సైన్టిస్ట్ లకు సైతం అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయ రహస్యాలు

221

అమ్మవారిని మనం కోరుకున్న రూపంలో మనకి మనసుకి నచ్చిన భావనలు మనం స్థిరంగా పూజించుకుంటూ వుంటారు. కానీ అమ్మవారికి ఒక స్థిరమైన రూపం అంటూ ఏముంటుంది. ప్రపంచంలో ప్రతి రూపం కూడా అమ్మవారిని అందమైన ఆ అమ్మవారిని అగ్ని రూపంలో ఉండే స్థలం కూడా ఒకటి ఉంది. అదే హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్నా జ్వాలాముఖి ఆలయం. ఇక్కడ ఎప్పుడూ కూడా అమ్మవారి నోటిలో నుంచి మంటలు వస్తూనే ఉంటాయి. దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కాంగ్రా లోయ లో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం జ్వాలాముఖి. అక్కడ ఉన్న స్థానికులు జ్వాలాజీ గా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి సుమారు 600 మీటర్ల ఎత్తులో ఉన్న సిమ్లా హైవేపై కాంగ్రా పట్టణానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది. 51 శక్తి పీఠాలలో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుండి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీనిని ఆలయ పురోహితులు వెలిగించడం జరుగుతుంది. ఈ  జ్వాలాముఖి అమ్మవారు గా పూజలను అందుకుంటుంది. ఇక్కడ ఈ జ్వాలతో పాటు మహాకాళి అన్నపూర్ణ చండీ సింధూర విన్ధ్యవాసిని మహాలక్ష్మి సరస్వతి అంబికా అంజనీదేవి ఈ తొమ్మిది కూడా జ్వాలా దేవతల పేర్లు.

దక్షయజ్ఞం తరువాత సతీదేవి తనను తాను దహించివేసుకుంది. అలా దహించుకున్నటువంటి శరీరం పద్దెనిమిది శకలాలుగా ఈ భూమి మీద పడింది అని చెప్పారు. వాటిని మనం అష్టాదశ శక్తి పీఠాలు గా కోలుచుకుంటున్నాం. 50 ఒక ప్రదేశాలలో అమ్మవారి ఖండిత భాగాలు పడ్డాయని అని చెబుతూ ఉంటారు వాటిలో ఒకటి హిమాచల్ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాముఖి ఆలయం. జ్వాలాముఖి క్షేత్రం లో అమ్మవారి నాలుక పడిందట. అందుకే అక్కడ అమ్మవారు నాలుక చేస్తున్నట్లుగా నిరంతరం ఒక వెలుగు వెలువడుతూ ఉంటుంది. కానీ నిరంతరంగా విడవకుండా వెలుగుతున్న టువంటి ఈ మన వెనకాల ఉన్న కారణం ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు.
దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది అని అనుమానించిన వారు సైతం భంగపడక తప్పలేదు. జ్వాలాముఖి అంటే నోటిలో నుంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగా ని ఇక్కడ అమ్మవారికి బదులుగా కొండ గోడల నుంచి చిన్న మంట వస్తుంటే దానికి పూజలు చేస్తూ ఉంటారు. శ్రీ యంత్రం ఉన్న ప్రదేశంలో ఈ ఎర్రని శాలువాతో బంగారు ఆభరణాలతో ను కప్పి ఉంచుతారు. శ్రీ యంత్రానికి ఎర్రటి వస్త్రం పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ అమ్మవారి మందిరంలో సిక్కు మతస్తులు వివాహాలు నిర్వహించడం అధిక సంఖ్యలో కనిపిస్తూ ఉంటుంది. నూతన వధూవరులు కూడా అమ్మవారి దర్శనార్థం రావడం జరుగుతుంది. గోరక్ నాథ్ శిష్యులు తపస్సు చేసుకుంటూ కనిపిస్తూ ఉంటారు. మందిర మఠం దగ్గర అ గోరఖ్నాథ్ కింద ఉన్న జ్వాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇనప గేట్లు కట్టిన నీటి గుండం లో నుంచి నీటిలో నుంచి వస్తున్న జ్వాలలు అక్కడికి వచ్చిన భక్తులను ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడ అమ్మవారికి భక్తులు పెద్ద పెద్ద పళ్ళా లో పండ్లు పసుపు కుంకుమ ఎర్రని వస్త్రం తో పాటు తీపి వంటకాలు అన్నీ కూడా సమర్పిస్తారు. అయితే అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో సిక్కులు కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది.
పూర్వం కటోజ్ వంశానికి చెందిన మహారాజా భూమా చంద్ర దుర్గా దేవి కి పరమ భక్తుడు. ఒక రోజు అమ్మవారు భూమా చంద్రికి కలలో కనిపించి తను అడవిలో జ్వలగా పూజ నైవేద్యాలు లేకుండా పడి ఉన్నట్లు తను వెతికి తెచ్చి నిత్య పూజలు నిర్వహించ వలసినదిగా చెప్పగా మహారాజు అడవుల నీ వెతికి అమ్మవారిని కనుగొనడం జరిగింది. అమ్మవారికి దేవాలయాన్ని కట్టించి నిత్య పూజలు నిర్వహించ సాగాడు. ఇప్పటికీ అక్కడ జ్వాల తప్ప మరి ఏ విగ్రహం కనిపించకపోవడం విశేషం. సిక్కుల మత గురువు అయిన గురునానక్ ఇక్కడికి వచ్చి ప్రశాంతమైన ఈ వాతావరణం నచ్చడంతో ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండగా అయితే గురునానక్ పై శత్రుత్వాన్ని పెంచుకున్న అక్బర్ గురునానక్ ప్రార్థిస్తున్నా అమ్మవారి యొక్క జ్వాలలని ఆర్పాలని ఆ ప్రదేశమంతా కొన్ని రోజుల పాటు నీటితో నింపాడు. కొన్ని రోజుల తర్వాత కూడా నిరంతరం గా వెలుగుతున్నటువంటి జ్వాలని చూసిన అక్బర్ గురునానక్ ని మహా పురుషుడిగా అంగీకరించి అమ్మవారికి చత్రం సమర్పించి ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్న జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. అమ్మవారికి దుర్గాసప్తశతి పద్ధతిలో పూజలు హారతులు హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు మధ్యాహ్నం హారతి కోసం మూసివేస్తారు. మిగతా సమయంలో అంటే రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మందిరం తెరిచి ఉంటుంది. నిత్యం దుర్గాసప్తశతి పారాయణ నడుమ నిత్యాగ్నిహోత్రం గా వెలుగుతున్న అమ్మవారు వెలుగుని దర్శించుకుని పునీతులవుతుంటారు భక్తులు. జ్వాలాముఖి అమ్మవారి ముఖ్య క్షేత్రం ఇది అయినప్పటికీ ఆమె పేరుతో దేశంలో అనేక ప్రదేశాలలో ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఉత్తర ప్రదేశ్ లోని శక్తి సాగర ఆలయం ముక్తినాథ్ ఆలయం జ్వాలాముఖి ఆలయం, వీటిలో ప్రముఖమైనవి గా చెప్పబడుతున్నాయి. ఉత్తరాదిలో చాలా కుటుంబాలు జ్వాలాముఖి దేవి ని తమ కులదేవతగా భావిస్తూ ఉంటారు. గోరఖ్నాథ్ ఇక్కడ తపస్సు చేయడం వల్ల అనేక సిద్ధులు పొంది నట్లుగా వారి శిష్యులు చెబుతూ ఉంటారు. 815 లో మహారాజా రంజిత్ సింగ్ బంగారు గోపురం తో సహా పాల రాతి మందిరం నిర్మించారు పెద్దపెద్ద మండపాలలో ఒకపక్క సామూహిక వివాహాలు జరుగుతూ ఉంటాయి. మరోపక్క నేపాలీ రాజు బహూకరించిన పెద్ద ఇత్తడి గంటను ఉంచారు. ఈ మందిరంలో ముఖ్యంగా ఏడు జ్వాలలు అని దర్శించుకోవాలి. అవి అమ్మవారి రూపం. ఇది ఒక మహిమాన్వితమైన అటువంటి ఆలయం.

Previous articleఈ ఒక్క పనితో మీ పళ్ళు మీరే నమ్మలేనంత తెల్లగా మారిపోతాయి
Next articleఊపిరితిత్తులలో చేరిన సిగెరెట్ వ్యర్థం ఒక్కసారిగా బైటకు రావాలంటే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here