Dasari Narayana rao : అందుకే ఒకప్పటి ఈ లెజెండరీ దర్శకుడి కొడుకులు సక్సెస్ కాలేకపోయారా..?

150

Dasari Narayana rao : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 150 కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించి లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగు ప్రముఖ స్వర్గీయ దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు తన సినీ కెరీర్లో ఎంతో మంది నటీనటులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి లైఫ్ ఇచ్చారు. ఈ క్రమంలో కేవలం నటీనటులను మాత్రమే కాకుండా పలువురు సింగర్లు మరియు ఇతర టెక్నీషియన్లు అలాగే నూతన దర్శకులకు కూడా అవకాశాలు కల్పించారు.

మరోవైపు ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఈ క్రమంలో సినీ రంగంలో ప్రధానం చేసేటువంటి పలు నంది అవార్డులను కూడా అందుకున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండి సినిమా ఇండస్ట్రీ లో తలెత్తిన సమస్యలను కూడా చక్కబెట్టారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఇంత సేవ చేసినటువంటి దర్శకుడు దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో తన వారసత్వం మాత్రం నిలబెట్టుకోలేక పోయారు.

ఈ క్రమంలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి దర్శకుడు దాసరి నారాయణరావు తన ఇద్దరి తనయులైన అరుణ్ కుమార్ దాసరి మరియు హరిహర ప్రభులను మాత్రం సినిమా ఇండస్ట్రీలో సెటిల్ చెయ్యలేకపోయాడు. ఇందులో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో దాసరి అరుణ్ కుమార్ ఒకటి, రెండు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నప్పటికీ క్రమక్రమంగా కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో పలు డిజాస్టర్లను అందుకున్నాడు. దీంతో దర్శకుడు దాసరి నారాయణరావు తన చివరి రోజుల్లో కూడా అరుణ్ కుమార్ ని హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేసాడు. ఈ క్రమంలో తరచూ చాలామంది దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరిపి తన కొడుకుని హీరోగా నిలబెట్టేందుకు మంచి స్టోరీ కోసం వెతికేవాడట.

అలాగే దాసరి అరుణ్ కుమార్ ని సినిమాల్లో నటించమని ఎంతగానో ప్రోత్సహించినప్పటికీ అప్పటికే వరుస ప్లాపులతో ఉన్నటువంటి దాసరి అరుణ్ కుమార్ సినిమాల్లో నటించడానికి సుముఖంగా లేకపోయినప్పటికీ తన వెనుక నేనున్నానని దాసరి నారాయణరావు ధైర్యం ఇచ్చాడని పలు సందర్భాలలో దాసరి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. దీంతో తాను హీరోగా నటించాలనుకున్న సమయంలో దురదృష్టవశాత్తు తన తండ్రి దాసరి నారాయణరావు 2017 వ సంవత్సరం మే 30 తారీఖున హఠాత్తుగా గుండె పోటుతో మరణించాడు. అయితే దర్శకుడు దాసరి నారాయణరావు మరణాంతరం దాసరి అరుణ్ కుమార్ మరియు దాసరి హరిహర ప్రభుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

ఇక దాసరి నారాయణరావు రెండవ తనయుడు హరిహర ప్రభు విషయానికొస్తే ఇతడు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోయినప్పటికీ పలు చిత్రాలకు నిర్మాతగా సహ నిర్మాతగా వ్యవహరించాడు. అయినప్పటికీ పెద్ద గా నిలదొక్కుకోలేకపోయాడు. దీంతో ఈ మధ్యకాలంలో దాసరి అరుణ్ కుమార్ మరియు హరిహర ప్రభుల ఈ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తడంతో ఇరువురు ఎడమొహం, పెడమొహం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా ఆ మధ్య ఓ వ్యక్తి తనకి ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయల సొమ్ముని ఇద్దరూ ఇవ్వకుండా ఎగ్గొట్టారని దాంతో ఇల్లు జప్తు చేస్తామని నోటీసులు కూడా పంపించాడు.

ఇక దాసరి అరుణ్ కుమార్ కూడా ఇటీవలే మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. ఏదేమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చినటువంటి దర్శకుడు దాసరి నారాయణరావు పేరుని మాత్రం ఆయన తనయులు నిలబెట్టలేకపోయారని సినిమా ఇండస్ట్రీలో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Previous articleweight loss ఈ పొడి వలన ఎంత లావుగా ఉన్నా తగ్గిపోవాలిసిందే
Next articlePedarayudu : పెదరాయుడు చిత్రం కోసం రజినీకాంత్ అంత తీసుకున్నాడా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here