Uday Kiran ఆత్మ హత్య వెనుక వున్న రహస్య నిజాలు

281
uday kiran
uday kiran

Uday Kiran ఆత్మ హత్య వెనుక వున్న రహస్య నిజాలు

Uday Kiran : ఈ పేరు వినగానే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఒక్కసారిగా గా ఏదో తెలియని ఎమోషన్ కి గురవుతారు. అయితే నటుడు ఉదయ్ కిరణ్ ఒకప్పుడు ఫ్యామిలీ మరియు లవ్ ఓరియెంటెడ్ చిత్రాలలో హీరోగా నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాగే సినిమా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమైన అనతికాలంలోనే తనకంటూ మంచి ఇమేజ్ మరియు పాపులారిటీని తెచ్చుకున్నాడు. కానీ తన సినీ కెరీర్ లో అనుకోకుండా చోటు చేసుకున్నటువంటి సంఘటనల కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించాడు. దీంతో అప్పట్లో ఈ విషయం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పెను సంచలనం సృష్టించింది. కాగా నటుడు ఉదయ్ కిరణ్ ప్రస్తుతం భౌతికంగా సినీ ప్రేక్షకుల మధ్య లేకపోయినప్పటికీ అతడు నటించిన చిత్రాలు మాత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

అయితే ఉదయ్ కిరణ్ మరణాంతరం అతడి మరణానికి సంబంధించిన పలు పుకార్లు, రూమర్లు మీడియాలో బలంగా వినిపించాయి. ఇందులో ముఖ్యంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరో పరోక్షంగా ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ పతనానికి కారణం అయ్యాడని అందువల్లనే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి. కానీ ఈ విషయం గురించి మాత్రం ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ఆ మధ్య నటుడు ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి కిరణ్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఉదయ్ కిరణ్ మరణం వెనుక ఉన్నటువంటి పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

Uday Kiran
Uday Kiran

ఇందులో భాగంగా ఉదయ్ కిరణ్ కి షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ ఉండేదని దాంతో అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా ఉన్నట్లుండి రియాక్ట్ అయ్యేవాడని చెప్పుకొచ్చింది. అయితే పెళ్ళి విషయంలో కూడా తాము పెద్దగా జోక్యం చేసుకోలేదని ఉదయ్ కిరణ్ ఇష్టపడే విషితను పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. కానీ పెళ్లి తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడని ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేసింది. అయితే ఉదయ్ కిరణ్ హీరో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కి చాలా సన్నిహితంగా ఉండేవాడని అలాగే అప్పుడప్పుడు తన సినిమాలకు సంబంధించిన నిర్ణయాల కోసం చిరంజీవి ని సంప్రదించేవాడని తెలిపింది.

ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ మెగాస్టార్ చిరంజీవి కి నచ్చడంతో తన కూతురు సుష్మితతో పెళ్లి ఖాయం చేశారని కానీ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలతో పాటు మనస్తత్వాలు కూడా కలవకపోవడంతోనే నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నారని అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఇది తెలియనటువంటి కొంతమంది ఉదయ్ కిరణ్ సినీ కెరియర్ పతనమవడానికి పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి తన పలుకుబడిని ఉపయోగించి పావులు కదిపారని ఈ క్రమంలో ఉదయ్ కిరణ్ కి అవకాశాలు రాకుండా చేశారని ఏవేవో కథలు అల్లి తప్పుడు కథనాలు ప్రచారం చేశారని అందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది.

Uday Kiran with Chiranjeevi
Uday Kiran with Chiranjeevi

ఇక మరికొందరైతే ఉదయ్ కిరణ్ ఆర్థిక సమస్యలు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. కానీ వాస్తవానికి తన తల్లి మరణించే సమయంలో తనతోపాటు ఉదయ్ కిరణ్ కి కూడా కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బు, ఆస్తులు, బంగారం వంటివి ఇచ్చిందని తెలిపింది. అయితే ఉదయ్ కిరణ్ మరణాంతరం అతడి భార్య విషిత తమతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదని అలాగే ఆస్తుల విషయంలో కూడా కొన్ని విభేదాలు చోటు చేసుకున్నట్లు చెబుతూ ఎమోషనల్ అయ్యింది. అలాగే ప్రస్తుతం విషిత ఎక్కడ ఉంది..? ఏం చేస్తుందనే విషయాలు కూడా తమకు పెద్దగా తెలియదని స్పష్టం చేసింది.

అయితే నటుడు ఉదయ్ కిరణ్ తెలుగులో దాదాపుగా 14 కి పైగా చిత్రాలలో హీరోగా నటించాడు. ఇందులో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, నీ స్నేహం, శ్రీరామ్, ఔనన్నా కాదన్నా, హోలీ, కలుసుకోవాలని, ఇలా వరుసగా 7కి పైగా హిట్లు అందుకని లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తరవాత కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వరుసగా 6 కు పైగా చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ కి మార్కెట్ బాగా డౌన్ అయింది. దీంతో దర్శక నిర్మాతలు కూడా సినిమా ఆఫర్లు ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారు.

దాంతో ఒకప్పుడు హిట్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ క్రమక్రమంగా అవకాశాలు లేకపోవడం అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడటంతో 2014 జనవరి 5వ నెలలో తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఏదేమైనప్పటికీ ఉన్నట్లుండి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఇటు తన కుటుంబానికి మరియు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article about Uday Kiran

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSakshi Shivanand ఆ హీరో దెబ్బకి రాత్రికి రాత్రే….
Next articleAndhrawala సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పా …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here