Prabhas : తన సినిమాలో నటించడానికి ఆ హీరో నో చెప్పాడని ఇంకో హీరోతో తీసి పంతం నెగ్గించుకున్న జక్కన్న…

464

Rajamouli movie rejected by Prabhas

Prabhas : టాలీవుడ్ లో ప్రముఖ హీరో నితిన్ హీరోగా నటించిన “సై” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినీ కెరీర్ ని కూడా ఈ చిత్రం మలుపు తిప్పిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా జెనీలియా నటించగా తెలుగు ప్రముఖ నటుడు పృథ్వి, తనికెళ్ల భరణి, సుధ, స్వర్గీయ కమెడియన్ వేణు మాధవ్, ప్రదీప్ రావత్, సమీర్, అజయ్, ఛత్రపతి శేఖర్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాత శ్రీ భారతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏ.భారతి నిర్మించింది. అయితే ఈ చిత్రం రగ్బీ గేమ్ ఆటపై తెరకెక్కించడంతో ప్రేక్షకులు బాగానే ఆదరించారు. దీంతో ఈ చిత్రం అప్పట్లో 15 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఈ చిత్రంలో హీరోగా నటించిన నితిన్ పాత్ర ముందుగా మరో తెలుగు ప్రముఖ హీరో ని వరించిందట. కానీ ఆ హీరో కుటుంబ సభ్యులు కథ విషయంలో జోక్యం చేసుకోవడంతో దర్శక నిర్మాతలకు ఆ విషయం నచ్చలేదట. దీంతో చివరికి ఈ కథ హీరో నితిన్ కి నచ్చడంతో హీరోగా నటించాడట. దాంతో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏకంగా జక్కన్న సినిమాలో నటించే అవకాశాన్ని చేజార్చూకున్నటువంటి హీరో ఎవరో అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ప్రభాస్ కూడా ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించలేదు

ఈ క్రమంలో సై సినిమా ఆఫర్ ని టాలీవుడ్ ప్రముఖ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని కూడా వరించిందని కానీ ప్రభాస్ కూడా ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపించలేదని ఆ మధ్య కొన్ని పుకార్లు వినిపించాయి. కానీ ఈ విషయంపై ఇటు జక్కన్నగాని అటు ప్రభాస్ గాని స్పందించలేదు. దీంతో ఇలా ఊరు, పేరు లేనటువంటి గాసిప్స్ వినిపించడం సినిమా ఇండస్ట్రీలో కొత్తేమీ కాదని కాబట్టి వీటిని పట్టించుకోవద్దని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ కరోనా వైరస్ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడంతో ఈ చిత్రం విడుదలను చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్ర విడుదల దాదాపుగా మూడు సార్లు వాయిదా పడింది. దీంతో తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు మరోమారు ప్రకటించారు. దాంతో కనీసం ఈసారైనా అనుకున్న తేదీకి ఆర్.ఆర్.ఆర్ చిత్రం విడుదల చేస్తారో లేదో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleAnupama parameswaran : గర్భవతి గా కనిపించిన అనుపమ! అవాక్కయిన అభిమానులు.
Next articleOng Dam sorot have Eight Wives : అమ్మ బాబోయ్ ఆయనకి 8 మంది భార్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here