శరీరం లో లివర్ చేసే పని ఏంటో తెలుసా ?

134

మన శరీరంలో అత్యంత కీలక అవయవాలలో కాలేయం 1. మనిషి శరీరంలో 500కు పైగా పనులను ఒక్క లివర్ మాత్రమే చేస్తుంది. మన శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేసే ఒక ప్రయోగశాలగా మన కాలేయం పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్కహాల్ ఔషధాలు తీసుకోవడం ద్వారా శరీరంలోకి చేరే వ్యర్థాలను కూడా బయటికి తొలగిస్తుంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచకపోతే బయంకరమైన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాలేయం బాగుంటేనే మన శరీరంలో మలినాలు విషపదార్థాలు టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్తాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి అలాగే శరీరంలో టాక్సిన్స్ ను తగ్గించడానికి కూడా కాలేయం   బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి కాలేయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు డీ టాక్స చేసుకోవాలి. కాలేయం ఆరోగ్యం పాడై పోయిందని కూడా గుర్తించడం చాలా కష్టం. ఇది 90 శాతం పాడైన తర్వాతే లక్షణాలు అనే బయటకి కనిపిస్తాయి. అప్పటివరకు చాలా లక్షణాలు కనిపించవు. కొన్ని లక్షణాలను బట్టి లివర్ డ్యామేజ్ అయ్యింది అనే విషయాన్ని గుర్తించవచ్చు.

ఇప్పుడు మనం లివర్ డ్యామేజ్ అయ్యింది అని తెలిపే కొన్ని లక్షణాలతోపాటు పాడైపోయిన లివర్ను డిటాక్స్ చేసి కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.లివర్ కనుక డ్యామేజ్ అయితే యూరిన్ ముదురు రంగులోకి మారుతుంది. ఇలా అప్పుడప్పుడూ ముదురు రంగులో వస్తే ఏ ఇబ్బంది లేదు కానీ క్రమం తప్పకుండా ఇలాంటి ముదురు రంగులో వస్తే మాత్రం కాలేయం సమస్యలు ఉంది అని అర్థం. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్న కూడా కాలేయం సమస్యలు ఉన్నట్లే. లివర్ చుట్టూ ప్యాడ్ పేరుకుపోతే ఎంత నీరు తాగుతూ ఉన్నప్పటికీ కూడా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తూనే ఉంటాయి. కాబట్టి లివర్ పాడైపోయింది అని తెలపడానికి ఇది ఒక లక్షణం. ఇంకా లివర్ డ్యామేజ్ అయ్యింది అని తెలిపే మరో ప్రధాన లక్షణం చర్మం రంగు మారి పోవడం. వివరంగా చెప్పాలంటే చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. కంటి ద్వారా కూడా లివర్ ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చు. తెల్లగా ఉండి కళ్ళు కొంచెం పసుపు గా మారడం ఇది సహజంగా కామెర్ల లక్షణాలు అని చెప్పారు. కానీ లివర్ డ్యామేజ్ అయినప్పుడు కూడా ఇలా రంగు మారుతుంది. నోరు చేదుగా అనిపిస్తూ ఉన్నా కూడా లివర్ డ్యామేజ్ అయినట్లు గుర్తించాలి. ఇలా అప్పుడప్పుడు అయితే ఇబ్బంది లేదు కానీ నోరు పూర్తిగా ఎప్పుడూ ఇలానే అనిపిస్తే జాగ్రత్తపడాలి. కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది ఇది కూడా లివర్ డ్యామేజ్ అయ్యింది అని ఒక ప్రమాద హెచ్చరిక. లివర్ డ్యామేజ్ అయిన వారిలో మనం వెంటనే గుర్తించి తక్షణం త్వరగా అలసిపోవడం. ఎక్కువగా నీరసంగా ఉండడం. లివర్ డామేజ్ అయితే శరీరంలో టాక్సిన్స్ శాతం పెరుగుతుంది కనుక నీరసంగా నిస్సత్తువగా అనిపిస్తుంది. లివర్పై లోడ్ ఎక్కువ అయినప్పుడు లివర్ లో ఉన్న టాక్సిక్ సాట్ సెల్లు గా మారి శరీరం పై అధిక భారం పడుతుంది. అలాంటి సందర్భంలో బరువు కూడా చాలా త్వరగా పెరుగుతారు. అతిగా తినక పోయినా కూడా ఒక్కసారిగా అధిక బరువు పెరుగుతున్నట్లు అయితే లివర్ పాడయింది అని గుర్తించాలి. లివర్ సరిగా పనిచేయనప్పుడు ఆకలి కూడా మందగిస్తుంది ఆహారం సరిగా తీసుకోవాలి అని అనిపించదు. ఆహారం సరిగా జీర్ణం కూడా అవ్వదు. ఆహారం తీసుకున్న వెంటనే కడుపు నొప్పి కూడా వస్తుంది. నరాల బలహీనత సమస్య కూడా లివర్ డ్యామేజ్ వలన వస్తాయి. ఇప్పుడు చెప్పిన అయిదు ప్రధాన లక్షణాలు కనిపిస్తే కాలయం ప్రమాదంలో ఉన్నట్లు. అయితే ఎంత చెడిపోయిన సరే కాలేయాన్ని మనం డీటాక్స చేసుకొని శుభ్రపరుచుకోవచ్చు.
ఇప్పుడు మనం మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతో మన లివర్ ని ఎలా డిటాక్స్ చేసుకోవాలి అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. అలాగే లివర్ చెడిపోకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా కావలసినది సొరకాయ .ఒక సొరకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే సొరకాయ చాలా మందికి నచ్చదు. కాని దీనిలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సొరకాయలు క్యాల్షియం ఫాస్ఫరస్ విటమిన్ సి బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది సులువుగా జీర్ణం కూడా అవుతుంది. ఇది ఒక డై యూరిన్ గా పనిచేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ను కూడా తగ్గిస్తుంది. శర కాయని తీసుకోవటం వలన లివర్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలు అనేవి తగ్గుతాయి. కొత్తిమీర మన లివర్ ని శుభ్రం చేయడానికి కిడ్నీ సంబంధిత సమస్యలు నివారించడానికి బాగా సహాయపడుతుంది. మనం తీసుకునే ఆహారం మూలంగా మన శరీరంలో ఎన్నో రకాలైన మూత్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కొత్తిమీర మన లివర్ కి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఒక గుప్పెడు కొత్తిమీర ని తీసుకుని ఆ కొత్తిమీర ను కూడా ఈ సొరకాయలు వేసి కొద్దిగా నీరు కలిపి జ్యూస్ లా తయారు చేసుకోవాలి. తర్వాత కావలసిన పదార్థం పసుపు పసుపు ను కూడా ఒక పావు స్పూన్ మోతాదులో నీటిలో కలుపుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ జ్యూస్ ని ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే లివర్ బాగా శుభ్రపడుతుంది. దీనిని తన అందంతో పాటు ప్రతిరోజూ ఒక గుప్పెడు అంటే పదిహేను లేదా ఇరవై ఎండు ద్రాక్షని తీసుకుంటూ ఉండాలి. దీనిని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి ఇలా మరిగించిన నీటిని వడపోసుకొని ప్రతి రోజూ ఒక గ్లాసు తీసుకోవాలి. ఈ నీటిని రోజు మొత్తంలో ఏ సమయంలోనైనా సరే కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా కిస్మిస్ ని మరిగించిన నీటిని తీసుకోవడం వలన కేవలం 24 గంటల లోని మన లివర్ ని పూర్తిగా శుభ్రం చేసుకోవచ్చు. మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలి చిట్కాలతో పాటు ప్రతి రోజు గ్రీన్ టీ కూడా తాగుతూ ఉంటే కాలేయ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. గ్రీన్ టీ అనేది ఒక నాచురల్ లివర్ డీటాక్స్ ఏజెంట్ అని చెప్పవచ్చు. గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతాయి. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోవచ్చు కాలేయాన్ని క్లీన్ చేసుకోవచ్చు.

Previous articleఈ ఆకులో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు
Next articleశివలింగం ఇంటిలో ఉండొచ్చా ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here