పొరపాటునకూడ ఈ పదాలు గూగుల్ లో సెర్చ్ చేయకండి

106
Google Search
Google Search

గూగుల్ లో ప్రతి విషయం వెతకడం ఈ జనరేషన్ కు కామనైపోయింది. ఇక ఒకే గూగుల్ అంటూ వాయిస్ కమాండ్ తో సెర్చ్ చేయడం కొత్త ట్రెండ్. అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ వాయిస్ కంట్రోల్ స్పీకర్స్ తో ప్రతిదీ కూడా సెర్చ్ చేస్తున్నాం. ఇక ప్రతి విషయానికి ఫోన్ లో గూగుల్ చేసి ఆన్సర్స్ కోసం వెతుకుతున్నాం. అయితే కొన్ని గూగుల్ లో వెతుకొద్దంటున్నారు సెర్చ్ ఇంజిన్ ఎక్స్‌పర్ట్స్.

వాటిలో ముఖ్యమైనది ఆరోగ్య పరమైన విషయాలు. గూగుల్ లో మన సింప్టమ్స్ ని చూసి ఎట్టిపరిస్తితుల్లో ఆరోగ్యంపై ఒక అంచనాకు రావొద్దు. కోట్లాది వెబ్ సైట్స్ మనకు ఏది కొట్టినా సమాధానం ఇస్తాయి. వాటిలో నూటికి 99శాతం డాక్టర్లు మెయింటెయిన్ చేయరు. జనరల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వాటి జోలికి వెళ్లి సింప్టమ్స్ ని పట్టి రోగాన్ని నిర్దారణ చేసుకుని హైరానాపడితే మరింత ప్రమాదం జరిగే చాన్స్ ఉంది. లేనిపోనివి ఊహించుకుని మంచి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని గూగులే ఈమధ్య ఒక కాన్ఫరెన్స్ లో ప్రకటించింది.

అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా బాంబులు తయారు చేయడం ఎలా ఒకే సారి ఎక్కువ మందిని చంపడం ఎలా అనేవి సర్సె చేశారంటే అంతే సంగతులు. ఆటోమేటిక్ గా మీ ఐపీ అడ్రెస్ సక్యూరిటీ సర్వర్స్ లో సేవ్ అయిపోతుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా ఐపీ అడ్రెస్ తో మన ఇంటికి వస్తారు పోలీసులు.

ఇక కొత్త కొత్త డ్రగ్ కంపోజిషన్స్ తయారు చేయడం పై కూడా కొంత మంది ఆన్ లైన్ లో వెతుకుతుంటారు., ఇది కూడా పోలీసులకు పట్టించేదే. ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కి సంబంధించి గూగుల్ చేయకపోవడమే మంచిది. చేశారా రిస్క్ కూడా మీరే భరించాల్సి ఉంటుంది.

ప్రెగ్నెంట్ ఉమెన్ ఇక సింప్టమ్స్ ని, కడుపులో ఉన్నది ఆడా, మగా అని కూడా వెతుకుతుంటారు. కానీ అవన్నీ చాలా వరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేని కంటెంటే. కాకపోతే జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకొచ్చు. ఏం తినాలి, ఏం తినొద్దనేది కూడా నెట్ లో చూసి ఫాలో కావొద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఏం తినాలనేది డాక్టర్లు చెబుతారు. టెస్ట్ లు చేశాక ఎవరు ఏ లోపం తో బాధపడుతున్నారో చూసి డైట్ ని సజెస్ట్ చేస్తారు. కాబట్టి ఇది కూడా గూగుల్ చేయకపోవడం మీ ఆరోగ్యానికే మంచిది.

ఇక చిన్నపిల్లల మందుల గురించి కొంత మంది వెతుకుతుంటారు. అందులో ఏ మెడిసిన్ కి ఎంత డోస్ వేయాలనేది కూడా గూగుల్ చేస్తుంటారు. కానీ మందుల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఏ మందు ఉంది ఏది ఎంత వేయాలనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరు. కాబట్టి చిన్న పిల్లల ఆరోగ్యంతో ఆటలాడి ఎకస్ట్రా డోస్ వేసి వారి ఆరోగ్యం పాడుచేయొద్దంటున్నారు డాక్టర్లు.

ఇక క్యాన్సర్స్ సింప్టమ్స్ గురించి కూడా చాలా మంది వెతుకుతున్నారని ఒక ఆన్ లైన్ సర్వేలో తేలింది. సాధారణ తల తప్పడం, నీరసంగా ఉండటం, ఎక్కడో ఒక చోట నొప్పి వస్తే క్యాన్సర్ అనుకుని భయపడేవాళ్లు కూడా ఉంటారు. క్యాన్సర్లలలో వేల రకాలున్నాయి. అవి ఎన్నో టెస్ట్ లు చేస్తే డాక్టర్లకే అర్దం కాదు. ఇక గూగుల్ కి ఏం తెలుస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఏదైనా సరే గూగుల్ చేయొద్దనేది డాక్టర్ల మాట. ఇదే విషయం చాలా మంది గూగుల్ తరపున కూడా ప్రకటనలు వచ్చాయి. కాబట్టి ఆన్ లైన్ లో అన్నీ వెతకడం మానుకోవాలి. కేవలం విలువైన సమాచారం కోసం మాత్రమే గూగుల్ ని వాడుకుంటే మంచిది.

Previous articlejanatha garage : జనతా గ్యారేజ్ చిత్రంలో బాబాయ్, అబ్బాయ్ నటించాల్సిందట…
Next articleరష్యా వేసిన బాంబు ఇండియాలో ఉన్న మన ఇంటి మీద ఎలా పడుతుందో తెలుసా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here