Keerthi Suresh : పాపం ఈ హీరోయిన్ ని ఐరన్ లెగ్ అంటూ ప్రచారం చేశారట

224

Keerthi Suresh

Keerthi Suresh : తెలుగులో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటించి తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిన తమిళ బ్యూటీ కీర్తి సురేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి కీర్తి సురేష్ కి అందం, అభినయం, నటన ప్రతిభ వంటివి మెండుగా ఉండటంతో ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కానీ దురదృష్టవశాత్తు కీర్తి సురేష్ కి తన సినీ కెరీర్లో మహానటి చిత్రం తప్ప చెప్పుకోదగ్గ హిట్లు లేవు.

అయినప్పటికీ ఈ అమ్మడు పట్టు విడవకుండా శ్రమిస్తూ బాగానే అలరిస్తోంది. కాగా తాజాగా నటి కీర్తి సురేష్ తెలుగులో గుడ్ లక్ సఖి అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. దీంతో ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నటి కీర్తి సురేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా గుడ్ లక్ సఖి చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది. అలాగే తన సినీ కెరీర్ లో ఎదుర్కొన్నటువంటి కొన్ని పరిస్థితుల గురించి కూడా ప్రేక్షకులతో పంచుకుంది.

Keerthi Suresh గుడ్ లక్ సఖి :

ఈ క్రమంలో మొదటగా గుడ్ లక్ సఖి ఈ చిత్రం గురించి స్పందిస్తూ ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ సభ్యులు చాలా కష్టపడి పని చేశారని అందుకు తగ్గ ఫలితం వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే తాను పల్లెటూరి యువతి పాత్రలో నటించేందుకు కొంతమేర కష్టపడినప్పటికీ ఈ పాత్ర తన సినీ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది. అయితే తాను సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాగే కొందరు ఏకంగా తనని తమ చిత్రాల్లో హీరోయిన్ గా నటింపచేస్తే సినిమాలు ఆగిపోవడం లేదా డిజాస్టర్ అవ్వడం వంటివి జరుగుతాయంటూ తన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేశారని ఎమోషనల్ అయ్యింది.

Keerthi Suresh
Keerthi Suresh

Keerthi Suresh ని ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ :

ఇంకోందరైతే ఏకంగా తనది ఐరన్ లెగ్ అని నెగిటివ్ గా ప్రచారాలు చేయడంతో ఒకానొక దశలో తీవ్ర మనస్థాపానికి గురయ్యానని తెలిపింది. కానీ క్రమక్రమంగా తనని సినిమా అవకాశాలు వరించడంతో ఇలాంటి నెగిటివ్ ట్రోల్స్ పట్టించుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు మరియు నెగెటివ్ ప్రచారాలు వంటివి కామన్ అని కాబట్టి ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

అయితే నిన్నటి రోజున గుడ్ లక్ సఖి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా విడుదలైంది. కాగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరిస్తూ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. దీంతో ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు దేశవ్యాప్తంగా 1.5 కోట్ల రూపాయల వసూళ్లని సాధించింది. అయితే ప్రస్తుతం పెద్ద సినిమాలెవీ రిలీజ్ కాకపోవడంతో ఈ విషయం కూడా గుడ్ లక్ సఖి చిత్రానికి కొంతమేర కలిసొచ్చింది. దీంతో వారాంతంలోని శని, ఆదివారాలలో ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleSamudra : ఆ సినిమా ప్లాప్ అవుతుందని ముందే చెప్పా.. కానీ బాలకృష్ణ వినలేదు..
Next articleShani : మన శరీరంలో కొన్ని అదృష్టాన్ని, మరికొన్ని శనిని కూడా తెచ్చిపెట్టే భాగాలుంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here