Krishna-Indira Devi అలాంటి విషయంలో కూడా గౌరవాన్ని కాపాడిన దేవత ఇందిర దేవి
Krishna-Indira Devi : సూపర్ స్టార్ క్రిష్ణ భార్య, మహేష్ బాబు తల్లి అయిన ఇందిరా దేవి బుధవారం ఉదయం నాలుగు గంటలకు చనిపోయారు. క్రిష్ణ వ్యక్తిత్వాన్ని, ఆయన గౌరవాన్ని కాపాడటం కోసం ఎంతో బాధపడ్డారు. క్రిష్ణ మొదటి భార్య ఇందిరాదేవి. క్రిష్ణ, ఇందిర దంపతులకు ఐదుగురు సంతానం. క్రిష్ణ మొదటి కొడుకు రమేష్ బాబు ఈ మధ్యే అనారోగ్యంతో చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ బాధ నుంచి కోలుకోకముందే ఇందిర కన్నుమూయడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. ఇందిర చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చెన్నైలోని ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. అంతా చక్కబడ్డాక ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఇటీవల మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. ట్రీట్ మెంట్ జరుగుతుండగానే నిద్రలోనే తెల్లవారుజామున నాలుగు గంటలకు చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు సమాచారమిచ్చారు. క్రిష్ణ, ఇందిర దంపతులకు ఐదుగురు పిల్లలు. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఐదుగురి కుటుంబాలు ఆర్ధికంగా భాగానే ఉన్నవారు. పైగా ఇప్పుడు అంతా సినిమా ఫీల్డ్ లోకి తమ పిల్లలను తీసుకొస్తున్నారు.
50 ఏళ్ల సినిమా కెరీర్ లో క్రిష్ణ ప్రతి రోజు మూడు పూటలు సినిమాలు చేస్తూ ఉండేవారు. పెద్ద స్టార్ ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయన ఒక్క క్షణం కూడా ఖాళీగా లేకుండా పనిచేశారు. విజయనిర్మలను క్రిష్ణ పెళ్లి చేసుకున్నా ఇందిర మాత్రం తన పెద్దకొడుకు రమేష్ బాబు దగ్గరే ఉండేది. తల్లికి దగ్గరగా ఉన్న రమేష్ చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. నాటినుంచే ఆమె అనారోగ్యం పాలయ్యారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. పెద్ద కొడుకు పిల్లలతోనే ఆమె ఎక్కువగా గడిపారు.
క్రిష్ణ ఎక్కువగా విజయనిర్మలతోనే గడిపినా ఇందిర కుటుంబ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు. క్రిష్ణ గౌరవాన్ని కూడా కాపాడిన మంచి మనిషి ఇందిర. అందుకే పిల్లలంతా ఎక్కువగా తల్లితోనే గడిపేవారని చెబుతారు.
మరిన్ని వివరాల కోసం Krishna-Indira Devi వీడియో ని తప్పకుండ చూడండి…
Read our Another Article Rebal Star