Dog : వింత ఆచారం : అలాంటి యువతులకు ముందుగా కుక్కలతో పెళ్లి చేస్తారంట…

143

Dog : పెళ్లి అనేది మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందువల్లనే వధువు లేదా వరుడుకి తమకు తగిన జోడిని చూసి కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం మన నిత్య జీవితంలో తరచూ చూస్తుంటాము. ఈ క్రమంలో వధువు లేదా వరుడు జాతకంలో దోషాలు ఉంటే నివారణ కోసమై దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్లి పూజలు చేయడం లేదా దానధర్మాలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం దోషం ఉన్నటువంటి యువతులకు ముందుగా జంతువులతో పెళ్లి జరిపిస్తారు. ఇలా ఎందుకు చేస్తారని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మనదేశంలోని జార్ఖండ్ రాష్ట్ర పరిసర ప్రాంతంలో ఇప్పటికీ పురాతన జాతులకు చెందిన ట్రైబల్ ప్రజలు నివాసం ఉంటున్నారు. దీంతో వీరు తమ పూర్వీకులు పాటించిన ఆచార, సాంప్రదాయాలు ఇప్పటికీ తూ..చా.. తప్పకుండా పాటిస్తుంటారు. అయితే ఇందులో ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ముందుగా దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్లి పురోహితులతో జాతకం రాయిస్తారు. ఈ క్రమంలో యువతి జాతకంలో ఏదైనా దోషం ఉన్నా లేక గండం మరయు యువతికి అంగవైకల్యం ఉన్నా మొదటగా ఈ యువతికి కుక్కతో వివాహం జరిపిస్తారు.

అయితే కుక్క తో వివాహం ఏమిటని వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఈ వివాహం కూడా సమస్త బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్ గానే జరుపుతారు. అలాగే పెళ్లిలో పెళ్లి కొడుకు తో జరిపే ప్రతి తంతూ పెళ్లి కూతురు కుక్క తో కూడా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల పెళ్లికూతురుకి ఉన్నటువంటి దోషం తొలగిపోయి ఆ దోషం కాస్త కుక్కకి తగులుతుందని వారి నమ్మకం. కానీ పెళ్లయిన తర్వాత జరిగే మూడు రాత్రుల ఘట్టంలో మాత్రం కుక్క ని యువతి కి దూరంగా ఉంచుతారు.

అయితే ఈ వివాహం జరిగిన తర్వాత మళ్లీ యువతి యధావిధిగా తన తల్లిదండ్రులు చూసిన వరుడిని పెళ్లి చేసుకుంటుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంతగానో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ ఇలాంటి ప్రజలు మాత్రం ఇప్పటికీ మూఢ నమ్మకాలు, వింత ఆచారాల కారణంగా జీవ హింసకి పాల్పడుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు మాత్రం ఇలాంటి వింత ఆచారాలు కేవలం జార్ఖండ్ రాష్ట్రంలో మాత్రమే కాదని దేశంలో చాలా చోట్ల ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరికొన్ని చోట్లయితే ఓకే యువతిని నలుగురైదుగురు అన్నదమ్ములు కూడా పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు లేకపోలేదు. కాబట్టి కనీసం ఇప్పటికైనా జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు జంతువులతో పెళ్లి జరగడం వల్ల దోషం పోతుందని నమ్ముతున్న ప్రజలకు సరైన అవగాహన కల్పించి జీవహింస ను అరికట్టాలని సూచిస్తున్నారు.

Previous articleAjith Kumar : అజిత్ ని హీరో చెయ్యడం కోసం ఆ హీరోయిన్ చాలా కష్టపడిందట.. దాంతో పెళ్లి కూడా….
Next article24 గంటలు సూర్యుడు ఉండే దేశాలు, అక్కడ అసలు రాత్రే ఉండదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here