Dowry : కట్నం తీసుకురాలేదని భార్య ను దారుణంగా….
Dowry : ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు, ఆస్తులపై మోహం పెంచుకుంటూ మానవ సంబంధాలకి ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదు. అయితే కట్నం తీసుకోవడం నేరమని అలాగే కట్నం తీసుకునే వ్యక్తి గాడిదతో సమానమని ఇప్పటికే కేంద్రz రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కట్నం అడిగినట్లు రుజువైతే జైలు శిక్ష కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ కొందరు ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా అడిగినంత కట్నం ఇవ్వాలని ఆడపిల్లల తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరైతే ఏకంగా ఈ డబ్బు, కట్నం మోజులో పడి కట్టుకున్న భార్యను కడతేర్చడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్య కట్నం డబ్బు తీసుకురాలేదని దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
Dowry – పూర్తి వివరాల్లోకి వెళితే
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ముజఫర్ నగర్ లో మున్ని (పేరు మార్చాం) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. కాగా మున్ని కుటుంబ సభ్యులు కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా దొరికేటువంటి చిన్నచిన్న పనులు మరియు వ్యాపారాలు చేసేవారు. దీంతో తమకు ఉన్నంతలో మున్ని ని బాగానే చూసుకున్నారు. అయితే తెలిసిన వారి ద్వారా పెళ్ళి సంబంధం రావడంతో పర్వేజ్ అనే యువకుడితో మున్ని కి వివాహం చేశారు. దీంతో తమకు ఉన్నంతలో అల్లుడికి కట్న, కానుకలు ఇచ్చి తమ కూతురిని అత్తారింటికి గౌరవంగా సాగనంపారు. దీంతో పెళ్లయిన కొత్తలో నవ దంపతులు చాలా హ్యాపీ గా ఉండే వాళ్ళు. కానీ క్రమక్రమంగా పర్వేజ్ కి ధన దాహం మొదలైంది. దీంతో అప్పుడప్పుడు పర్వేజ్ తన భార్య మున్నీని అదనపు కట్నం తీసుకురావాలని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇది చూసిన మున్ని అత్తమామలు కూడా తమ కొడుకుని మందలించిందిపోయి చివరికి అతడినే సమర్థించారు.

కానీ ఈ విషయాల గురించి బాహ్య ప్రపంచానికి తెలిస్తే తమ కుటుంబ సభ్యుల పరువు పోతుందని మున్ని తన భర్త పెట్టే బాధలను మౌనంగా భరించసాగింది. కానీ ఆమె భర్తలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోగా రోజురోజుకీ కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తాజాగా పర్వేజ్ ఏకంగా తన భార్యతో అదనపు కట్నం కోసం మరో మారు గొడవ పడ్డారు. అయినప్పటికీ మున్ని మాత్రం అదనపు కట్నం డబ్బు తీసుకురానని తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో తన భార్యను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ లో భాగంగా తన కుటుంబ సభ్యులతో కలిసి తన భార్య మున్ని కి బలవంతంగా యాసిడ్ ద్రావణం తాగించాడు.
దీంతో మున్ని అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఎవరికి తెలియకుండా అంత్యక్రియలు కూడా నిర్వహించేశారు. ఈ విషయం తెలుసుకున్న మున్ని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా బోరున విలపించారు. అనంతరం దగ్గర ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తమ అల్లుడు పర్వేజ్ చేసిన ఈ ఘాతుకాన్ని పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పర్వేజ్ మరియు అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.
If you like our article about Dowry
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites