Ajith Kumar : సినిమా అనే రంగుల ప్రపంచంలో తమ తోటి నటీనటులతో ప్రేమలో పడటం, అలాగే పలు వ్యక్తిగత కారణాలతో విడిపోవడం మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం వంటివి చాలా సర్వసాధారణంగా జరిగిపోతుంటాయి. అయితే ఈ ప్రేమాయణాలు విఫలం కావడానికి ఒక్కోసారి ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే కారణం కాదని అప్పుడప్పుడు స్టార్డమ్, స్టేటస్ వంటివి కూడా కారణమవుతున్నాయని చాలామంది నటీనటుల జీవితాల్లో నిరూపితమైంది.
అయితే సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజీ ఉన్నటువంటి స్టార్ హీరోలలో తమిళ ప్రముఖ నటుడు అజిత్ కుమార్ ఒకరు. నటుడు అజిత్ కుమార్ 1993వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు సెల్వ దర్శకత్వం వహించిన అమరావతి అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించాడు.
దీంతో ఈ చిత్రంలో నటుడు అజిత్ కుమార్ తన ప్రతిభను నిరూపించుకోవడంతో వెంటనే తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నటుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ప్రేమ పుస్తకం అనే చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు వరించాయి. దీంతో అజిత్ కుమార్ ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న అతి కొద్ది మంది స్టార్ హీరోలలో ఒకడిగా రాణిస్తున్నాడు.
అయితే ఒకప్పుడు అజిత్ కుమార్ ని సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టేందుకు ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చాలా కష్టపడిందని ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అయితే ఆమె ఎవరో కాదు తెలుగులో దాదాపుగా పదికి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులని అలరించిన తెలుగు హీరోయిన్ హీరా రాజగోపాల్. కాగా హీరా రాజగోపాల్ అంటే ప్రేక్షకులకి పెద్దగా తెలియదుగానీ లిటిల్ సోల్జర్స్ చిత్రంలో చిన్నారుల అమ్మ పాత్రలో నటించిన కావ్య అంటే మాత్రం ప్రేక్షకులు బాగానే గుర్తు పడతారు. అయితే నటి హీరా రాజగోపాల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ బాగానే రాణించింది.
దీంతో ఆర్థికంగా కూడా బాగానే నిలదొక్కుకుంది. ఈ సమయంలో నటుడు అజిత్ కుమార్ తో పరిచయం ఏర్పడటంతో కొద్ది సమయంలోనే ఈ పరిచయం కాస్త ప్రేమ కి దారితీసిందట. అయితే వీరిద్దరూ ప్రేమలో పడిన సమయంలో హీరా రాజగోపాల్ అప్పటికే వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తుండడంతో అజిత్ కుమార్ ని హీరోగా నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించిందట. ఈ క్రమంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన రెండు చిత్రాలకి సహా నిర్మాతగా కూడా వ్యవహరించిందట. కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో నటి హీరా రాజగోపాల్ కి ఆర్థికంగా సమస్యలు మొదలయ్యాయట. దీనికితోడు సరిగ్గా ఇదే సమయంలో హీరో అజిత్ కుమార్ తో హీరా రాజగోపాల్ కి విభేదాలు తలెత్తాయట.
దీంతో హీరా రాజగోపాల్ సినిమా ఇండస్ట్రీ పై దృష్టి సారించే లేక పోవడం అజిత్ కుమార్ కూడా నటి హీరా రాజగోపాల్ ని పెద్దగా పట్టించుకోక పోవడం వంటివి జరగడంతో హీరా రాజగోపాల్ డిప్రెషన్ లోకి వెళ్లిందట. చివరికి మద్యపానం, ధూమపానం వంటి వాటికి బానిసై కెరియర్ ని పోగొట్టుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయింది నటి హీరా రాజగోపాల్. కాగా ఆ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కూడా నటి హీరా రాజగోపాల్ నటుడు అజిత్ కుమార్ తో ఉన్నటువంటి రిలేషన్ షిప్ గురించి పరోక్షంగా స్పందించింది. ఇందులో భాగంగా అన్ని బంధాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని ముఖ్యంగా ప్రేమ బంధాలు స్టార్డమ్, స్టేటస్ వంటి వాటిని బట్టి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయని తన వైవాహిక జీవితంలో కూడా సరిగ్గా అలాగే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే వీరిద్దరి మధ్య ప్రేమ బంధం ముగిసిన తర్వాత నటుడు అజిత్ కుమార్ కోలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఒకప్పటి హీరోయిన్ షాలిని ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం వీరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు. అయితే నటుడు అజిత్ కుమార్ సినిమాల పరంగా స్టార్ హీరోగా నటిస్తున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీ లో జరిగే ఎటువంటి ఎలాంటి వేడుకలకు హాజరు కాకపోవడమేకాకుండా మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటాడు. ఇక నటి హీరా రాజగోపాల్ విషయానికి వస్తే ఆ మధ్య హీరా ముంబైకి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త ని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.