Gangubai : ఎప్పుడూ కూడా విభిన్న భరితమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను సరికొత్తగా అలరించే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఇటీవలే గంగుభాయ్ ఖతియావాడి అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఈ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించగా శంతన్ మహేశ్వరి, నవాజుద్దీన్ సిద్ధిఖి, అజయ్ దేవ్ గన్, హుమా ఖురేషి తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రం గత నెల 25 వ తారీఖున విడుదల కాగా నేటి వరకు దాదాపుగా 125 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. కాగా ఈ చిత్రం విడుదలయినప్పటి నుంచి ఈ చిత్రంలో అలియా భట్ నటించిన గంగుభాయ్ ఖతియావాడి గురించి ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో గంగుభాయ్ ఖతియావాడి ఎవరనే విషయమై నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.
గంగుభాయ్ ఖతియావాడి అసలు పేరు గంగా హరిజనవాదాస్. ఈమె 1939వ సంవత్సరంలో ముంబై నగర పరిసర ప్రాంతంలో మాఫియా క్వీన్ గా గుర్తింపు తెచ్చుకున్నట్లు పలు రికార్డులు చెబుతున్నాయి. అయితే గంగుభాయ్ ఖతియావాడి కుటుంబ సభ్యులు అప్పట్లో పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం మహారాష్ట్ర రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి ముంబయి స్లమ్ ఏరియాకి వచ్చారట.
అయినప్పటికి పనులు దొరకకపోవడంతో కొందరు మహిళలు తమ కుటుంబాలను పోషించుకోవడం కోసం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకున్నారు. ఆ తర్వాత అనుకోకుండా గంగుభాయ్ ఖతియావాడి ఓ ధనవంతుడు చేతిలో అత్యాచారానికి గురవడంతో గంగుభాయ్ వ్యభిచారం చేసే మహిళలకి అండగా నిలవడంతో పాటూ ఇష్టం లేకుండా మహిళలని తాకడం నేరమని కొంతమందిని శిక్షించింది కూడా. అయితే గంగుభాయ్ ఖతియావాడి కి మేడం ఆఫ్ కమితిపుర అనే మరో పేరు కూడా ఉంది.
కాగా గంగుభాయ్ ఖతియావాడి అప్పట్లో ముంబయి నగరాన్ని ప్రభావితం చేసిన 13 మంది మహిళలలో ఒకరిగా కూడా ఉంది. గంగుభాయ్ ఖతియావాడి బలవంతంగా చిన్న పిల్లలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వారిపై విధృతంగా ఉద్యమం చేసింది. అలాగే ఇష్టం లేనటువంటి మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాలను కూడా కట్టడి చేసింది. అందువల్లనే గంగుభాయ్ ఖతియావాడి పేరు చరిత్రలో నిలిచిపోయిందని కొందరు కమితిపుర ప్రాంతంలో నివాసముంటున్న ప్రజలు చెబుతున్నారు.
అప్పట్లో గంగుభాయ్ ఖతియావాడి వ్యభిచారం చేసే మహిళల సమస్యలను మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తో కూడా పలు మార్లు చర్చించడంతో పాటూ వారికి పునరావాసం కల్పించేందుకు కూడా బాగానే పాటు పడింది. దీంతో జవహర్ లాల్ నెహ్రూ కూడా రెడ్ లైట్ ఏరియాలో వ్యభిచారం చేసేటువంటి మహిళలకి రక్షణ కల్పించేందుకు చర్యలు కూడా తీసుకున్నారు. దీంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గంగూభాయ్ జీవితగాథ ఆధారంగా గంగూభాయ్ ఖతియావాడి చిత్రాన్ని తెరకెక్కించడంతోపాటూ నిర్మాతగా కూడా వ్యవహరించారు.