లిజర్డ్ మ్యాన్ సీక్రెట్స్
lizard man : రకరకాల మనుషులుంటారు అని చెప్పడానికి ఈ lizard man ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇతనికి ఉన్న వింత అలవాటుకి అతని తల్లిదండ్రులు సైతం భయపడ్డారు. ఇప్పటికీ భయపడుతుంటారు. రాజస్థాన్ లోని బైకనీర్ కు చెందిన ఇతని పేరు నవరతన్ హర్ష్ . ఇతన్ని వాళ్ల ఊళ్లో అంతా అతన్ని బల్లి మనిషి, గెకో కింగ్ అని మరికొంత మంది ముద్దుగా మౌగ్లీ అని పిలుస్తారు. పేరు తప్ప ఎలా పిలిచినా మనోడికి సంతోషమే. ఇతన్ని ఇంటర్నేషనల్ గా పాపులర్ చేసింది బల్లులే. ఇతనికి లిజర్డ్స్ స్నేహితులు. వాటితో ఆడుతూ, పాడుతూ గడిపేస్తుంటాడు. జేబుల్లో వేసుకుని తిరుగుతాడు. నోట్లో పెట్టుకుంటాడు. ఇతన్ని చూసి తల్లిదండ్రులు కూడా భయపడిపోయారు. ఇప్పటికి అతన్ని చెక్ చేసి కానీ ఇంట్లోకి రానివ్వరు. ఎందుకంటే డాక్టర్లు బల్లులను పాయిజనస్ జీవులుగా చెప్పారు. దాంతో అతన్ని మొత్తం చెక్ చేసి ఇంట్లోకి రానిచ్చేవారు. కానీ రాను రాను కొంత వరకు వాళ్లకు కూడా భయం పోయింది.
lizard man నవరతన్‌కు ఈ బల్లులంటే ఎలా ప్రేమ పెరిగిదంటే
నవరతన్‌కు ఈ బల్లులంటే ఎలా ప్రేమ పెరిగిదంటే అతను టెంత్ క్లాస్ లో ఉండగా…ఒక బల్లి పై నుంచి తనపై పడింది. దానిని చేతితో పట్టుకుని ఆడుకున్నాడు. ఫ్రెండ్స్ అంతా బల్లి అని ఎగిరి పారిపోతే తాను మాత్రం దానిని పట్టుకుని ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత బల్లులు ఎక్కడ ఉన్నాయా అని పట్టుకుని వాటితో ఆడిపాడటం హాబీగా పెట్టుకున్నాడు. తన దగ్గర ఎప్పుడు పది బల్లులు ఉంటాయి. అవి కరిచినా నొప్పిగా ఫీలవ్వడు. నోటితో గట్టిగా కొరికి అతని స్కిన్ ను పట్టుకుంటాయి. అయినా సరే వాటిని ఒంటిపై వేసుకుని తిరుగుతుంటాడు. కొన్ని సార్లు నోటిలో కూడా పెట్టుకుంటాడు నవరతన్. అవి కరిస్తే నొప్పి కలగదా అంటే కొత్తలో పెయిన్ వచ్చేది. ఇప్పుడు అవి కరిచినా ఏమనపించదంటాడు.
ఒళ్లంతా పాకించుకున్నా కు ఏమీ కాదు

అవి మూత్రం పోసినా స్కిన్ పాడవుతుంది. మరికొన్ని సార్లు అవి ఒంటిపై పాకినా కూడా చర్మంపై పొక్కులు వస్తాయి. కానీ ఈ lizard man కు మాత్రం ఏమీ కావడం లేదు. అతనికి ఏమైనా డౌట్ వస్తే మాత్రం కడిగి వాటిని ఒంటిపై వేసుకుంటాడట. ఒళ్లంతా పాకించుకున్నా నవరతను కు ఏమీ కాదు. ఈ వింత అలవాటు అతనికి ఎంతో మందిని ఫ్రెండ్స్ ని దూరం చేసింది. కానీ ఒకరిద్దరు మాత్రం అతని అలవాటుని లైట్ తీసుకుని ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు, ఇప్పటికీ ఈ పిచ్చి అలవాటు వదిలేయమని సలహా ఇచ్చినా పట్టించుకోడు. తనకు బల్లులంటే ప్రేమంటాడు. భయం లేదు. వాటితో సరదాగా ఆడుకుంటాను. మీకు కుక్కలు, పిల్లులు అంటే ఎలా ఇష్టమో నాకు బల్లులంటే చెప్పలేనంత ప్రేమంటాడీ లిజర్డ్స్ లవర్. ఇప్పడు వాటి కోసం కొత్త అలవాటు నేర్చుకున్నాడు. బల్లులకు బాగా ఇష్టమైన చిన్న చిన్న పురుగులను పట్టి వాటికి దాణాగా పెడుతున్నాడు. లేదంటే ఇంట్లోనే ఏదైనా అవి ఇష్టంగా తినే ఆహారాన్ని పెట్టి పోషిస్తున్నాడు. ఇంట్లో వాళ్లు మాత్రం తమ కొడుకు చేసే పనిని చూసి భయపడుతున్నారు. వందల మంది చెప్పినా,డాక్టర్లు భయపెట్టినా కూడా నవరతన్ ఈ బల్లుల పిచ్చి మాత్రం పోగొట్టుకోవడం లేదు.
Hello Readers Our other articles you must read and share (Don’t Miss these articles )
https://srimedianews.com/khiladi-movie-fame-dimple-hayathi-about-insulting-incident/
https://srimedianews.com/hero-suman-gives-clarity-about-fake-land-donation-news/
If you like our article lizard man
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites