janatha garage : జనతా గ్యారేజ్ చిత్రంలో బాబాయ్, అబ్బాయ్ నటించాల్సిందట…

491

janatha garage : టాలీవుడ్ లో 2016 సంవత్సరంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, నిత్యమీనన్ తదితరులు హీరోయిన్లు గా నటించారు. అలాగే మలయాళ ప్రముఖ నటుడు మోహన్ లాల్, సాయి కుమార్, తమిళ నటుడు ఉన్నిముకుంద, దేవయాని, రెహమాన్, బ్రహ్మాజీ, సితార, సీనియర్ నటుడు సచిన్ ఖడ్కర్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. యాక్షన్ డ్రామా తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో పాటు దాదాపుగా 85 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను కూడా కలెక్ట్ చేసి దర్శకనిర్మాతలకు లాభాల పంట పండించింది.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కొరటాల శివ ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని ఇందులో భాగంగా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో పెదనాన్న సత్యం పాత్రలో నటించిన మోహన్ లాల్ పాత్రలో ముందుగా నందమూరి నటసింహం హీరో నందమూరి బాలకృష్ణ ని నటింప చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారట. కానీ ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండటంతో జనతా గ్యారేజ్ చిత్రం కోసం డేట్లు కుదరలేదట.

దాంతో చివరికి ఈ అవకాశం మలయాళ నటుడు మోహన్ లాల్ కి దక్కింది. అయితే మోహన్ లాల్ కూడా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసి ప్రేక్షకులను బాగానే అలరించాడు. దీంతో జనతా గ్యారేజ్ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కానీ నందమూరి అభిమానులు మాత్రం కొంతమేర నిరాశకు గురయ్యారు. ఒకవేళ జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటించుంటే బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే గతంలో కూడా తెలుగు ప్రముఖ దర్శకుడు చక్కని ఎస్.ఎస్.రాజమౌళి నందమూరి బాలకృష్ణతో సింహాద్రి చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేశాడట. కానీ నందమూరి బాలకృష్ణ సింహాద్రి చిత్రంలో నటించడానికి ఒప్పుకోకపోవడంతో చివరికి ఈ కథని ఎన్టీఆర్ చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాడు. ఇలా బాబాయి, అబ్బాయిల కాంబినేషన్లో సినిమా వస్తుందని అనుకున్న ప్రతిసారీ ఈ ఇద్దరూ తమ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నారు. మరి నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి మల్టీస్టారర్ చిత్రం చేసి తమ అభిమానులను ఎప్పుడు ఆనంద పరుస్తారో చూడాలి.

Previous articleMohan Babu : మంచు మోహన్ బాబు సీనియర్ హీరోలతోనే అలా ప్రవర్తించేవాడట… ఆడియో లీక్….
Next articleపొరపాటునకూడ ఈ పదాలు గూగుల్ లో సెర్చ్ చేయకండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here