Heroine : దర్శకనిర్మాతలకు ఆ హీరోయిన్ తల్లి తలనొప్పిగా మారిందట… అడిగిందల్లా ఇవ్వాలంటూ…

585

Heroine

Heroine మామూలుగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగురాళ్లు వెనకాల వేసుకోవడం మంచిదని లేకపోతే మరియు క్రేజ్ తగ్గిపోయిన తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కష్టమవుతుందని ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఈ విషయం గురుంచి పలు ఇంటర్వ్యూలలో మరియు సందర్భాలలో సంగతి విధితమే. దీనికితోడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు కూడా మారిపోవడంతో కొందరు హీరో హీరోయిన్లు పారితోషికం విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఓ హీరోయిన్ కి ఒకటి, రెండు సినిమాలు బాగా కలిసి రావడంతో పారితోషికంతో పాటు తన డిమాండ్లని కూడా బాగానే పెంచిందని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా తాజాగా ఓ యంగ్ Heroine వచ్చీరావడంతోనే మంచి హిట్ ను సొంతం చేసుకుందట. దీంతో ఈ యంగ్ హీరోయిన్ రాత్రికి రాత్రే పారితోషికం కూడా బాగానే పెంచేసిందట. అయితే తన మొదటి చిత్రానికి ఈ హీరోయిన్ కేవలం 20 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ ని తీసుకున్నప్పటికీ ఈ చిత్రం బాగా హిట్ అవడంతో తన రెండో చిత్రానికి ఏకంగా 75 లక్షల నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. దీంతో హీరోయిన్ ఉన్నటువంటి టాలెంట్ చూసి దర్శక నిర్మాతలు కూడా ఈ విషయంలో వెనకాడడం లేదట.

కానీ ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్ తల్లి ఎక్కువగా హీరోయిన్ అవకాశాల విషయంలో మరియు షూటింగ్ స్పాట్ విషయాలలో కలగజేసుకుంటూ దర్శక నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. ఈ క్రమంలో హీరోయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె తల్లి వెంట వస్తూ హీరోయిన్ కి కల్పించేటువంటి సౌకర్యాల విషయంలో వేలు పెడుతూ దర్శక నిర్మాతలకు లేనిపోని తలనొప్పి గా మారిందట. దీంతో కొందరు దర్శకనిర్మాతలు ఈ విషయం అర్థం చేసుకుని హీరోయిన్ గా మంచి ఫామ్లో ఉన్నప్పుడు పారితోషకం మరియు చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సూచిస్తున్నారట. దీంతో కొందరు నెటిజన్లు ఆ హీరోయిన్ ఎవరా..? అని సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారు.

Tollywood
Tollywood

అయితే ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు. కాగా ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో శివగామి పాత్ర లో నటించేందుకు శ్రీ దేవి కూడా తన డిమాండ్లతో దర్శకనిర్మాతలకు చెమటలు పట్టించింది. ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇందులో భాగంగా స్వర్గీయ నటి శ్రీ దేవి భర్త బోనీ కపూర్ చేసిన డిమాండ్ల గురించి తెలియ జేశాడు.

 

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleHimaja : పెళ్లి చేసుకుంటా…. మంచి సంబందం ఉంటే చెప్పండంటున్న బిగ్ బాస్ బ్యూటీ…..
Next articleDirector : అప్పులపాలయిన డైరెక్టర్… అప్పులు తీర్చేందుకు అలా చేస్తూ పోలీసులకి చిక్కి… చివరికి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here