Cyrus Mistry:ఆకాశంలో అంత్యక్రియలు..ఆ సమాజపు వింత ఆచారం..
పార్శీ సమాజంలో ఆచారాలు ప్రక్రుతిని అనుసరించి ఉంటాయి. ఈ పార్శీ కమ్యూనిటీ గతంలో ఇరాన్ నుంచి భారత్ కు వలస వచ్చారు. వీరంతా వ్యాపారంలోనే ఉంటారు. అయితే ఎవరైనా వ్యక్తి చనిపోతే పార్శీ సమాజంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మ్రుతదేహం కూడా ప్రక్రుతిలోనే నేలకు, నీటికి తాకకుండా అంతరించిపోవాలి. దీనినే ఆకాశపు అంత్యక్రియలంటారు. ఆకాశం కింద చేస్తారు. అంటే సూర్యుడి కాంతిలో. కాబట్టి అలా అంత్యక్రియలను ఆ పేరుతో పిలుస్తున్నారు. చనిపోయిన మనిషిని అపవిత్రంగా ఈ సమాజం భావిస్తుంది. అందుకే వీళ్లు హిందూ ఆచారం ప్రకారం వీరు మ్రుతదేహాన్ని చితిపై ఉంచి కాల్చివేయరు. లేదా ఇస్లాం. క్రిస్టియన్ ఆచారాల ప్రకారం భూమిలో పాతిపెట్టరు. ఎందుకంటే కాల్చినా అగ్ని మలినం అవుతుంది. చనిపోయిన వ్యక్తి తాలూకు బూడిద నేల పై పడుతుంది. గాలిలో కలిచి కలుషితం చేస్తుంది. లేదంటే నీరు తాకితే నీళ్లు కూడా పాడైపోతాయి. ఇక మట్టిలో పెడితే ఆ ప్రాంతం ఎన్నటికీ పనికిరాదు. ఎందుకంటే మనిషి తాలూకు ఎముకలు ఇతర శరీర మలినాలు అందులో ఉంటాయి. అందుకే భూమిలోనూ పాతిపెట్టడం తప్పని పార్శీ సమాజం భావిస్తుంది. వారీ ఆచారాల్లో నిప్పుకు నీటికి, నేలకు దూరంగా మ్రతదేహం అంతరించాలి. ఆత్మ గాలిలోనే ఉండాలి. దీనిని కొన్ని వందల ఏళ్లుగా పార్శీ సమాజం పాటిస్తూ వస్తోంది.
ఈ పద్దతులను అనుసరించేందుకు దక్మా పద్దతిలో అంత్యక్రియలు చేస్తారు. దానినే ఇంగ్లీష్ లో టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు. అంటే ఒక డోమ్ లాంటి కట్టడం ఉంటుంది. దానికి మెట్లలాంటి దారితో పాటు చిన్న ద్వారం ఉంటుంది. దానిలో వేసేముందు ప్రార్థనలు చేస్తారు. కొంత మంది భక్తిగీతాలు పాడుతారు. పార్శీ ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత డోక్మాలో ఉంచి దూరంగా వెళ్లిపోయి సైలెంట్ గా చూస్తారు. అప్పుడు గద్దలు, రాబందులు వచ్చి మ్రుతదేహాన్ని తింటాయి. మామూలుగా మ్రుతదేహాలు ఎప్పుడు వస్తాయా అని వందల సంఖ్యలో రాబంధులు ఎదురుచూస్తాయి. డొమ్ చుట్టూ వాలి ఉంటాయి. అవి శరీరాన్ని ఒక గంటలోనే మొత్తం తినేస్తాయి. ఎముకలు తప్ప ఏమీ ఉండవు. ఆ తర్వాత మిగిలినవి సహజంగానే రాబంధుల కారణంగా ఎముకలు కూడా కొన్నాళ్లకు అంతర్ధానం అయిపోతాయి. ఇలా స్వచ్చంగా టవర్ ఆఫ్ సైలెన్స్ పద్దతిలో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తారు.
కానీ నేడు రాబందులు ఎక్కడ ఉన్నాయి. ఒకప్పుడు ధనవంతులంతా కలిసి పార్శీల కోసం టవర్ ఆఫ్ సైలెన్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. కానీ రాబంధులు అంతరించిపోవడంతో వారి కుటుంబీకులు చనిపోతే అంత్యక్రియలనేవి వివాదంగా మారిపోయాయి. అతిగా ఆచారాలను అవలంబించేవారు ఆధునిక పద్దతుల్లో అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకునేవారు కాదు.
టాటా మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తాను ప్రయాణిస్తున్న బెంజ్ కారు డివైడర్ ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న సైరస్ తో పాటు అతని క్లోజ్ ఫ్రెండ్ జహంగీర్ పండోల్ అక్కడికక్కడే మరణించిన విషయం తెలిసిందే. కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే వారు చనిపోయారు. మరో విషాదరకమైన విషయం ఏంటంటే ఆయన గుజరాత్ లోని ఉద్వాడా వెళ్లి వస్తున్నారు. పార్శీలు అంటే జోరువాస్ట్రియన్ నమ్మకాన్ని అనుసరించేవారికి ఇది చాలా పవిత్రమైంది. అక్కడకు వెళ్లి ప్రార్థనలు చేసి వస్తున్నారాయన. దురద్రుష్టం… పవిత్ర స్థలానికి వెళ్లి వస్తుండగా చనిపోయారు సైరస్ మిస్త్రీ.
అయితే సైరస్ పార్శీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి.
టాటా సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా ఈ టవర్ అఫ్ సైలెన్స్ లోనే జరిగాయి. మరి మనిషిని కాల్చకుండా,పూడ్చకుండా,నీటిని ఉపయోగించకుండా,మనిషికి అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారో ఈ వీడియోలో చుడండి…
Read our Another Article:Krishnam Rahu-Chiranjeevi