ఈ ఒక్క పని తో పాదాల పగుళ్లు పూర్తిగా పోతాయి
Cracks in Soles : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలి అనుకుంటారు దీని కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. దీనికోసం ముఖం చేతులు జుట్టు మొదలైనవాటిపై చూపించే శ్రద్ధ పాదాల దగ్గరికి వచ్చేసరికి చూపించరు. దీనికి కారణం పాదాలను ఎవరు చూస్తారులే అనే ఆలోచన కూడా కావచ్చు. అయితే ఇక్కడ అందరూ మరచిపోయే విషయం ఏమిటంటే అదే పాదాలపైన మనం గంటలకొద్దీ నిలుచుని ఉంటాము. ఇలా మన పాదాలకు సమయం కేటాయించ లేకపోవడం వలన పాదాలు పగుళ్ల కూడా గురి అవుతున్నాయి.
ఇప్పుడు మనం మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మన కాలి పగుళ్లు తొలగించే చిట్కాలతోపాటు కాలి పగుళ్లు శాశ్వతంగా రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు నివారణ చర్యలు గురించి కూడా తెలుసుకుందాము.
కాలి పగుళ్లు తగ్గించే ఇంటి చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి ముందుగా కావలసిన పదార్థం బంగాళదుంప. ముందుగా బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బంగాళదుంప అనేది పాదాల పగుళ్ళను తగ్గించడానికి మన చర్మాన్ని రిపేర్ చేయడానికి ఓ మాజికల్ రెమిడి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలను మిక్సీలో వేసి కొద్దిగా ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీటిని కలిపి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప గుజ్జు మరొక పాత్రలోకి వడకట్టుకోవాలి. ముఖ్యంగా బంగాళదుంప రసం అనేది మన పాదాల పై ఉండే నలుపు ని ట్యాన్ ని తగ్గించడం మాత్రమే కాకుండా శరీరంపై ఉన్న మృతకణాలను కూడా తగ్గిస్తుంది. తరువాత కావలసిన పదార్థం టూత్ పేస్ట్ .ఏదైనా ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ లేదా మీరు మామూలుగా వాడుకునే టూత్ పేస్ట్ ను తీసుకొని ఒక స్పూన్ మోతాదులో టూత్పేస్ట్ బంగాళాదుంప రసంలో కలపండి. ఇప్పుడు ఈ రెండిటినీ ఒక అర నిమిషం పాటు బాగా కలపండి. టూత్ పేస్టు పాదాల పగుళ్ళను శుభ్రం చేయడానికి బాగా సహాయపడుతుంది. పగుళ్ళ ప్రదేశంలో పేరుకుపోయిన బాక్టీరియాను తొలగించి మృతకణాలను కూడా పూర్తిగా తొలగించి పాదాలను మృదువుగా చేయడంలో పేస్ట్ ఎంతో బాగా పనిచేస్తుంది. తరువాత కావలసిన పదార్థం నిమ్మరసం ఒక అరచెక్క నిమ్మరసం తీసుకుని ఈ మిశ్రమంలో కలపాలి. అయితే మీరు రసాన్ని పిండి న తరువాత ఈ నిమ్మ చెక్కన పడేయకుండా పక్కనే పెట్టుకోండి. దీనితో మనకు చివరిలో పని ఉంటుంది. నిమ్మరసం అనేది కాలి పగుళ్లను తగ్గించడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మరసం లో ఉండే సి విటమిన్ పాదాల పై నుండి పగుళ్ళను నివారించడమే కాకుండా పాదాలను మృదువుగా చేయడానికి బాగా సహాయపడుతుంది చివరిగా మనకి కావాల్సింది ఉప్పు. మనం వంట గదిలో ఉపయోగించే ఉప్పుని కానీ లేదా బ్లాక్ సాల్ట్ కానీ ఒక ముప్పావు స్పూన్ మోతాదులో తీసుకొని దీనిలో కలుపుకోవాలి. వీటన్నిటినీ ఒకదానితో ఒకటి బాగా కలిసే లాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది ఒక సహజ సిద్ధమైనటువంటి క్లన్ జర్ లాగా పాదాలను శుభ్రం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పాదాలపై ఉండే బ్యాక్టీరియాను కూడా నివారిస్తాయి. ఇలా మన కాలి పగుళ్ల ను తగ్గించే చిట్కా తయారైపోయింది.
ముందుగా కాళ్ళని శుభ్రంగా కడుక్కోవాలి తరువాత ఇందాక పక్కన పెట్టినటువంటి నిమ్మచెక్క ని తీసుకొని ఈ బంగాళాదుంప రసంలో పిండి బాగా ముంచి ఏ ప్రదేశం లో అయితే పాదాలు పగుళ్ళతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో ఈ నిమ్మచెక్కతో బాగా మసాజ్ చేయాలి. పాదాల పైన నిమ్మచెక్కతో రుద్దడం వలన ఇది ఒక పెడిక్యూర్ లాగా పాదాలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలా మసాజ్ చేసిన తర్వాత ఒక 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని కాళ్లపై అలాగే ఉంచేయాలి. ఈ మిశ్రమంతో కాళ్లు పైభాగంలో కూడా బాగా రుద్ది మసాజ్ చేసుకోవచ్చు. వారానికి మూడుసార్లు ఈ చిట్కాను గనక పాటించినట్లయితే పాదాలలో రక్తప్రసరణ బాగా జరిగి చాలా తొందరగా ఎంత పెద్ద పగుళ్ళు అయినాసరే కచ్చితంగా తగ్గిపోతాయి. అలాగే కాళ్లు పాదాలపై పేరుకున్న మృతకణాలు దుమ్ము ధూళి పూర్తిగా తొలగించి పాదాలపై ఉన్న టాన్ ని కూడా తొలగించి మీ పాదాలను మరింత కాంతివంతంగా మృదువుగా మారుస్తుంది.
Cracks in Soles – ప్రతిరోజు పడుకోడానికి ఒక గంట ముందు బకెట్ నీటిలో
అలాగే ప్రతిరోజు పడుకోడానికి ఒక గంట ముందు బకెట్ నీటిలో ఒక్క స్పూన్ సాల్ట్ వేసి పది నిమిషాలపాటు పాదాలను ఆ నీటిలో ఉంచి ఆ తరువాత పొడి టవల్ తో శుభ్రంగా తుడుచుకొని ఆ తరువాత కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా పెట్రోలియం జెల్లీ లాంటి వాటిని రాసుకుని శుభ్రమైన సాక్స వేసుకుని పడుకోండి. ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటే మీ పాదాలు పగుళ్లు తగ్గి చాలా మృదువుగా అందంగా తయారవుతాయి. పాదాల పగుళ్ళకు ఈ చిట్కాలను వాడడం మాత్రమే కాకుండా కొన్ని జాగ్రత్తలను కూడా తీసుకోవాలి.
శరీరంలో కాలి పగుళ్లు రావడానికి మొదటి కారణం అధిక వేడి మీరు తినే పదార్థాలు లేదా మీ శరీరం వేడి చేసే స్వభావం కలిగి ఉంటే అప్పుడు మీ శరీరం అధిక వేడికి గురి అవుతుంది. అలాంటప్పుడు శరీరంలో నీటి శాతం బాగా పెంచుకోవాలి. ఎందుకంటే చర్మం తేమను కోల్పోతే పొడిబారిపోయి కాలి పగుళ్లు ఏర్పడతాయి. అందుకే ప్రతి రోజు కనీసం ఆరు నుంచి ఏడు గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. చాలా మంది మహిళలు పురుషులు ఉద్యోగరీత్యా ఎక్కువగా సాక్సలు దానిపైన షూ వేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పాదాలలో చెమట చేరి అది బ్యాక్టీరియా గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనితో చెమటతో తడిసిపోయిన పాదాలు తొందరగా పగుళ్ళకు లోనవుతాయి. కాబట్టి ఒకే పొజిషన్లో ఎక్కువ సేపు నిలబడ కండి. ముఖ్యంగా ప్యాడ్ సాక్స్ వేసుకుంటే చెమట నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. వారానికి రెండు సార్లు ఖచ్చితంగా మీ పాదాలను స్కర్బ చేస్తూ ఉండాలి. దీనితో ఆ ప్రదేశంలో పేరుకుపోయిన డెడ్ స్కిన్ అనేది ఏర్పడకుండా ఉంటుంది.
అలాగే ఈ చిట్కాలు జాగ్రత్తలతో పాటు యోగాసనాల ద్వారా కూడా పాదాలను జాగ్రత్తగా కాపాడు కోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఎందుకంటే కొన్ని రకాల ఆసనాల ద్వారా కాలి పగుళ్లుని మనం అరికట్టవచ్చు. ఉదాహరణకు చంద్రబీదఆసనం, బస్త్రీకా ప్రాణాయామం, శీతలీ ప్రాణాయామం, ఇటువంటివన్నీ కూడా కాలీ పగుళ్లను నివారించడానికి సమర్థవంతంగా తోడ్పడే యోగాసనాలు. యోగ గురువులను సంప్రదించి ఈ ఆసనాలు వేస్తూ ఉన్న సరే ఈ కాలీ పగుళ్లను నివారించుకోవచ్చు. మన పాదాలు నేరుగా భూమిని తాకడం వలన ఎన్నో రకాల రోగాలు నయం అవుతాయి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆయుర్వేదికంగా ఇది ఎన్నో సార్లు నిరూపించబడినది. ప్రతి రోజు ఉదయాన్నే కొంత సేపు పచ్చగడ్డి లో చెప్పులు లేకుండా నడిచి చూడండి .పాదాలకి మాత్రమే కాదు కంటి చూపుకి కూడా చాలా మంచిది.
If you like our article about Cracks in Soles
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites