Krishnam Raju-Chiranjeevi Special Story:
చిరంజీవి నటుడు అవ్వడానికి స్పూర్తి క్రిష్ణంరాజే. ఎన్టీఆర్ ను చూసి తాను నటుడు అవ్వాలని మనసులో అనుకున్నారు క్రిష్ణంరాజు. చిన్నప్పటి నుంచే సినిమా ల మీద పిచ్చితో కొత్త సినిమా వస్తే చాలు థియేటర్ లో వాలేవరు. అయితే మొగల్తూరుకే చెందిన క్రిష్ణంరాజు సినిమా నటుడు కావడంతో చిరంజీవి సహా మొగల్తూరులోని చాలా మంది యువకులు వెండితెరపై వెలిగిపోవాలనుకున్నారు. అయితే ధనవంతుల కుటుంబానికి చెందిన క్రిష్నంరాజు సులభంగా పరిచయాలతో నటుడు అయ్యాడు. మనకు చాలా కష్టం అనుకునేవారు. ఇక మొగల్తూరులో చిరంజీవి ఇంటికి కాస్త దూరంలోనే క్రిష్ణంరాజు ఇల్లు ఉండేది. వారింటికి క్రిష్నంరాజు వచ్చినప్పుడు చిరంజీవి కూడా చూసేందుకు వెళ్లేవారట. మాట్లాడటానికి ప్రయత్నించినా పెద్దగా వీలు కుదిరేది కాదట. ఎందుకంటే క్రిష్ణంరాజును చూసేందుకు పక్క గ్రామాల నుంచి కూడా జనం వచ్చేవారు. ఆ సమయంలో చిరంజీవి కూడా క్రిష్నంరాజు ద్వారా సినిమాల్లో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ కుదరలేదు.
చిరంజీవి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతే కాదు తన ఫ్రెండ్స్ తో పాటు ఇతరులకు క్రిష్ణంరాజు మా ఊరి హీరోనే అని గొప్పగా చెప్పుకునేవారు. ఇక చిరంజీవికి మొదటి అవకాశం మాత్రం తాను సొంతంగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఏవైనా సలహాలు కావాలంటే మాత్రం క్రిష్ణంరాజును అడిగేవారు. ఇక చిరంజీవి హీరో అయ్యాక మొగల్తూరులో క్రిష్నంరాజు ఇంటికి వచ్చే జనం ఆ తర్వాత చిరంజీవి ఇంటికి కూడా రావడం మొదలు పెట్టారు. ఇక కెరీర్ లో క్రిష్నంరాజ్ పీక్స్ లో ఉండగానే చిరంజీవి కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. ఎంతలా అంటే చూస్తుండగానే చిరంజీవి సుప్రీం హీరో అయిపోయాడు. నాటి నుంచి మొగల్తూరు కూడా ఆ రోజుల్లో ఒక సెలబ్రిటీ ఊరులా పేరు తెచ్చుకుంది. ఇక నాగబాబు, పవన్ కళ్యాణ్ లు కూడా వెండితెర మీద వెలిగిపోయారు. ఒకే ఊరు నుంచి పెద్ద స్టార్ లు ఉన్నారని మొగల్తూరు గురించి గొప్పగా చెప్పుకునేవారు. చిరంజీవి కూడా మొదట్లో క్రిష్ణంరాజు గురించి మా ఊరి హీరో అని సన్నిహితులకు, స్నేహితులకు గొప్పగా చెప్పుకునేవారు. ఇదే విషయాన్ని క్రిష్నంరాజుకు నివాళులు తెలుపుతూ మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు.
ఇక అదే మొగల్తూరుకు వెళ్లకపోయినా ప్రభాస్ కూడా తమవాడేనని చెప్పుకుంటారు గ్రామస్తులు. ఎందుకంటే క్రిష్ణంరాజును మించి మెగాస్టార్ చిరంజీవి ఎదిగారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా ప్యాన్ ఇండియా స్టార్. అలా మొగల్తూరు నుంచి అరడజను మంది స్టార్ లు వెలిగిపోతున్నారు. కొంత మంది పాతతరం వాళ్లైతే మొగల్తూరు మొనగాళ్లని తమ అభిమాన తారలగురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.
సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు కృష్ణంరాజుకి వాటంతటవే వచ్చేయలేదు. సినిమాల పట్ల మమకారంతో, సినీ రంగంలోకి ప్రవేశించి ఎన్నో ఎత్తుపల్లాల్ని కృష్ణంరాజు చవిచూశారు.
రాజకీయాల్లోనూ అంతే. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పని చేశారుగానీ, ఏనాడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది లేదు.. రాజకీయ ప్రత్యర్థుల్ని తూలనాడిందీ లేదు. పదవులు రాలేదని కొన్నిసార్లు ఆవేదన చెందినా, ఆ ఆవేదనను బయటకు పొక్కనీయలేదాయన. నిజానికి, ఆయన్ని ఇంకా ఇంకా పెద్ద పదవులు వరించి వుండాల్సింది. ఆయన సామర్థ్యానికి తగ్గ పదవులు ఆయనకు దక్కలేదన్నది నిర్వివాదాంశం.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కృష్ణంరాజు స్వయంగా చిరంజీవికి అండగా వుండేందుకు ముందుకొచ్చారు. ‘నా తమ్ముడు చిరంజీవి.. నేను నా తమ్ముడికి అండగా వుండటానికి వచ్చాను..’ అని చెప్పారాయన. దురదృష్టం, కేవలం.. చిరంజీవితో ఆయన చేతులు కలపడం వల్లనేనేమో.. ఆయన్ని ఓడించేందుకు కొన్ని శక్తులు బలంగా పని చేశాయి.
‘చిరంజీవి మంచివాడు.. ఎవరికైనా సాయం చేయాలనే అనుకుంటాడు. చెడు మాత్రం ఎప్పుడూ చేయడు..’ అని చిరంజీవి గురించి కృష్ణంరాజు తరచూ చెబుతుండేవారు. కృష్ణంరాజు గత కొంతకాలంగా గవర్నర్ పదవి గురించి ఆలోచిస్తూ వున్నారంటారు ఆయనకు అత్యంత సన్నిహితులైనవారు. నిజానికి, అది ఆయనకు కలిగిన ఆశ కాదు. గవర్నర్ పదవిలో కృష్ణంరాజుని చూడాలని, అంతకన్నా పెద్ద పదవికి సైతం ఆయన అర్హుడనీ..
మరిన్ని పూర్తి వివరాలు Krishnam Raju-Chiranjeevi స్టోరీ ఈ వీడియో తప్పకుండ చుడండి.
Read our Another Article Rakesh junjunwala