Sudhakar అప్పట్లో ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో…

434

Sudhakar అప్పట్లో ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట…

Sudhakar : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని వందల కుపైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ సీనియర్ కమెడియన్ సుధాకర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటుడు సుధాకర్ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే సమయంలో టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చెన్నైలో ఉన్నటువంటి ఓ చిన్న రూమ్ లో ఉండేవాడు. దీంతో అప్పట్లో వీరిద్దరూ కలసి సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళు. ఈ క్రమంలో నటుడు సుధాకర్ కి మొదటగా పునాదిరాళ్ళు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఆ చిత్రంలో నటించ లేకపోయాడు. దీంతో చివరికి ఈ అవకాశం హీరో చిరంజీవి కి రావడంతో ప్రస్తుతం చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గా గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ నెంబర్వన్ హీరో గా కొనసాగుతున్నాడు.

అయితే నటుడు సుధాకర్ కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తమిళం, మలయాళం భాషల్లో హీరోగా నటించాడు. దీంతో అప్పట్లో నటుడు సుధాకర్ కి కూడా మంచి క్రేజ్ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు నటుడు సుధాకర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొందరు ప్రముఖ వ్యక్తులు చేసిన రాజకీయాలకు బలైపోయాడు. దీనికితోడు నటుడు సుధాకర్ తన చిత్ర కథల విషయంలో కొంత మేర సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో అందుకున్నాడు. దీంతో హీరోగా నటుడు సుధాకర్ సినీ కెరియర్ కి పుల్ స్టాప్ పడింది. అయినప్పటికీ దాదాపుగా 40 కి పైగా చిత్రాలలో హీరోగా నటించాడు. ఆ తరువాత నటుడు సుధాకర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మారి బాగానే ఆకట్టుకున్నాడు. అయితే నటుడు సుధాకర్ తమిళ్ భాషలో హీరోగా నటించే సమయంలో ప్రముఖ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ తో ప్రేమలో పడ్డాడని, తొందర్లోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అప్పట్లో పలు కథనాలు బలంగా వినిపించాయి.

Sudhakar
Sudhakar

కానీ నటుడు సుధాకర్ ఇటీవలే ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని రాధిక శరత్ కుమార్ తో తన ప్రేమాయణం గురించి స్పందించాడు. ఇందులో భాగంగా రాధిక శరత్ కుమార్ తనకి సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి చాలా మంచి స్నేహితురాలని దాంతో తాము చాలా సన్నిహితంగా ఉంటామని చెప్పుకొచ్చాడు. అలాగే ఎక్కడైనా కలిసి మాట్లాడేటప్పుడు కూడా రాధిక శరత్ కుమార్ తనతో కొంతమేర చనువుగా ఉంటుందని ఈ విషయం తెలియనటువంటి కొందరు తమ మధ్య ఏదో ఉందని అనుకున్నారని తెలిపాడు. అంతేగాకుండా తాను హీరోగా నటిస్తున్న సమయంలో ఎక్కువ చిత్రాల్లో రాధిక శరత్ కుమార్ తో కలిసి నటించానని ఈ విషయం కూడా తమ మధ్య ఏదో ఉందంటూ రూమర్లు స్ప్రెడ్ కావడానికి కారణమైందని తెలిపాడు. కానీ తాము మాత్రం ఇప్పటికీ చాలా మంచి స్నేహితులమని అంతేతప్ప తమ మధ్యలో ప్రేమ, గీమా వంటివి లేవని స్పష్టం చేశాడు.

అయితే నటుడు సుధాకర్ కి ఆ మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో నటుడు సుధాకర్ చికిత్స కి కొంతమేర ఆర్థిక సహాయం అవసరం కావడంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందించి తమకు తోచినంత సహాయం చేశారు. ప్రస్తుతం నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి బాగానే కుదుటపడింది. దాంతో ఆ మధ్య ఇ… ఈ… అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇటీవలే నటుడు సుధాకర్ తన కొడుకు మైఖేల్ బెన్నీ ని తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం తన కొడుకు మైఖేల్ నటనలో శిక్షణ పొందుతూ పలు మెలకువలను నేర్చుకుంటున్నాడని తొందర్లోనే తన కొడుకు హీరోగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నాడు.

If you like our article about Sudhakar

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleDivya Bharti మత్తులో చేసిన తప్పు వల్లే మరిణించిందా…?
Next articleBride సరిగ్గా తాళి కట్టే సమయానికి ప్రసవించిన…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here