Jhanvi Kapoor : రోజులు చాలా కఠినంగా గడిచాయంటున్న హీరోయిన్ కూతుళ్ళు

246
Jhanvi Kapoor :

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ ఏకంగా డెల్టా, ఓమిక్రాన్ కొత్త రూపాలను సంతరించుకుంటుంది. దీంతో సామాన్య ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఆ మద్య బాలీవుడ్ లో “ధడక్” అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను బాగానే అలరించిన బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ Jhanvi Kapoor కూడా కరోనా వైరస్ బారిన పడింది.

దీంతో తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయం గురించి స్పందించింది. ఇందులో భాగంగా స్టోరీ ని షేర్ చేస్తూ ఈనెల 3వ తారీఖున తాను మరియు తన సోదరి ఖుషి కపూర్ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నామని దాంతో తమకి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. దీంతో తాను మరియు తన సోదరి వైద్యుల సూచనల మేరకు గత తొమ్మిది రోజులుగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నామని, అలాగే వైద్యులు సూచించిన మందులను తీసుకుంటూ ఇటీవలే హోమ్ ఐసోలేషన్ గడువు పూర్తిచేశామని చెప్పుకొచ్చింది. అనంతరం మరోసారి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా తమకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపింది.

jhanvi-kapoor

అయితే తాము హోమ్ ఐసోలేషన్ లో చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని అందువల్లనే ఈ పరిస్థితుల నుంచి బయట పడాలని ఎప్పటికప్పుడు వైద్య సలహాలను పాటించామని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, అంతే కాకుండా బయట సంచరించే సమయంలో మాస్కులు ధరించడం తో పాటు భౌతిక దూరం కూడా పాటించాలని సూచించింది. అలాగే ఎలాంటి జబ్బు బారిన పడిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని అంతేగాని సొంత వైద్యం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పనికిరాదని చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది చివర్లో ఈచిత్రంతో ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు మూడు సినిమాల ఆఫర్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సమాచారం. ఇక దోస్తానా చిత్రం కి సీక్వెల్గా తెరకెక్కుతున్న దోస్తానా 2 చిత్రం ముంబై నగర పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

 

Previous articleKajal Aggarwal : ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కాజల్… అలా చెప్పేసిందిగా…
Next articleRashi : బాలయ్య తో ఆ సీన్ లో నటించేందుకు ఈ హీరోయిన్ నో చెప్పిందట… దాంతో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here