Mohan Babu : మోహన్ బాబు కుటుంబానికి ఆ స్టార్ హీరో ఫ్యామిలీతో విబేధాలు స్టార్ట్ అయ్యాయా…?

510

Mohan Babu : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ మోస్ట్ స్టార్ హీరోలైన మంచు మోహన్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి ల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మంచు మోహన్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి తమ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని పలు ప్రెస్ మీట్లలో కూడా చూపించారు. అయితే ఈ ఇద్దరి కుటుంబాలు కూడా చలన చిత్ర పరిశ్రమలో క్రేజ్ మరియు ఫేమ్ పరంగా సమతూకంగా ఉన్నాయని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి దాదాపుగా క్రికెట్ టీమ్ కి సరిపోయెంతమంది హీరోలు ఉన్నారు. ఇక మంచు మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా నలుగురు నటీనటులు సినిమా ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఒక పక్క హీరోగా రాణిస్తునే మరోపక్క మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవీ బాధ్యతలను కూడా చేపట్టాడు. కాగా గత కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని దీంతో వీరిద్దరికీ సరిగ్గా పడటం లేదని పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి. ఐతే ఇందుకు గల కారణాలు లేకపోలేదు. ఆ మధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలలో చిరంజీవి కుటుంబ సభ్యులు ఎక్కువగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి సపోర్ట్ చేసారు. కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఎన్నికలలో ఓటమి పాలైంది.

కాగా తాజాగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టికెట్ రేట్ల విషయంలో సందిగ్ధత నెలకొనడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి ఈ సమస్యకి ఒక పరిష్కారం తెచ్చారు. దీంతో అప్పటి నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో ముఖ్యంగా మా అసోసియేషన్ అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి మంచు విష్ణు టికెట్ రేట్లను పరిష్కారం చేసేందుకు చొరవ చూపకపోవడంతో కొందరు సినీ ప్రముఖులు బహిరంగంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కానీ మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం ఈ టికెట్ రేట్ల సమస్య కోర్టులో ఉందని కాబట్టి తాను మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని స్పష్టం చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో మంచు మోహన్ బాబు కి కూడా ఆహ్వానం అందిందని కానీ కొందరు మధ్యలో రాజకీయాలు చేసి ఆహ్వానం అందకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దీంతో ఈ ప్రెస్ మీట్ జరిగినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి మోహన్ బాబు కి మధ్య మనస్పర్థలు, విభేదాలు ఏర్పడ్డాయని కొందరు చర్చించుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే అప్పటీకే చిరంజీవి కి వై.యస్ జగన్ మోహన్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో టికెట్ల విషయాన్ని చిరంజీవి చాలా దగ్గరుండి పరిష్కరించడాని అంతేతప్ప అందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 30 సంవత్సరాలుగా ఉన్న చిరంజీవి ఇండస్ట్రీ కోసమే ఈ పని చేశారని అలాగే తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా తెలుగు ప్రముఖ డైరెక్టర్ రత్నంబాబు ఓ ప్రముఖ యూట్యూబ్ చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యు లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా అభిమానులు అనుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి మరియు మంచు మోహన్ బాబుల మధ్య విభేదాలేవి లేవని తెలిపాడు. అంతేగాకుండా మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారని అలాగే మెగాస్టార్ చిరంజీవిని వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి మరియు మంచు మోహన్ బాబు ఎప్పటినుంచో మంచి స్నేహితులని అలాంటి ఈ స్నేహితులను ఇప్పుడిప్పుడే వచ్చిన ఈ రాజకీయాలు విడదీయలేవని అభిప్రాయం వ్యక్తం చేసాడు. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు, విభేదాలు ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలకి దాదాపుగా పులిస్టాప్ పడింది.

Previous articlePedarayudu : పెదరాయుడు చిత్రం కోసం రజినీకాంత్ అంత తీసుకున్నాడా..?
Next articleపేస్ మాస్క్ : ఎలాంటి మచ్చలనైనా పోగొట్టే చిట్కా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here