Nimma aku వలన ఎంత ఉపయెగమో తెలిస్తే అసలు వదలరు
Nimma aku : మొక్క లేని ప్రకృతి మనకు ప్రసాదించిన వరమని చెప్పవచ్చు అందులోనూ ఔషధ మొక్కలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఔషధ మొక్కల ద్వారా ఎటువంటి హాని లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అనేక రకాలైన అనారోగ్యాలను సురక్షితంగా తగ్గించుకోవచ్చు. అలాంటి గొప్ప ఔషధ మొక్క గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ మొక్క ఏమిటి అని అనుకుంటున్నారా నిమ్మ మొక్క. అవును నిమ్మకాయ గురించి అందరికీ బాగా తెలుసు. నిమ్మకాయలో కాయ ,తోలు, నిమ్మరసం ప్రతి ఒక్కటి కూడా మనకే ఆరోగ్యానికి ఉపయోగమే. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయ లోనే కాదు ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం నిమ్మ ఆకులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం.
నిమ్మ ఆకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో విటమిన్ సి విటమిన్ బి క్యాల్షియం పాస్పరస్ మెగ్నీషియం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇలా ఎన్నో గుణాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మ ఆకు ఆంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. నిమ్మ ఆకులు ఆయుర్వేదం తో పాటు పలు రకాల ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తల నొప్పితో ఎక్కువగా బాధపడేవారు నిమ్మ ఆకులను తీసుకొని వాటి వాసన పీలిస్తే తలనొప్పి డిప్రెషన్ ఒత్తిడి అనేవి తగ్గిపోతాయి. నిమ్మ ఆకు ని మొక్క ని చాలా మంది చూసే ఉంటారు చాలా మంది ఇళ్లల్లో వీటిని పెంచుతూ ఉంటారు కూడా. ప్రస్తుత కాలంలో వీటిని కుండీలలో కూడా పెంచుతున్నారు. నరాల సంబంధిత బాధలతో బాధపడుతున్న అలాగే ఒత్తిడి డిప్రెషన్ మైగ్రేన్ వంటి సమస్యలు ఉన్నా నిమ్మ ఆకులతో వీటిని తగ్గించుకోవచ్చు.
Nimma – aku టీ తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా నీటిని పోసి ఆ నీటిని బాగా మరిగించాలి తర్వాత దానిలో నాలుగైదు నిమ్మ ఆకులను వేయాలి. ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత వేసి ఆ ఆకులను నీటిలో అలాగే ఉంచేయాలి. తరువాత నిమ్మ ఆకుల టీ అనేది తయారైపోయింది. దీనిని ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. కిడ్నీలో రాళ్లు శ్వాసకోశ సంబంధ సమస్యలు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా దగ్గు జలుబు గొంతు ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. నిమ్మ ఆకులను ఏమి ఆంటీ పైరటిక్ ఫీవర్ ని కూడా తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. కడుపునొప్పితో బాధపడుతున్న వారు తలనొప్పి జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు జీర్ణ సంబంధిత సమస్యలు కండరాలలో తిమ్మిరి కడుపునొప్పి ఇలా అనేక రకాల నొప్పులకు నిమ్మ ఆకులతో టీ ని చేసుకొని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది.
నిమ్మ ఆకులలో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపు లో ఉన్నటువంటి క్రిములను నాశనం చేయడానికి బాగా సహాయపడుతుంది. పిల్లలు పెద్దలు చాలా మంది కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు నిమ్మ ఆకులను మెత్తగా నూరుకొని పేస్టులాగా చేసుకొని దాన్ని నుంచి రసాన్ని పిండుకుని ఆ రసంలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగినట్లయితే నులిపురుగుల సమస్య తగ్గిపోతుంది. అయితే ఈ చిట్కాలు మీరు ఐదు నుంచి పది రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించాలి. కడుపులో ఉన్న నులి పురుగులు తగ్గిపోవటం మాత్రమే కాకుండా మరి ఎప్పటికీ కూడా అలాంటి సమస్యలు రావు. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఈ నిమ్మ ఆకుల టీ ని ఉదయాన్నే తాగితే బరువు తగ్గవచ్చు. ఉబ్బసంతో బాధపడేవారు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు ఈ టీ నీ రెండుసార్లు తీసుకుంటూ ఉంటే మీకు అలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నిమ్మ ఆకులను లవంగాల ని మెత్తని పేస్టులాగా చేసి ఏ ప్రదేశం లో అయితే పంటి సమస్యతో బాధపడుతున్నారు ఆ ప్రదేశం లో ఉంచినట్లయితే దంత సంబంధిత సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. నిమ్మ ఆకుల కొద్దిగా ఉప్పు కొద్దిగా బేకింగ్ సోడా కలిపి మెత్తని పేస్టులాగా చేసి దంతాలపై రుద్దితే మీ దంత సమస్యలు దుర్వాసన కూడా తగ్గిపోతాయి. ఈ టీ తాగడం వలన అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కొంత మంది ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతుంటారు అలా తాగే సమయంలో దానిలో ఒక నిమ్మకు కలుపుకుంటే ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. మంచి రుచిగా కూడా ఉంటుంది. ఇలా నిమ్మాకు తో అనేక రకాలైన ఇటువంటి ప్రయోజనాలు ఉన్నాయి.