పునీత్ ఆఖరి సినిమా టీజర్…చూసి ఎమోషనల్ అయిన ప్రభాస్

732
Kannada power star
Kannada power star

పునీత్ రాజ్ కుమార్ అంటే ఇప్పుడు ఒక ఎమోషన్

పునీత్ రాజ్ కుమార్ అంటే ఇప్పుడు ఒక ఎమోషన్. సినిమాలు చూసేవారికే కాదు అసలు ఆయన ఉన్నాడని ఒకప్పుడు తెలియనివారికి ఆయన పేరు ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచింది. ఎందుకంటే హీరోగా మాత్రమే ఆయన ముందు పరిచయం. కన్నడలో అప్పుగా, పవర్ స్టార్ గా, రికార్డ్ లు బద్దలు కొట్టే యాక్షన్ హీరోగా తెలుసు. కానీ పునీత్ అక్టోబర్ 29,2021న చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలిసింది. డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ పెట్టే గుణం కోటికొక్కరికే ఉంటుంది. పేరు అందరికీ వస్తుంది. కానీ దానిని మానవత్వంగా మార్చుకునే దమ్ము ఎవరికీ ఉండదు. కానీ పునీత్ కు ఆ రెండూ ఉన్నాయి.

Kannada power star
Kannada power star

ప్రేక్షకులు ఇచ్చిన డబ్బును పేదలకు ఉపయోగించారు. అభిమానులు ఇచ్చిన ప్రేమను సేవ రూపంలో రుణం తీర్చుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 అనాథాశ్రయాలకు ప్రతి నెలకు తన ఆఫీస్ నుంచి చెక్ లు వెళ్తాయి. ఏడాదికి సరిపడా 19 గోశాలల ఖర్చుకు తన ఆఫీస్ నుంచి డబ్బులు వెళ్తాయి. 18వందల మంది పిల్లలకు ఆయన తండ్రి. వారందరికీ పుస్తకాలు, బట్టలే కాదు బంగారు భవిష్యత్ కు పునాదులు వేశారు. ఇంత మంచి మనిషి భూమి పై దేవుడు అవుతున్నాడని ఆ దేవుడికే కన్ను కుట్టినట్లుంది. మరీ ఎక్కువగా దేవుడి వి అయిపోతున్నాడనుకున్నాడేమో మన మధ్య నుంచి ఆయన్ను తీసుకెళ్లారు. ఇప్పుడు బెంగళూరు వెళ్తే ప్రతి ఒక్కరు చూడాలనుకునేది పునీత్ రాజ్ కుమార్ గుడి. దానిని సమాధి అనో స్మ్ముతీ వనం అనో పిలిస్తే ఆయన సేవకు అవమానం. అంతలా సంపాదించిన డబ్బును పంచి పెట్టారాయన. ఈ రోజుల్లో హీరోలు, నేతలు ఎంత మంది డబ్బు కోసం గడ్డి తింటున్నారో చూస్తున్నాం. కానీ పునీత్ మాత్రం మంచికి, మానవత్వానికి చిరునామా గా నిలిచారు. ఆయన మరణం గురించి మాట్లాడుకుంటే మనస్సు చివుక్కుమంటుంది. మంచి మనిషి, నవ్వుతూ , నవ్వించే మనిషిని అందరి హ్రుదయాల్లో నిలిచిపోయాడు.

మహా గొప్పమనిషి చివరి సినిమా జేమ్స్ టీజర్ రిలీజైంది. దానిని చూసిన వారందరికీ మన అప్పు బతికే ఉన్నాడని అనుకుంటున్నారు. పవర స్టార్ లో పవర్ తగ్గలేదు. తన సినిమాలు ఇంకా చేస్తున్నాడనే అనుభూతి కలుగుతోంది. కానీ టీజర్ చూస్తున్నంత సేపు puneeth మధ్య లేరు అనే మాటే అందరికీ గుర్తొస్తుంది. అయితేనే ఆయన తన యాక్షన్ తో ఇరగదీశారు. శ్రీకాంత్ విలన్ గా ఈ మూవీ ఆయన మొదటి జయంతి రోజున ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. మార్చి 17న ఆయన జయంతిని సంతోషంగా జరుపుకుందామని పునీత్ సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్, శివరాజ్ కు మారులు ప్రకటించారు. మన అప్పు మన ముందుకు వస్తున్నాడు. కలిసి సినిమా చూద్దామని తెలిపారు. అంతే కాదు కన్నడ లో ఆ వారం మొత్తం మరే సినిమా విడుదల కావడం లేదు. ఇది puneeth కు సినిమా ఇండస్ట్రీ ఇచ్చే ఘన నివాళి. ఆయనకు వారం మొత్తం కేటాయించారు. మంచి మనసున్న పునీత్ చివరి సినిమాను ప్రతి ఒక్కరం చూద్దాం. డబ్బులు కాదు ముఖ్యం. మనకు మన అప్పు మరో సినిమాలో కనిపిండంటూ శివరాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. ప్రియా ఆనంద్, శ్రీకాంత్, ముఖేష్ రుషి, శరత్ కుమార్ లు ఈ సినిమాలో నటించారు. జేమ్స్ టీజర్ చూడగానే ప్రభాస్ ఎమోషనల్ అయ్యాడు. పునీత్ సర్…ఈ సినిమా మిమ్మల్ని అభిమానించే మా అందరికీ ఎప్పటికీ గొప్ప సినిమా. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. కోట్లాది మంది అభిమానులకు ఇది పవర్ ఫుల్ స్పెషల్ అంటూ స్వీట్ పెయిన్ ను పంచుకున్నారు రెబల్ స్టార్. చూస్తుండగానే puneeth మొదటి జయంతి దగ్గరకు వచ్చిందే అంటూ ఎంతో మంది బాధపడుతున్నారు. తప్పదు…ఏది ఆగికా కాలం నిలిచిపోదు. పునీత్ మంచి మనసు స్వర్గంలో ఉన్నా నవ్వుతూనే మనందరినీ చూస్తుందని తెలుసు. అందుకే పునీత్ లివ్స్ ఆన్…అంతే.

If you like our article about పునీత్

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleLong hair – ఒక్క చిట్కాతో వారం రోజులలో పొడవైన జుట్టు.
Next articleJeedipappu ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమొ తెలిస్తే అసలు వదలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here