ఒక్క చిట్కాతో వారం రోజులలో పొడవైన జుట్టు…
Long hair – ఈరోజు మనం జుట్టు ఫాస్ట్ గా బాగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే హెయిర్ ప్యాక్ గురించి తెలుసుకుందాం. ఈ ప్యాక్ తో జుట్టు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది అంతేకాకుండా చాలా నల్లగా, ఒత్తుగా, smooth గా కూడా అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ ని ఒకే ఒక్కసారి వాడితే చాలు ఎంత బాగా ఊడిపోయే జుట్టు అయినాసరే ఊడిపోవడం అనేది ఆగిపోతుంది. చాలా బాగా పనిచేసే హెయిర్ ప్యాక్ ఇది. ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా జుట్టుకి అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో మూడు టీ స్పూన్ల కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ హెయిర్ బాగా పెరగడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టు నల్లగా ఒత్తుగా తయారవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. జుట్టు ని మంచిగా సీల్కీగా చేస్తుంది. తరువాత దీనిలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను కలపాలి. కొబ్బరి నూనె కూడా జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. తరువాత దీనిలో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. జుట్టు మృదువుగా మారడానికి ఒత్తుగా పెరగడానికి పెరుగు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్, కొబ్బరి నూనె, పెరుగు ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హెయిర్ ప్యాక్ మిశ్రమం తయారైపోయింది.
దీనిని జుట్టు కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని జుట్టు కి రాసే ముందు తల నూనెతో ఆయిల్ గా ఉండకూడదు. ఈ ప్యాక్ రాసే ముందు జుట్టు మొత్తం డ్రైగా ఉండాలి. ఈ ప్యాక్ ని తల కుదుళ్ళ నుంచి చివరి భాగం వరకు మొత్తం వెంట్రుకలు అంతా కూడా అప్లై చేయాలి. తల కుదుళ్ళలో మొదటి భాగంలో బాగా ఒత్తుగా రాయాలి. ఇలా రాసిన తరువాత ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మామూలు నీటితో ఒక మైల్డ్ షాంపూ ని వాడి తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను ఉపయోగించి తలస్నానం చేస్తే కచ్చితంగా జుట్టు పెరుగుతుంది. పెరగడమే కాకుండా జుట్టు మృదువుగా నల్లగా పట్టుకుచ్చులా గా అందంగా తయారవుతుంది. ఎంతో విపరీతంగా జుట్టు ఊడిపోయే సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కచ్చితంగా జుట్టురాలిపోవడం అనే సమస్య నుంచి ఈ చిట్కా ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. మీరు కూడా ప్రయత్నించి మంచి ఫలితాన్ని పొందండి.
If you like our article about Long hair
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites