Suman : వందల ఎకరాలు ఆర్మీ కోసం ఫ్రీగా ఇచ్చాడంటూ హీరో గురించి ప్రచారాలు…. చివరికి క్లారిటీ ఇచ్చిన హీరో….

159

Suman gives clarity 

Suman : ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల గురించి ఏదైనా ఓ వార్త సోషల్ మీడియాలోకి పొక్కిందంటే చాలు కొద్ది క్షణాల్లోనే తెగ వైరల్ అయిపోతుంది. దీనికితోడు కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసినటువంటి ప్రచారాలు కారణంగా కొందరు సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియా మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే తాజాగా పలు టాలీవుడ్ చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ హీరో సుమన్ గురించి ఓ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏమిటంటే నటుడు సుమన్ వందల కోట్ల రూపాయలు విలువ చేసే 114 ఎకరాలు భూమిని భారతదేశపు ఆర్మీకి ఉచితంగా రాసిచ్చాడని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో తాజాగా ఈ విషయం గురించి నటుడు సుమన్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా తాను వందల ఎకరాలను ఆర్మీ కి ఇచ్చినట్లు వినిపిస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. కానీ తనకు సంబంధించిన ఆస్తుల తగాదాలు ప్రస్తుతం కోర్టులో ఉన్నాయని తొందర్లోనే ఈ విషయంపై చిక్కు వీడనుందని అప్పుడు మరిన్ని వివరాలను స్పష్టంగా తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.

Suman
Suman

తప్పుడు కథనాలను నమ్మవద్దని తన అభిమానులకు

అంతేకాకుండా తన గురించి వినిపిస్తున్న ఈ తప్పుడు కథనాలను నమ్మవద్దని తన అభిమానులకు సూచించాడు. దీంతో ఈ విషయంపై కొందరు అభిమానులు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా చేసేటువంటి తప్పుడు ప్రచారాలు కారణంగా సినీ సెలబ్రిటీలు మరియు వారి అభిమానులు ఇబ్బందులకు గురవుతున్నారని కాబట్టి ఏదైనా ఓ వార్త ప్రచారం చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మొన్నటి వరకు హీరోగా నటించి మెప్పించిన నటుడు సుమన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో మరియు విలనిజం పాత్రలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటున్నాడు. దీంతో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. కాగా ఇటీవలే నటుడు సుమన్ రామ్ అసుర అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటిటి అయిన అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతోంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleDimple Hayathi : నల్లగా ఉన్నానని హీరోయిన్ గా పనికిరావంటూ అవమానించారు… కానీ….
Next articleRajasekhar : ఆ స్టార్ హీరో కి తన భార్య వల్లే ఆ అవకాశం పోయిందంటూ ప్రచారం… కానీ…