కళ్ళముందు కనిపిస్తున్నావని ఆనంద పడాలా ? ఇక కనిపించవని బాధ పడాల ?

265
James
James

నమ్మ బాస్, నమ్మ అప్పు, నమ్మ పునీత్ రాజ్ కుమార్…కర్నాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. లెజెండ్ మిమ్మల్ని చివరి సారి తెర మీద చూసేందుకు నిన్నటి నుంచి నిద్ర పట్టడం లేదు. ఒక వైపు మీ సినిమా థియేటర్ లోకి వస్తుందన్న సంతోషం, మరోవైపు మీరు సినిమా తెర మీద ఉన్నారు. కానీ బయట లేరన్న నిజం గుర్తుకు వస్తుంటే ఏడుపొస్తుంది. కానీ మీ చిరు నవ్వే నా మనసులో ఉంచుకోవడానికి సినిమాకు వెళ్తున్నానని ఓ అభిమాని బల్లారి లోని గంగా థియేటర్ లో ఉదయం నాలుగు గంటల షో కు వెళ్తూ సోషల్ మీడియాలో పెట్టిన మెస్సేజ్

ఇక జేమ్స్ …సినిమా హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెయిన్ మెంట్. భారీ గన్స్ తో చేజింగ్ లతో హాలీవుడ్ మూవీని తలపించేలా సినిమా ఉందని ఫ్యాన్స్ సంతోషంగా చెబుతున్నారు. తెలుగు నటుడు శ్రీకాంత్ ఇందులో నటించారు. ఇటు శరత్ కుమార్ సహా భారీ క్యాస్టింగ్ తో మూవీ సూపర్ రిచ్ గా ఉంది. జేమ్స్ గా విలన్ లను వెంటాడుతూ వేటాడుతూ చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. పునీత్ ఈ రోజు ఉండి ఉంటే తన సినిమా కు ఫ్యాన్స్ సంతషాన్ని చూసి మురిసిపోయేవారేమె.

James Movie
James Movie

గ్రావిటీ డిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు తన ట్రేడ్ మార్క్ డ్యాన్స్ లు, అదిరి పోయే మాటలు సినిమాకు సూపర్ కిక్ ఇచ్చాయి. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సూపర్ గా ఉంది. జేమ్స్ ఇంటర్ మిషన్ అని వేశారు. అది ఫ్యాన్స్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. మీరు మాకు మంచి ఎంటర్టెయిన్మెంట్ ఇచ్చారు. మీరు లేరేమో కానీ మా హ్రుదయాల్లో ఉన్నారు. మీ చిరు నవ్వు మా హ్రుదయాల్లో ఉంటుందని కొంత మంది సీట్లలో కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఒక థియేటర్ లో ఫ్యాన్స్ దాదాపు అరగంట సేపు నిలుచునే సినిమా చూశారు. ఇది అప్పుకు మా ట్రిబ్యూట్ అంటూ సినిమాను నిలబడి చూశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. బల్లారిలో ఒక థియేటర్ ను పెళ్లి మండపంలా తీర్చిదిద్దారు. సినిమా రివ్యూ కాదు…ఇది మాకు ఎమోషనల్ జర్నీ. సినిమా ఎలాగూ బాగుంటుంది. కానీ మాకు చివరి సారి మొదటి రోజు రిలీజ్ అయినప్పుడు వెండి తెరపై అప్పును చూసుకుంటాం. అంతే తప్ప మాకు కథ, హిట్ తో సంబంధం లేదని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇక సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.

డ్యాన్స్ లు కేక పుట్టించాయి. పునీత్ రాజ్ కుమార్ మొదటి జయంతి రోజు చివరి సినిమా చూడాల్సి రావడం అందరికీ గుండె బరువెక్కింది. పునీత్ కు రెస్పెక్ట్ గా కన్నడ ఇండస్ట్రీ మరో మూవీని రిలీజ్ చేయలేదు. ఇక తమ్ముడు కోసం పునీత్ రాజ్ కుమార్ సోదరులిద్దరూ క్యామియో రోల్స్ చేసి తమ్ముడికి ఘనమైన వెండి తెర వీడ్కోలు పలికారు. ఇది సినిమా కాదు. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఎమోషనల్ రైడ్. ఇక సినిమా లో ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆడియెన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తోంది. బలమైన కథ కత్తిలాంటి హీరో కు తోడైంది. యాక్షన్, మాటలు, పాటలు మొత్తంగా సూపర్. పునీత్ తన ఫ్యాన్స్ కు ఇచ్చిన మసాలా ఎంటర్టెయినర్ ఈ మూవీ. పాత కథే అయినా స్టంట్స్ పీక్స్ లో ఉన్నాయి. ఇక డ్యాన్స్ ల్లో అయితే కన్నడ ఇండస్ట్రీలో ఆయన్ను కొట్టేవారు లేరు. పునీత్ ఉండి ఉంటే మొదటి రోజు తన ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ షాక్ లిచ్చి కలుసుకునేవారు. మొత్తంగా చెప్పాలంటే నో రివ్యూ. దేవుడి లాంటి పునీత్ మళ్లీ వెండితెరపై కనిపించరు. ఆయన్ను జస్ట్ అలా ఒక సారి చూసి మనం నివాళి అర్పించడమే చేయాల్సింది. ఇప్పుడు కర్నాటకలో జేమ్స్ మానియా నడుస్తోంది. ఎలా ఉంది కాదు…చూశామా లేదా అనేదే టాక్.

Previous articleఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? చేసేటపుడు ఇవి చూడడం మాత్రం మర్చిపోవద్దు
Next articleది కశ్మీర్ ఫైల్స్ – సోషల్ మీడియాను ఊపేస్తున్న సినిమా, కన్నీరు తెప్పించే కథ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here