక్తి ఆనంద్. కానీ అతని నిర్ణయాల మేరకే చిత్ర పనిచేస్తోందని అందులోని అధికారులను విచారించి తెలుసుకుంది సెబీ. కానీ అందులో స్కామ్ ఉందని సెబీ ఊహించలేదు. పైగా సర్వర్ ను కనెక్ట్ అయ్యేలా స్టాక్ ఎక్స్ చేంజ్ బ్రోకర్ లకు అనుమతిచ్చింది సెబీ. కానీ కొందరికి మాత్రం ఫాస్ట్ గా సర్వర్ కనెక్ట్ అయ్యేలా ప్రత్యేక శ్రుద్ద చూపించి ప్రైస్ లో తేడాలు, లాభాలు వచ్చేలా చేశారని ఆరోపణలు రావడంతో చిత్ర పనితీరుపై విచారణ మొదలు పెట్టింది సెబీ. దీంతో నా మీద అనుమానం కలుగుతుందని, తాను చేసిన మోసాలు, లంచాల భాగోతం బయటపడుతుందని తెలివిగా 2016 లో రాజీనామా చేసి వెళ్లిపోయారు చిత్ర. ఆ లోపే కావాల్సినంత సంపాదించుకుని వెళ్లిపోయింది. ఆనంద్ కూడా పెట్టే బేడా సర్దుకున్నాడు.

చిత్రా రామక్రిష్ణ
చిత్రా రామక్రిష్ణ

అయితే చిత్ర చేసిన సైడ్ స్కామ్ ల గురించి వెతుకుతుంటే సెబీకి పెద్ద స్కామ్ దొరికింది. ఆమె మెయిల్ కు ఓ హిమాలయ గురువు నుంచి వేల కొద్ది మెయిల్స్ వచ్చాయి. ఈమె నుంచి కూడా వెళ్లాయి. వాటిని పరిశీలిస్తే కళ్లు బయిర్లు కమ్మే నిజాలు తెలిశాయి. హిమాలయాల్లో ఉండే యోగి కి జాతీయ స్టాక్ ఎక్స్ చేంజ్ మొత్తం అప్పగించినట్లు తేలింది. అతను చెప్పిన వ్యక్తినే ప్యూన్ గా నియమించారని విచారణలో గుర్తించారు. ఆ తర్వాత మొత్తం ప్రపంచంలోనే పెద్దదైన, అత్యంత పారదర్శకంగా పనిచేసే ఎన్ఎస్ఈ ని ముక్కు మొహం తెలియని మూడో వ్యక్తి చేతిలో పెట్టారని గుర్తించింది. అయితే తనపై అనుమానం కలిగిందని, ఏ క్షణమైనా విచారణకు పిలుస్తారని ఆమె భయపడింది. కానీ ముందే సర్దుకుంది. కో లొకేషన్ స్కామ్ గురించి వెతుకుతుంటే రహస్య యోగి లింక్ బయటపడింది. తాను నియిమించిన ఆనంద్ కు ఇష్టం వచ్చినట్లు జీతం పెంచి అందులో కొంత భాగం తాను తీసుకుందని సెబీ ఆరోపిస్తోంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసింది. అంతే కాదు రాజీనామా కు ముందు పెద్ద ప్లానే వేసిందట చిత్ర. ఏకంగా ఎన్ఎస్ఈ పేరుతో పదివేల కోట్ల కు సెల్ఫ్ లిస్టింగ్ చేసి ఐపీఓకి వెళ్లాలనుకుంది. కానీ అందుకు కేంద్రం ఒప్పుకోకపోయినా ఆర్ధిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సెబీకి లేఖలు రాసింది చిత్ర. కానీ కేంద్రం ఒప్పుకోకపోవడంతో ఈ మోసం బయటపడలేదు. ఐపీఓకి వెళ్లలేదు. తన పాచిక పారలేదని, దోచుకున్నది చాలని మెల్లిగా రాజీనామా చేసి బయటపడింది. అయితే సర్వర్ లనుంచి ఇతర ఆర్ధిక విషయాల గురించివిచారణ చేస్తుంటే ఎండీగా పనిచేసినా అతను చెప్పినట్లే స్టాక్ మార్కెట్ నడిపిందనే రహస్యం బయటపడింది.

చిత్ర, ఆనంద్ ఇళ్లపై ఐటీ రెయిడ్ లు జరిగాయి. ఇక చిత్రను విచారించారు అధికారులు. ఇంతకీ యోగి ఎవరు? అతనికి ఎందుకు స్టాక్ మార్కెట్ ను అప్పగించావని అడిగితే ఆమె సరైన సమాధానం చెప్పలేదు. కానీ ఆ యోగి నిరాకారుడు. సిద్ద పురుషుడు. హిమాలయాల్లో ఉంటాడు. తాను కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి అతనే నన్ను ఎదిగేలా ప్రోత్సహించాడు. అసలు ఆ వ్యక్తి రూపం లేని దేవుడు. ఆయన చెప్పినట్లే చేశాను. స్టాక్ మార్కెట్ అతనికే అప్పగించానని పూంపుహార్ కథలు చెప్పింది. అయితే విచారణలో ఆ రహస్య వ్యక్తి ఆనంద్ అయినా ఉండాలి లేదంటే మరో వ్యక్తి అయినా అయి ఉండాలని అనుమానిస్తున్నారు సెబీ అధికారులు. ఎందుకంటే మొత్తం స్టాక్ ఎక్స్ చేంజ్ కి ఆమె ఎండీ అయినా దాదాపు నాలుగేళ్లు యథేచ్చగా బయటి వ్యక్తులకు అప్పగించింది. ఇష్టం వచ్చినట్లు జీతాలు పెంచడం. స్టాక్ మార్కెట్ షేర్ లను ప్రభావితం చేయడం వరకు ఎన్నో అవినీతి పనులకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. పలు కంపెనీల విలువలు పెంచడం, తగ్గించడం కూడా చేసి ఉంటారనేది మరో ఆరోపణ. మరి చిత్రను వెనుకుండి నడిపిన ఆయోగి ఎవరనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనేది సినిమా అయితే….చిత్రను నడిపించిన ఆ రహస్య యోగి ఎవరనేది నిజ జీవితం. ఈ మిస్టరీ తేలుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఆమెను స్టాక్ మార్కెట్ లనుంచి మూడేళ్లు నిషేధించి మూడు కోట్ల ఫైన్ వేసింది సెబీ. మరి చిత్రా రామక్రిష్ణకు మొదటి నుంచి సాయం చేసిన వ్యక్తి సొంత వ్యక్తా లేదంటే ఇంకేదైనా రహస్యం ఉందా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి మున్ముందు ఈ స్కామ్ లో మనం ఇంకెన్ని చిత్రాలు చూడాలో.

Previous articleJob : వామ్మో… భర్త గవర్నమెంట్ ఉద్యోగం కోసం అలా చేసిన భార్య…
Next articleAshwini Dutt : జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం అంతమంది పని చేశారా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here