Fish Baby : ఉత్తర్ ప్రదేశ్ లోని సహ్రానా పూర్ లో 22ఏళ్ల ఒక గర్భవతి డాక్టర్లే ఆశ్యర్యపోయే బిడ్డకు జన్మనిచ్చింది. ఎంతలా అంటే అసలు అలాంటి బేబీని ఇంత వరకు ఎవ్వరూ చూడలేదు. పుట్టగానే ఆపాప ఏడవలేదు. పైభాగం డెవలప్ అయింది. కానీ రెండు కాళ్లు కలిసిపోయి చేప తోకలా మారింది. రెండు చేతులు కూడా పెరిగి పెరగనట్లుగా ఉన్నాయి. మొత్తం మీద ఏదో వింత జీవిలా ఉంది. దీంతో ఆ డాక్టర్లు ఆశ్యర్యపోవడమే కాదు ఎందుకిలా జరిగి ఉంటుందని ఒక్క సారి చరిత్రను చూడాల్సి వచ్చింది. మెర్మెయిడ్ సిండ్రోమ్ తో లక్షలో ఒకరు ఇలా పుడతారు. ఇది జెనటికల్ గా కానీ డయాబెటిక్ తమ కుటుంబంలో ఉంటే కానీ ఇలాంటివి జరుగుతాయి. కొన్ని సార్లు అధికంగా మందులు తీసుకున్నా కూడా ఇలా జరగొచ్చంటున్నారు డాక్టర్లు.

అయితే ఆక్సఫర్డ్ డాక్టర్ లిండ్సీ ఫిట్జారీ మాత్రం ఉంబ్లికల్ కార్డ్ ఫెయిల్యూర్ కారణంగా ఇలాంటివి జరుగుతాయంటున్నారు. ఆరేడు నెలల వరకు బాగానే ఉన్నట్లు అనిపించినా కూడా ఆర్టిరీ నుండి రక్త సరఫరా కాకపోవడంతో కింది భాగం వృద్ది చెందదు. కేవలం పై భాగం కు మాత్రమే అందుతుంది. కిందిభాగంకు వచ్చే న్యూట్రిషన్ అంతా మళ్లీ రివర్స్ లో ప్లెసెంటాకు తన్నేస్తుంది. దీంతో కింది భాగంలో కాళ్లు కూడా ఏర్పడవు. పైగా స్కానింగ్ లో కిడ్నీలు ఎదగలేదని గుర్తించాక ఇలాంటి పిండం ఉందని అర్దమైంది. అయితే ఈ బేబీ పుట్టిన పది నిమిషాల్లోనే చనిపోయింది. అన్నింటికంటే కూడా అసలు పుట్టింది ఆడో మగో కూడా చెప్పలేని పరిస్థితులలో డాక్టర్లు ఉన్నారు. సైరనోమిలియా అని పిలిచే ఈ వ్యాధి చాలా ప్రమాదకరమం. వచ్చిందంటే బేబీ చనిపోవడం తప్పితే ఇంకేమి ఉండదు. ఇలాంటి వారికి కిడ్నీలు అసలు డెవలెప్ కావు, ఒక వేళ పుట్టి బతికినా కిడ్నీలను ట్రాన్స్ ప్లాంట్ ద్వారా అమర్చి బతికించవచ్చు. కాకపోతే పాప బతికే చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
ఇలానే 1988లో టిఫినీ యార్క్స్ అనే పాపకు తన మొదటి పుట్టిన రోజు జరుపుకోకముందు తన కాళ్లకు ఆపరేషన్ జరిగింది. ఈమె కూడా ఇలాంటి సిండ్రోమ్ కారణంగానే కాళ్లు అతుక్కుని పుట్టింది. 27 ఏళ్ల తర్వాత మరోసారి ఆపరేషన్ చేయించుకుని కొంత వరకు నార్మల్ కాగలిగింది. ఈ సిండ్రోమ్ వచ్చి బతికిన వారిలో పెరూకి చెందిన మెర్మెయిడ్ అనే పాప కూడా ఉంది. కాకపోతే హార్ట్ లంగ్స్ అన్నీ పర్ఫెక్ట్ కండిషన్స్ లో ఉన్నాయి. కానీ కాళ్లు మాత్రం మడమల వరకు అతుక్కునే ఉన్నాయి. డాక్టర్లు కష్టపడి ఆపరేషన్ చేసి రెండింటిని వేరు చేసినా కూడా మామూలు స్థాయిలో నడవలేకపోతోంది. అయితే ఇలాంటి సిండ్రోమ్ వచ్చి బతికే వారి సంఖ్య చాలా తక్కవు. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద ఐదు కేసులుంటే అందులో ఒకటి భారత్ లో ఉండటం గమనార్హం.