Pushpa సినిమా పై గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్..

185

Pushpa సినిమా పై గరికపాటి సెన్సేషనల్ కామెంట్స్..

Pushpa : ఇటీవలే తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప” చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించగా హీరోయిన్ గా రష్మిక మందాన నటించింది. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్, హీరో మరియు కమెడియన్ సునీల్, మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫైజల్, అజయ్, ప్రేమలత, కేశవ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, తదితర భాషలలో అనువాదం చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా విడుదల చేశారు. దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి.

గరికపాటి నరసింహారావు Pushpa సినిమాపై సంచలన వ్యాఖ్యలు :

అయితే తాజాగా ప్రముఖ ప్రవచనకర్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పుష్ప చిత్రంలో హీరో స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా ఉన్నటువంటి విషయాన్ని హైలెట్ చేస్తూ ఏకంగా తగ్గేదిలేదంటూ డైలాగులు చెబుతున్నారని ఇలాంటి విషయాలతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించాడు. అలాగే సినిమా మొత్తం నెగిటివ్ తరహాలో చూపించి చివర్లో 2, 3 ఎమోషనల్ సన్నివేశాలను పెట్టి చెడును కూడా మంచిగా చూపించాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఈ చిత్రంలో హీరో చెప్పేటువంటి తగ్గేదే లే అనే డైలాగులు రాముడు, సత్య హారిశ్చంద్రుడు వంటి వాళ్ళు ఉపయోగిస్తే బాగుంటుందని కానీ హీరో చెప్పడంలో ఎలాంటి అర్థం లేదని ఘాటుగా విమర్శించాడు.

Pushpa
Pushpa (Allu Arjun and Rashmika)

Pushpa సినిమాలని తగ్గేదే లే డైలాగ్ వైరల్ :

ఈ సినిమా ప్రభావంతో సోషల్ మీడియా మాధ్యమాలలో యువత కూడా హీరో చెప్పేటువంటి తగ్గేదే లే డైలాగులని వల్లిస్తూ ఏకంగా వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారని దీన్నిబట్టి సినిమాల ప్రభావం సమాజంపై ఎంతుందో అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. దీంతో గరికపాటి నరసింహారావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరికొందరు మాత్రం వాస్తవంగా ఆలోచిస్తూ గరికపాటి నరసింహారావు చేసిన ఈ వ్యాఖ్యలకి మద్దతు తెలుపుతున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా అనేది కేవలం ఎంటర్ టైన్మెంట్ మాత్రమేనని అలాంటప్పుడు సినిమాని సినిమా మాదిరిగా మాత్రమే చూడాలని వాస్తవిక జీవితానికి ముడి పెట్టకూడదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Pushpa
Pushpa (Allu Arjun)

ఎర్ర చందనం మొక్క ప్రాముఖ్యత మరియు డిమాండ్ :

అయితే పుష్ప చిత్రంలో చూపించినట్లు ప్రపంచంలో ఎక్కడా పెరగనటువంటి ఎర్ర చందనం మొక్క కేవలం చిత్తూరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శేషాచలం అడవుల్లో మాత్రమే పెరుగుతుంది. దీంతో ఈ ఎర్ర చందనం దుంగలకి డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటంతో కేటుగాళ్ళు అక్రమంగా ఎర్రచందనం దుంగలను విదేశాలకు తరలిస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ పై దృష్టి సారించారు. కాగా పుష్ప చిత్రం విడుదలైన తర్వాత ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ పై పోలీసులు మరింత దృష్టి సారించారు. ఈ క్రమంలో దాదాపుగా పది మందికి పైగా అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. దీంతో ఈ విషయాలు కూడా పుష్ప సినిమా కాంట్రవర్సీ కావడానికి పరోక్షంగా కారణమవుతున్నాయి.

Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )

https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/

https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/

If you like our article about Garikapati comments on pushpa

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleAbbas అనే హీరో పెట్రోల్ బంకుల్లో పని చేస్తూ…
Next articleSakshi Shivanand ఆ హీరో దెబ్బకి రాత్రికి రాత్రే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here