Dimple Hayathi : నల్లగా ఉన్నానని హీరోయిన్ గా పనికిరావంటూ అవమానించారు… కానీ….

205

Dimple Hayathi insulted as her color Black

Dimple Hayathi : కొంతమంది నటీనటులకు నటన పరంగా మంచి ప్రతిభ ఉన్నప్పటికీ కానీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాకపోవడంతో గుర్తింపుకి నోచుకోనటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో మరికొందరు మాత్రం ఎలాగైనా సరే ఒక్క అవకాశం దక్కించుకొని వెండి తెర పై తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు వంటివి ఎదురైనప్పటికీ పట్టు విడవకుండా శ్రమిస్తున్నటువంటి నటీనటులు కూడా లేకపోలేదు. అయితే తెలుగులో ఆ మధ్య ప్రముఖ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన “గద్దల కొండ గణేష్” చిత్రంలో “జర్రా జర్రా” అనే స్పెషల్ సాంగ్ లో నటించి కుర్రకారు మతి పోగొట్టిన హైదరాబాద్ బ్యూటీ “డింపుల్ హయాతి” కూడా ఈ కోవకే చెందుతుంది. తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్లో ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

నల్లగా ఉన్నావంటూ అవమానించారు – Dimple Hayathi 

ఇందులో భాగంగా తను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అవకాశాల కోసం రోజూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేదానినని తెలిపింది. ఈ క్రమంలో కొందరు దర్శక నిర్మాతలు తన శరీరపు రంగు చూసి తాను నల్లగా ఉండటంతో హీరోయిన్ గా పనికిరానని మొహం మీదే చెప్పే వాళ్ళని ఎమోషనల్ అయింది. మరికొందరైతే ఏకంగా ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు లేదా స్పెషల్ సాంగ్ పాత్రలకోసం ట్రై చేయమని సూటిపోటి మాటలతో మనసు గాయపడే విధంగా మాట్లాడే వాళ్ళని చెప్పుకొచ్చింది. దాంతో మొదట్లో ఈ విషయాలు కొంతమేర తనని బాధించినప్పటికీ క్రమక్రమంగా తనని ఎద్దేవా చేసినవారి మాటలే తనలో నటి కావాలనే కసిని మరింత పెంచాయని తెలిపింది.

Dimple Hayathi
Dimple Hayathi

దాంతో తనకు గద్దల కొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో తన సినీ కెరీర్ కొంతమేర మలుపు తిరిగిందని చెప్పుకొచ్చింది. అలాగే తాను హీరోయిన్ గా నటించిన “ఖిలాడి” చిత్రం కూడా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుందని దాంతో ఈ నెల 11వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలిపింది. అలాగే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని ఈ సినిమాని థియేటర్లో చూడాలని కోరింది.

సినిమా వివరాలు :

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి డింపుల్ హయాతి మొదటిగా తెలుగులో 2017వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన “గల్ఫ్” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి నటిగా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయినప్పటికీ పట్టువిడవకుండా శ్రమించి హిందీ, తమిళ్, తెలుగు, తదితర భాషలలో నటించే అవకాశాలు దక్కించుకుంది. కాగా ఇటీవలే తమిళంలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రం షూటింగ్ పనులు పూర్తయినట్లు సమాచారం.

If you like our article

Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com

Keep Reading articles on our websites

Previous articleOng Dam sorot have Eight Wives : అమ్మ బాబోయ్ ఆయనకి 8 మంది భార్యలు
Next articleSuman : వందల ఎకరాలు ఆర్మీ కోసం ఫ్రీగా ఇచ్చాడంటూ హీరో గురించి ప్రచారాలు…. చివరికి క్లారిటీ ఇచ్చిన హీరో….

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here