Magadheera : దర్శకుడు రాజమౌళి తండ్రితో అనుకుని కొడుకుతో తీసిన సినిమా ఏదో తెలుసా..?

148

Magadheera : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఓటమి ఎరుగని దర్శకులలో ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. అయితే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ తన సినీ కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా సినిమాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2009వ సంవత్సరంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన మగధీర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ప్రముఖ స్వర్గీయ నటుడు శ్రీహరి, దేవ్ గిల్, సునీల్, బ్రహ్మానందం, రావు రమేష్, శరత్ బాబు, సూర్య (క్యారెక్టర్ ఆర్టిస్ట్) తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని మగధీర చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో ముఖ్యంగా తాను దర్శకుడిగా సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటినుంచి టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని కోరిక ఉండేదని దాంతో ఈ విషయం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో చెప్పడంతో చిరంజీవి కోసం మగధీర చిత్ర కథని సిద్ధం చేశారని చెప్పుకొచ్చాడు. కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సమయంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మెగాస్టార్ చిరంజీవి మగధీర చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదని తెలిపాడు. అయినప్పటికీ మగధీర చిత్ర కథలో కొన్ని మార్పులు చేసి రామ్ చరణ్ తో తీయాలని సూచించాడని తెలిపాడు. ఆ విధంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో చేయాల్సిన సినిమాని కొడుకు రామ్ చరణ్ తో తీశామని సరదాగా చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వచ్చేటువంటి గుర్రపు చేజింగ్ సన్నివేశాల గురించి స్పందించాడు. ఇందులో భాగంగా తాను అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన కొండవీటి దొంగ చిత్రంలో ఉన్నటువంటి కొన్ని గుర్రపు స్వారీ సన్నివేశాలను ఆధారంగా చేసుకొని మగధీర చిత్రంలో రామ్ చరణ్ తో గుర్రపు సన్నివేశాలను తెరకెక్కించామని తెలిపాడు. అలాగే కొండవీటి దొంగ చిత్రంలో హీరో కి గుర్రం సహాయం చేసిన సమయంలో హీరో ఏమాత్రం కృతజ్ఞత చూపించలేదని దాంతో తనకు చాలా బాధేసిందని చెప్పుకొచ్చాడు. కానీ మగధీర చిత్రంలో మాత్రం గుర్రం హీరో ప్రాణాలను కాపాడడంతో హీరో కచ్చితంగా కృతజ్ఞతలు తెలిపాడని అలాగే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ ను ప్రేక్షకులకు బాగానే చూపించగలిగామని తెలిపాడు.

అయితే ఈ చిత్రాన్ని నిర్మాత అల్లు అరవింద్ 35 కోట్ల రూపాయలు బడ్జెట్ వెచ్చించి నిర్మించారు. కానీ మగధీర చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ వద్ద పలు రికార్డులను నెలకొల్పింది. అంతేకాకుండా ఇప్పటి వరకు రామ్ చరణ్ సినీ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మగధీర చిత్రం రికార్డులకెక్కింది. అయితే దాదాపుగా 13 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ తేజ్ మళ్లీ జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో హీరోగా నటించాడు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 25వ తారీకున విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే ఓటమి అంటూ ఎరుగని దర్శకుడు మరియు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న ఇద్దరు బడా స్టార్ హీరోలు ఆర్.ఆర్.ఆర్ నటించడంతో ఈ చిత్ర వసూళ్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఆర్.ఆర్.ఆర్ చిత్రం దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధిస్తుందని ఇప్పటికే పలు ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Previous articleBaba : కూతురుకి పెళ్లి కావడం లేదని బాబా దగ్గరికి తీసుకెళ్లిన తల్లి… చివరికి ఏమైందంటే…
Next articleKalyan chakravarthy : అందుకే ఈ నందమూరి హీరో సినిమాలకి దూరమయ్యాడా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here