Samudra : ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే చెప్పా.. కానీ బాలకృష్ణ వినలేదు..

1295

Samudra

Samudra : చలన చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి కొంతమంది హీరోలకి హిట్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల నటించకపోవడంతో చివరికి ఈ అవకాశం కాస్తా ఇతర హీరోలకు వరించడంతో ఓవర్నైట్ లోనే స్టార్ హీరోలు అయినటువంటి సందర్భాలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. అయితే ఇందులో 2001వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ హీరో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన సింహరాశి చిత్రంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా సాక్షి శివానంద్, తమిళ ప్రముఖ నటుడు విజయ్ కుమార్, గిరిబాబు, వర్ష, స్వర్గీయ నటుడు అచ్యుత్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు వి. సముద్ర తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా మొదటగా సింహరాశి చిత్రాన్ని తమిళంలో మంచి విజయం సాధించిన “మాయి” అనే చిత్రం ఆధారంగా తెలుగులో సింహరాశి పేరుతో రీమేక్ చేసి విడుదల చేశామని చెప్పుకొచ్చాడు. అయితే మొదటిగా సింహరాశి చిత్రంలో హీరోగా నటించడానికి తెలుగు ప్రముఖ హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ని సంప్రదించామని కానీ బాలకృష్ణ ఈ చిత్రంలో హీరోగా నటించడానికి పెద్దగా ఇష్టపడలేదని తెలిపాడు. దాంతో చివరికి ఈ అవకాశం హీరో రాజశేఖర్ ని వరించిందని కానీ రాజశేఖర్ ఈ చిత్రంలో హీరో పాత్ర కి వందకి వంద శాతం న్యాయం చేశాడని అందువల్లనే సింహరాశి చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Balakrishna's Chennakeshava Redyy
Balakrishna’s Chennakeshava Redyy

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చెన్నకేశవరెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం తనకి వచ్చినప్పటికీ ఆ చిత్రం కథ కొంతమేర పేలవంగా ఉండడంతో తాను చెన్నకేశవరెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు అంగీకరించలేదని చెప్పుకొచ్చాడు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ చిత్రం దర్శకుడు వివి వినాయక్ తో తెరకెక్కించ గా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయిందని చెప్పుకొచ్చాడు.

Director V Samudra comments on Balakrishna

అయితే సింహరాశి చిత్రం తమిళ రీమేక్ అయినప్పటికీ టాలీవుడ్లో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతే కాక ఇటు మ్యూజికల్ గా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దీంతో బి సి సెంటర్లలో సింహరాశి చిత్రం దాదాపుగా 40 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఈ చిత్రంలో అమ్మ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవ్వడంతో ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే హీరో రాజశేఖర్ కి ఈ చిత్రం ఇటు కమర్షియల్ గా మరియు కెరియర్ పరంగా కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Director V Samudra comments on Balakrishna

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleDirector : అప్పులపాలయిన డైరెక్టర్… అప్పులు తీర్చేందుకు అలా చేస్తూ పోలీసులకి చిక్కి… చివరికి….
Next articleKeerthi Suresh : పాపం ఈ హీరోయిన్ ని ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేశారట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here