Nuvvu naku nachhav చిత్రంలో హీరో ఛాన్స్ మిస్ అయిన తెలుగు హీరో… ప్రస్తుతం అవకాశాల్లేక…

181

Nuvvu naku nachhav : తెలుగులో 2000 వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు కె విజయభాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ఇప్పటికీ బాగా గుర్తు ఉంటుంది. అయితే ఈ చిత్రంలో హీరో గా టాలివుడ్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించగా తెలుగు ప్రముఖ స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రంలో తెలుగు ప్రముఖ నటులు ప్రకాష్ రాజు, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ బ్రహ్మానందం, పింకీ హేమ, ఎమ్మెస్ నారాయణ, పృథ్వీరాజ్, ఫ్లోరా సైనీ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

ఈ చిత్రంలోని తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి సెంటిమెంట్ మరియు హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ, అలాగే బ్రహ్మానందం కామెడీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఇక అప్పట్లోనే దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన స్టోరీ లైన్ తో పాటు మాటలతో కూడా మాయ చేశాడు. ఇటు తెలుగు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి అందించిన సంగీత స్వరాలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. దీంతో ఓవరాల్ గా చూస్తే ఈ చిత్రం హీరో వెంకటేష్ కే సినీ కెరియర్ లోనే ఇది బెస్ట్ గా నిలిచింది.

అయితే ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం టాలీవుడ్ హీరో తరుణ్ కోల్పోయినట్లు ఆమధ్య ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు కె.విజయభాస్కర్ తెలిపాడు. ఇందులో భాగంగా అప్పటికే హీరో తరుణ్ నువ్వే కావాలి చిత్రం హిట్ కావడంతో మంచి ఫామ్ లో ఉన్నాడని దాంతో నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో హీరో తరుణ్ ని హీరోగా నటింపజేయాలని అనుకున్నప్పటికీ తరుణ్ వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో సినిమా డేట్లు కుదరలేదట. దాంతో చివరికి ఈ చిత్రానికి కథను అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ పేరును సూచించడంతో అలా విక్టరీ వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్ చిత్రం సినిమా ఆఫర్ వచ్చిందట.

ఈ చిత్రంలో హీరో విక్టరీ వెంకటేష్ తన సెంటిమెంట్ నటనతో మతి పోగొట్టాడు. అంతేకాకుండా బ్రహ్మానందంతో వచ్చేటువంటి కామెడీ సన్నివేశాల్లో తన టైమింగ్ తో పక్కా కామెడీని అందించాడు. దీంతో ఈ చిత్రాన్ని చూసినటువంటి కొందరు అభిమానులు ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ తప్ప మరే ఇతర హీరో నటించినా సరే ఖచ్చితంగా ఫలితాలు మాత్రం తారుమారయ్యేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ సభ్యులు కేవలం 2 కోట్ల రూపాయలు బడ్జెట్ వెచ్చగా దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా అత్యధిక సెంటర్లలో 100 రోజులు మరియు 50 రోజులు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రికార్డులకెక్కింది. అయితే నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో హీరోగా నటించే అవకాశం మిస్ చేసుకున్న తరుణ్ కూడా నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు, అదృష్టం తదితర చిత్రాలలో హీరోగా నటించాడు.

కానీ ఇందులో ప్రియమైన నీకు మరియు నువ్వు లేక నేను లేను చిత్రాలు బాగానే ఆకట్టుకోగా అదృష్టం చిత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఆ తరువాత హీరో తరుణ్ దాదాపుగా పదికి పైగా చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ హీరోగా మాత్రం నిలదొక్కుకోలేక పోయాడు. దీంతో ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కొంతమేర దూరంగా ఉంటున్నాడు.

Previous articleRamaprabha కి ఆ స్టార్ డైరెక్టర్ ప్రతి నెల డబ్బులు పంపిస్తాడట…
Next articleసమ్మర్ లో హెల్దీ ఫన్ గేమ్స్ ఇలా ఉండాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here