ప్రపంచంలో ఎన్నో వింతలు చూసి ఉంటారు. మరెన్నో భీకరమైన విషయాలు విని ఉంటారు. కానీ నిజమైన మనిషి దెయ్యంలా మన ముందు కనిపిస్తే. ప్రాణం గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇది నిజం. ఆమె పేరును చీకట్లో మూడు సార్లు పిలిస్తే మీకు నరక లోకం డైరెక్ట్ గా కనిపిస్తుంది. పిలవడం అంటే మామూలుగా కాదు. అర్దరాత్రి….ఎవ్వరూ లేని సమయంలో గది డోర్ వేసుకుని పెద్ద అద్దం ముందు నిలబడండి. చేతిలో క్యాండిల్ పెట్టుకుని కొద్ది సేపు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అలజడి లేకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు…క్యాండిల్ ని అంటించి అద్దంలోకి చూడండి. చూసి బ్లడీ మేరీ,బ్లడీ మేరి, బ్లడీ మేరీ అని పిలిచి క్యాండిల్ ను ఊదేయండి. అంతే మీరు జీవితంలో చూడని ఒక భీకరమైన, అతి భయంకరమైన ఆకారం మీ ముందు కనిపిస్తుంది. ముందు ఒక వింత ఆకారం కనిపిస్తుంది.తర్వాత మెరుపు లాంటి కళ్లు మీ ఒళ్లు గగుర్పిరిచేలా చేస్తాయి. కళ్లంటే అవి మనుషులకు ఉండేంటివి కావు. గ్లో మాత్రమే అందులో కనిపిస్తుంది. ఆ రూపం వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ప్రాణం పోయినా కూడా పోవచ్చు. ఒక్క సారి బ్లడీ మేరీ అద్దంలో కనిపించగానే అసలు విషయం మొదలువుతుంది. మీ కళ్లను పీకేయొచ్చు. మీ శరీరాన్ని తన గోళ్లతో రక్కి చంపేయొచ్చు. మీరే బాత్ రూమ్ నుండే కాదు ఈలోకం నుండే మాయం కావచ్చు. ఇక మీ అదృష్టం బాగుంటే బ్లడీ మేరీ ఒకసారి కనిపించి మాయమవచ్చు కూడా. ఇది ఒక యదార్ద గాథ. ఈ బ్లడీ మేరీ కథ కు పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిజంగానే జరిగిన విషయం. బ్లడీ మేరీ అనేది దెయ్యం కాదు, రక్తం తాగే పిశాచి అంతకన్నా కాదు. ఒకప్పుడు ఆమె అందమైన యువతి. అయితే ప్రాణాలతో బయటపడ్డవాళ్లు…మేం బ్లడీమేరీని చూశామని చెప్పారు. ఆ తర్వాత ఇది…ఒక బ్లడీ గేమ్ గా మారింది. ఇంగ్లండ్ లోని కథ ప్రకారం మేరీ ట్యూడర్ అప్పటి ఇంగ్లీష్ చక్రవర్తి ఎనిమిదవ హెన్రీ కుమార్తె. హెన్నీ అత్యంత నీచుడు. తన పెళ్లాలను కూడా దారుణంగా చంపాడు. ఇక తన పక్కన ఉన్నవాళ్లను ఎందుకు చంపుతాడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మొదటి భార్య కూతురైన మేరీ పెరిగి పెద్దదైంది. ఆమెకు ఒక చక్రవర్తితో పెళ్లైంది. తన కు పెళ్లైనా కూడా పిల్లలు కావడం లేదు. కానీ కొన్నేళ్ల తర్వాత ఆమె రాణి అయ్యాక ఒక సారి ప్రెగ్నెంట్ అయింది. అంతా యువరాజు పుడతారని అనుకున్నారు. ఆమె కడుపు కూడా పెరిగిపెద్దదైంది. కానీ తొమ్మిది నెలలు నిండినా కూడా ఆమె డెలివరీ కాలేదు. దీంతో రాజ్యమంతా ఆమె గురించి తప్పుగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే పది నెలలకు ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువు వింత ఆకారంలో ఉండి చనిపోయింది. తర్వాత కూడా ఇలానే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆమెకు మళ్లీ మరో పిశాచి పిల్ల పుట్టి చనిపోయింది. ఆ తర్వాత ఆమె చనిపోయే నాటికి కూడా…ఆమెకు సంతానం కలగలేదు.కానీ ఆమె చనిపోకముందే దెయ్యంలా మారి ఈ భూమి మీద నుండే లేకుండా పోయింది. ఆమెకు బ్లడీ మేరీ అనే పేరు మాత్రం వచ్చింది. ఎవరో ఒక రోజు క్యాండిల్ పట్టుకుని ఆమె గురించి తలుచుకుని బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ అని మూడు సార్లు పలికి క్యాండిల్ ఊదేయగానే బ్లడీ మేరి కనిపించిందట. ఆ తర్వాత కొంతమందికి ఈ విషయం తెలిసి ఈ గేమ్ ఆడితే వాళ్లు దారుణంగా చనిపోయారట.బతికినవాళ్లు మాత్రం బ్లడీ మేరీ గురించి చెబుతూనే వచ్చారు. దీంతో ఈ గేమ్ చాలా ప్రాంతాలకు పాకింది. మరికొన్ని చోట్ల …అమావాస్య రోజు క్యాండిల్ పట్టుకుని బాత్ రూమ్ లోకి వెళ్లి…ఎవరూ లేరని చూసుకుని ఈ బ్లడీ గేమ్ ఆడోచ్చు. ఒక్క సారి అద్దం ముందు నిలబడి….ఐ స్టోల్ యువర్ బేబీ, ఐ స్టోల్ యువర్ బేబీ, ఐ స్టోల్ యువర్ బేబీ అంటే చాలు….అంతే సంగతులు. కనుగుడ్లు పీకేసి ఘోరమైన చావును చూపిస్తుందట. అలా బ్లడీ మేరి కథ…స్టోరీ చరిత్రకెక్కింది.
కానీ బ్లడీ మేరీ కథను కొంత మంది రచయితలు కూడా రాసిపోయారు. వాళ్లు ప్రత్యక్షంగా బ్లడీ మేరీ ని చూసిన వాళ్లేనట. వారి ప్రకారం…మేరీ ట్యూడర్ అందవిహీనంగా ఉండేదట. దీంతో తాను అగ్లీగా ఉంటానని ఆమె ఫీలయ్యేది, మానసిక ఆందోళనకు గురయ్యేది. మానవలోకంతో పరిచయం లేకుండా పెరిగింది. అద్దంలో కూడా చూసుకునేది కాదు. దీంతో ఆమె బయటి ప్రపంచంలోకి రావడానికి కూడా ఇష్టపడేది కాదు. చాలా మందికి హెన్రీ చక్రవర్తి కూతురు పేరు మాత్రమే తెలుసు కానీ ఆమెను చూసింది చాలా తక్కువ మంది. ఆమె 16వ పుట్టిన రోజు న మేరీ తల్లి ఒక ఖరీదైన గౌనును తెప్పించి కానుకగా ఇచ్చింది. దానిని అయిష్టంగానే ధరించిన మేరీ ఒక సారి అద్దంలో చూసుకోవాలని తపనపడింది. భయంగానే వెళ్లి మిర్రరల్ చూసుకుంది. కానీ ఆ గౌను ధరించాక ప్రపంచంలోనే అత్యంత అందగత్తెను తానేనేమో అన్నట్లుగా అనిపించింది. నిజంగానే ఆ గౌనులో మహా అందంగా వెలిగిపోయింది. దీంతో తనని తాను అందంగా చూసుకోవాలని అనిపించినప్పుడల్లా ఆమె ఆ గౌనును వేసుకుని మిర్రర్ లో చూసుకుని మురిసిపోయేది. ఇలా కొన్నాళ్లు సాగిపోయింది. ఒక రోజు ఇలానే గౌను వేసుకుని చూసుకుంటుండగా ఆమె ఉంటున్న ప్యాలెస్ కి ప్రమాద వశాత్తు మంటలంటుకున్నాయి. మంటలు ఎక్కువ కావడంతో ఆమెను ఎవ్వరూ రక్షించలేకపోయారు. ఇక గౌను ఆనందంలో ఉన్న మేరీ….మంటలను కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆమె ఆ గౌనుతోనే సజీవ దహనమైంది. అందంగా ఉన్నానకున్న సమయంలో చనిపోతున్నాననే బాధ, కోపంతో ఆమె …చనిపోయి… ఆత్మ మాత్రం ఒక మహిళ శరీరంలోకి ఆవహించిందట. ఆమె ఒక మంత్రగత్తెగా బతికి చనిపోయేటప్పుడు మాత్రం తనను చూడాలంటే ఎవ్వరూ లేని సమయంలో, గడియపెట్టుకుని అద్దం ముందు నిలబడి బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, బ్లడీ మేరీ అని మూడు సార్లు పిలిస్తే చాలు నేను వస్తానని చెప్పిందట. అలా బ్లడీ మేరీ కథ విశ్వవ్యాప్తమైంది.