Tea ఉదయాన్నే తాగితే ఏం అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

606

ఉదయాన్నేTea తాగితే ఏం అవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు .

Tea : మనం ఏ పని అయితే చేస్తాము ఆ పని ప్రభావం అనేది మన శారీరక మరియు మానసిక ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి చెప్పాలి అంటి ఉదయాన్నే లేచి జిమ్ చేసినట్లయితే శారీరక మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది. కానీ ప్రతి రోజూ ఉదయాన్నే లేచి ఖాళీ కడుపున టీ తాగడం అనేది చాలా పెద్ద చెడు అలవాటు అనేది మీకు తెలుసా. చాలామంది ఈ రోజులలో ఉదయాన్నే లేచి పరగడుపున బెడ్ టీ తీసుకుంటున్నారు. కానీ అలా తాగే వారి శరీరం ప్రమాదంలో పడినట్లే. ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Tea
Tea

ఖాళీ కడుపుతో Tea తాగడం అనేది చాలా ప్రమాదకరం అయితే చాలామంది పాలతో కలిపిన టీ తాగడమే ప్రమాదకరం అని అనుకుంటూ ఉంటారు. కానీ టి ఏ రకంగా ఉన్నా సరే అంటే గ్రీన్ టీ నుంచి బ్లాక్ టీ వరకు ఏ టీ అయినా సరే పరగడుపున తాగడం ప్రమాదకరమే. చాలా మంది అనుకుంటూ ఉంటారు ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే చాలా మంచిది అని కానీ ఎలాంటి టీ తాగిన ప్రమాదకరమే. టీలో ఉండే పదార్థాలు మన పొట్ట లో ఉండి డైజెస్టివ్ జ్యూస్ తో మిక్స్ చేయడం వలన మన కడుపులో ఎసిడిటి పెరుగుతుంది. అలాగే కడుపులో గ్యాస్ ఇలా ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి అందుకే ఖాళీ కడుపుతో టీ ఎప్పుడు తాగకూడదు. ముఖ్యంగా పాలతో చేసిన టీ తాగితే మరింత ప్రమాదకరం. అందుకే ప్రతి రోజు మీరు ఖాళీ కడుపుతో టీ మాత్రం తాగకండి. ఇప్పుడు మనం తెలుసుకుందామా ఖాళీ కడుపుతో టీ తాగితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో. ఉదయాన్నే టీ తీసుకోవడం వల్ల మన కడుపులో ఎసిడిటీని అనేది పెరుగుతుంది ఇది మన శరీరంలో గ్యాస్ని పెంచుతుంది. అలాగే మన రక్తంలోకి ప్రవేశించి కొద్ది రోజులలోనే కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. దీని వలన హార్ట్ ఎటాక్ ప్రాబ్లం వస్తుంది అలాగే లో బిపి, హై బీపీ వంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఖాళీ కడుపుతో టీ ఎప్పుడు తీసుకోకండి. ముఖ్యంగా అధిక బరువు సమస్యతో బాధపడేవారు అస్సలు తీసుకోకండి.

చాలా మంది అనుకుంటూ ఉంటారు కొవ్వు పదార్థాలను తినడం వల్లనే లావు అవుతున్నాము అని. కానీ అది పూర్తిగా నిజం కాదు కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల మన శరీరంలోని జీర్ణక్రియ వ్యవస్థ పూర్తిగా పాడవుతుంది. అలాగే మెటబాలిజం రేటు కూడా తగ్గుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే డైజెస్టివ్ సిస్టం మీద ఈ ప్రభావం చెడుగా చూపిస్తుంది. టి అనేది మన డైజెస్టివ్ సిస్టమ్ ని పాడు చేస్తుంది. అలాగే మన మెటబాలిజమ్ రేటునీ కూడా తగ్గిస్తుంది. దీనివలన మీ పొట్ట పెరుగుతుంది అలాగే మీరు అధిక బరువు లావు కూడా అవుతారు. మీరు లావు అవ్వకూడదు అనుకుంటే ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయండి.

చాలామంది ఈ రోజులలో పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఖాళీ కడుపుతో టీ మాత్రం తాగకూడదు. పైల్స్ ప్రాబ్లం జీవితంలో రాకూడదు అనుకుంటే ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయాలి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మీకు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మలబద్ధకమే పైల్స్ సమస్యకు ముఖ్యమైన కారణం. ఈరోజులలో ఒత్తిడి కారణంగా చాలామందికి సరైన నిద్ర కూడా పట్టడం లేదు. దీనికితోడు మీరు ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. మీకు మంచి నిద్ర కావాలి అనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయండి. చాలామంది ఆకలి సరిగా వేయకుంటే లేదు అని చెబుతూ ఉంటారు. అలా ఆకలి సరిగా వేయకపోవడంతో మీరు అర్థం చేసుకోవాల్సింది ఖాళీ కడుపుతో టీ తాగడం ఎంత ప్రమాదకరమో. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగితే మన డైజెస్టివ్ సిస్టం పాడవుతుంది. దీనివలన రోజురోజుకీ ఆకలి వేయడం తగ్గిపోతుంది. ఇలా ఖాళీ కడుపుతో టీ తాగితే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయండి.

If you like our article about Tea

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleJeedipappu ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమొ తెలిస్తే అసలు వదలరు.
Next articleRachana Benerjee తెరమరుగవడానికి కారణాలు అవేనా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here