జుట్టుకు ఈ పదార్థం రాస్తే ఏమౌతుందో తెలుసా

110

ప్రస్తుత పరిస్థితుల్లో సమయాభావం వల్ల కాలుష్యం వల్ల జుట్టు పైన శ్రద్ధ పెట్టలేక జుట్టురాలిపోవడం ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పవచ్చు. అలాంటి వారందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా ని ప్రయోగిస్తే జుట్టు చాలా అందంగా పట్టుకుచ్చులా గా పెరుగుతుంది. ఇప్పుడు ఆ చిట్కా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే చిట్కా లో ఉండే పోషక విలువలు జుట్టు కుదుళ్ల నుంచి చాలా బలంగా తయారు చేస్తాయి. జుట్టు చిట్లి పోవడం రాలిపోవడం వంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.

ఇలా జుట్టును బలంగా తయారు చేసేటటువంటి ఆ చిట్కాలు కావలసిన పదార్థాలు ముఖ్యమైంది టీ పొడి. టీ పొడి జుట్టు కుదుళ్ల నుంచి పోషణనిస్తుంది అని జుట్టుకి బలాన్ని కలిగిస్తుంది అని చాలామందికి తెలియదు. టీ పొడి కేవలం కుదుళ్లకు మాత్రమే కాదు ముఖంపైన ఒంటిపైన చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి దాంట్లో రెండు స్పూన్ల టీ పొడిని వేయాలి. బాగా మరిగే వరకు ఆ నీటిని వేడి చేయాలి. అలా మరిగించడం వల్ల టీ పొడి లో ఉన్న పోషక విలువలు అన్ని కూడా ఆ నీటి లోకి వస్తాయి. అలా మరిగిన తరువాత నీటిని పక్కకు పెట్టుకోండి. తలస్నానం చేయడానికి షాంపూ అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఆ శ్యాంపూ టి డికాషన్లో కలుపుకోవాలి. అలా కలపడం వల్ల తెల్ల జుట్టు నల్లగా అవడం మాత్రమే కాకుండా జుట్టు చాలా పొడుగ్గా అందంగా పెరుగుతుంది. మనకు మనమే సొంతంగా జుట్టు అందంగా తయారు చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. షాంపు వేసి బాగా కలపాలి. ఆ తరువాత దీనిని మరొక పాత్రలో కి వడకట్టుకోవాలి. అప్పుడు దీనిని తలకి కుదుళ్ల నుంచి బాగా అప్లై చేసుకోవాలి. చివరిగా ఒక నిమ్మకాయ కోసి ఆ నిమ్మచెక్క రసాన్ని కూడా టీ డికాషన్లో కలుపుకొని తలకు పట్టించాలి. నిమ్మరసం వల్ల జుట్టు మొదల్లో ఉన్నటువంటి కుదుళ్ళు గట్టిపడి బలంగా అవుతాయి. చుండ్రు మలినాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ అనేవి మన జుట్టు కుదుళ్లను బలంగా చేయడం లోనూ చుండ్రు ను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. తరువాత ఈ మిశ్రమం వేసి ఒక అరగంట కి సాధారణంగా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా తయారై ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. నల్లగా పట్టు కుచ్చులా తయారవుతుంది. ఈ చిట్కాతో తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మార్చుకోవచ్చు జుట్టు రాలిపోవడం సమస్యలు తొలగించుకోవచ్చు.

Previous articleపరశురాముడు క్షత్రియ జాతిని చంపడానికి గల కారణం?
Next articleవిమానంలో ప్రయాణించేటప్పుడు పొరపాటున కూడా ఈ పని చేయకూడదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here