weight loss ఈ పొడి వలన ఎంత లావుగా ఉన్నా తగ్గిపోవాలిసిందే
weight loss : మన శరీరంలో ఎక్కువభాగం కొవ్వు అనేది పొట్ట భాగంలోనూ వెనుక నడుము భాగంలోనూ కాళ్లు తొడల దగ్గర బాగా పేరుకుపోతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొవ్వు బాగా పెరిగిపోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధిక బరువు కొవ్వు పెరగడం వల్ల కిడ్నీ సమస్యలు జీర్ణవ్యవస్థ సమస్యలు ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తాయి. దీని వలన థైరాయిడ్, బి పి, పి సి ఓ డి ,సంతానలేమి వంటి సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కొవ్వును తగ్గించుకోవడానికి ఇంట్లోనే చాలా తేలికైన వస్తువులతో తయారు చేసుకునే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ చిట్కాలు పాటించడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీనికి ముందుగా కావలసినది కరివేపాకు. కరివేపాకు జీర్ణమవడానికి కాదు అనేక రకాల అయినటువంటి ఆరోగ్య సమస్యలు నయం చేయడానికి కూడా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అందుకే మనం కరివేపాకుని అన్ని రకాల వంటల లోను ఉపయోగిస్తూ ఉన్నాము. కరివేపాకు అరుగుదలను పెంచడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా ఉండటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఇప్పుడు ఇది మన శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ బాగా పని చేస్తుందో అప్పుడు మాత్రమే ఈ శరీరంలో ఉన్న అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి అప్పుడే మనకి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. తర్వాత కావలసిన పదార్థం జీలకర్ర. మనందరికీ తెలిసిన విషయమే జీలకర్ర కూడా మన శరీరంలో అరుగుదల ని బాగా పెంచుతుంది. జీలకర్ర కూడా గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత వాటిని ఆకులుగా విడతీసుకొని వాటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. గాలి తగిలేలా ఉండి తడి లేకుండా ఉంటే చాలు
weight loss టిప్స్
కరివేపాకుని మెత్తని పొడి లాగా చేసి పెట్టుకోవాలి తరువాత జీలకర్ర ని కూడా కొద్దిగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి ఈ రెండింటినీ సమానంగా ఒక దానిలో ఒకటి కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని కూరలలో గాని లేదా ఏదైనా టిఫిన్ చేస్తున్నప్పుడు గానీ కలుపుకోవచ్చు. దీని వలన జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. దీన్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు దీనిని నేతితో కలిపి అన్నంలో కూడా కలుపుకోవచ్చు. కొవ్వు కరగడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఇలా కరివేపాకు జీలకర్ర మిశ్రమాన్ని ఒక గ్లాసు నీటిని వేడి చేసుకొని ఆ నీటిని తాగినట్లైతే శరీరంలో ఉన్న కొవ్వు తొందరగా కరిగిపోతుంది. ఇలా రోజూ పరగడుపున ఒక గ్లాసు నీది ఒక నెల రోజుల పాటు క్రమం తప్పకుండా గనుక తీసుకున్నట్లయితే శరీరంలో ఏ భాగంలో ఉన్న కొవ్వును పూర్తిగా కరిగిపోతుంది. ఈ కరివేపాకు జీలకర్ర మిశ్రమాన్ని వంటలలో ఉపయోగించవచ్చు అన్నంలో కలుపుకుని తినవచ్చును ఇలా నీటిలో కూడా ఉపయోగించవచ్చు ఏ పద్ధతిలో అయినా సరే ఈ కరివేపాకు మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కొవ్వును పూర్తిగా తగ్గించుకోవచ్చు.