Hairy syndrome
Hairy syndrome : చేయని తప్పుకు దేవుడు జీవితానికి సరిపడా శిక్ష వేస్తే ఏ మనిషి కూడా భరించలేడు. వంద కోట్లలో ఒకరికి వచ్చే సిండ్రోమ్ ఒకే ఇంట్లో ముగ్గురికి వస్తే అది నరకప్రాయం. ఇలానే మహారాష్ట్రలోని పూనే కు దగ్గర్లోని మారుమూల గ్రామంలో ఒక పేదింట్లో వర్ వూల్ఫ్ అనే సిండ్రోమ్ తో ముగ్గురు ఆడ పిల్లలు బాధపడుతున్నారు. దీని పేరు వినడానికి బాగానే ఉంటుంది కానీ….దీని వల్ల బతకలేక చావలేక ఆ కుటుంబం నరకం అనుభవిస్తోంది. ఈ హెయిరీ సిండ్రోమ్ కారణంగా తల నుండి కాలి బొటన వేలు వరకు వెంట్రుకలు అబ్ నార్మల్ గా పెరుగుతాయి. శరీరం మొత్తం కప్పుకోవచ్చు కానీ మొహం మీద చింపాంజీ కంటే దారుణంగా భయంకరంగా వెంట్రుకలు వస్తే తమని తాము చూసే భయపడాలి. కొన్ని సార్లు వయసు పెరిగే కొద్ది లిప్స్ మినహా ముక్కు, కళ్లు, నుదురు, చెంపలు మొత్తం వెంట్రుకలు వస్తాయి. దీనినే వోర్ వూల్ఫ్ లేదా హెయిరీ సిండ్రోమ్ లేదా హైపర్ ట్రైకోసిస్ అంటారు.

ప్రపంచం మొత్తం మీద వంద మంది కంటే ఎక్కువగా ఈ Hairy syndrome తో బాధపడేవారుండరు. మహా అయితే రెండు మూడు వందల మంది ఉంటారు. కానీ పూనే కు దగ్గర్లోని ఒక ఊళ్లోని పేదింట్లో అనిత అనే తల్లికి ఆరుగురు ఆడ పిల్లలు. వారిలో ముగ్గురికి వారి తండ్రి ద్వారా ఈ హెయిరీ సిండ్రోమ్ వారసత్వంగా వచ్చింది. వాస్తవానికి అనితకు 12ఏళ్ల వయసులోనే పెళ్లైంది. అప్పుడు పెళ్లి గురించి కానీ పెళ్లి కొడుకు గురించి కానీ ఏమీ తెలియదు. తర్వాత తెలిసినా కూడా ఏమీ చేయలేకపోయింది. అతనితో కాపురం చేయకపోతే చనిపోతామని తల్లిదండ్రులు బెదిరించారు. దీంతో ఆ తర్వాత అతనికి ఈ సిండ్రోమ్ ఉందని తెలిసినా కూడా కాపురం చేయాల్సి వచ్చింది. అలా తండ్రి ద్వారా ముగ్గురు పిల్లలకు ఈ హెయిరీ సిండ్రోమ్ వచ్చింది. దీంతో వాళ్లు కనీసం పనికి వెళ్లినా కూడా అంతా దెయ్యం, భూతం అని వేధిస్తున్నారు. ఎంతో కొంత క్రీమ్స్ రాసుకుని జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఒక్క రోజు క్రీమ్ రాయకుండా ఉన్నా వేగంగా జుట్టు వస్తోంది.
దీంతో కనీసం వారి పక్కన కూడా కూర్చునేందుకు కూడా ఎవ్వరూ ఇష్టపడటం లేదు. పెద్దమ్మాయి సవితకు 23ఏళ్లున్నాయి. రెండో అమ్మాయి వయసు మోనిషా18ఏళ్ల వయసు, మూడో కూతురు సావిత్రి సంగ్లీకి ఇప్పుడు పదహారేళ్లు. మొదటి పాప పుట్టినప్పుడే అనిత తన అత్తను అడిగింది. తనకు ఇలాంటి పాప ఎందుకు పుట్టిందని కానీ ఆమె చాలా నిర్లక్ష్యంగా నీ భర్తకు ఇలాంటి జబ్బే ఉంది. అందుకే వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత పిల్లలకు కూడా జన్యు లోపం కారణంగా హెయిరీ కూతుళ్లే పుట్టారు. పైగా కొడుకు కోసం వెయిట్ చేస్తే ఆరుగురు ఆడ పిల్లలు పుట్టారు. అందులో ముగ్గురు బాగానే ఉన్నారు కానీ మిగతా వారే జీవితం మీద విరక్తితో రోజూ నరకం అనుభవిస్తున్నారు. పెళ్లీడు కొచ్చినా వారికి ఎలాంటి సంబంధం కుదరడం లేదు. వారి గురించి చెబితేనే ఎవ్వరూ దగ్గరకు రావడం లేదు. పైగా 2007లో తండ్రి చనిపోవడంతో కూలీ చేసుకోవడం తప్ప వేరే ఆదాయం లేకపోవడంతో అనిత పిల్లల జీవితం పై బెంగ పెట్టుకుంది. ఎవరైనా సాయం చేస్తే లేజర్ ట్రీట్ మెంట్ అయినా చేయించాలని సర్కారును కూడా వేడుకుంది. ఒక్కో ట్రీట్ మెంట్ కి కనీసం నాలుగు లక్షలకు పైగా అవుతుందని డాక్టర్లు చెప్పారు. కానీ సాయం చేసేవారు లేక దీనంగా ఎదురుచూస్తోంది అనిత. ఇది జీన్ మ్యుటేషన్ కారణంగా ఈ హెయీరీ సిండ్రోమ్ వస్తుంది. దీనినే హైపర్ ట్రైకోసిస్ అంటారు. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఇలాంటివి చాలా అరుదుగా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక అనిత తమ పిల్లలను ఎంతో కొంత చదివిపించింది. కానీ లేజర్ ట్రీట్ మెంట్ చేయించి ఒక్క సారి చనిపోయే వరకైనా తమ పిల్లలు అందరిలా ఉంటే చూసుకోవాలని ఉందని వేడుకుంటోంది. ఇప్పటికే ఆమె చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ వారిని పోషిస్తోంది. తమ బంధువులే ఎంతో కొంత సాయం చేస్తుంటే బతుకు వెళ్లదీస్తోంది. మరి వారి ట్రీట్ మెంట్ కు డబ్బులు కావాలంటే ఎవరైనా ఆదుకోవాల్సిందే. ఆ ఆదుకునే దేవుడు ఎవరా అని ప్రతి రోజూ ఎదురుచూస్తోంది ఆ తల్లి.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites