Mohan Babu : మంచు మోహన్ బాబు సీనియర్ హీరోలతోనే అలా ప్రవర్తించేవాడట… ఆడియో లీక్….

540

Mohan Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 500కి పైగా చిత్రాలలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు మంచు మోహన్ బాబు బాబు నటనా విభాగంలో మాత్రమే కాకుండా దర్శకత్వం, నిర్మాణం వంటి వాటిలో కూడా ప్రవేశించి బాగానే విజయం సాధించాడని చెప్పవచ్చు.

కాగా నటుడు మంచు మోహన్ బాబు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నాడు. అలాగే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలను స్థాపించి పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నాడు. ఈ మధ్యకాలంలో మంచు మోహన్ బాబు ఎక్కువగా తను నటించిన చిత్రాలతోకంటే వివాదాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు.

కాగా ఇటీవలే తనకి గత పదేళ్లుగా హెయిర్ డ్రెస్సర్ గా సేవలందించిన హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను ని అసభ్య పదజాలంతో తిట్టడం మరియు కులం పేరుతో దూషించడం వంటివి చేయడంతో ఈ వివాదం రోజురోజుకీ పెద్దది అవుతోంది. అయితే ఇటీవలే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను మంచు విష్ణు ఆఫీసు నుంచి 5 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను దొంగిలించాడని మంచు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంచు విష్ణు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను ని అదుపులోకి తీసుకొని విచారించగా రోజురోజుకి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఇందులో భాగంగా నాగ శ్రీను చెప్పిన విషయాలు విని పోలీసులు అవాక్కయ్యారు. దీంతో నాగ శ్రీను కి బీసీ కుల సంఘాల నాయకులు కూడా తమ మద్దతును తెలియజేశారు. అంతేకాకుండా హెయిర్ డ్రెస్సర్ గా 10 ఏళ్లపాటు సేవలందించిన నాగ శ్రీను కి తగిన మర్యాద ఇవ్వకుండా కులం పేరుతో మరియు అసభ్యకరంగా తన తల్లిని కూడా దూషించిన మంచు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా మంచు మోహన్ బాబు కుటుంబానికి చెందినటువంటి ఓ వ్యక్తి హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను తో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ లీక్ అయింది.

ఈ సంభాషణలో మోహన్ బాబు తరఫున మాట్లాడే వ్యక్తి హెయిర్ డ్రేసర్ నాగ శ్రీను ని బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఏకంగా మంచు మోహన్ బాబు అప్పటి సీనియర్ స్వర్గీయ నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు రామోజీరావు వంటి సీనియర్ స్టార్స్ తోనే చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఫుల్స్ చేసేవాడని ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అంటూ నాగ శ్రీను బెదిరించే ప్రయత్నం చేశాడు. మరోవైపు కేటీఆర్, కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి వంటి రాజకీయ నాయకులతో కూడా చాలా సరదాగా మాట్లాడుతాడని అలాగే మంచు మోహన్ బాబు ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఒక మాట అంటే ఆ మాటలు పట్టుకుని ఇంత రాద్ధాంతం చేయడం సరి కాదని సూచించాడు.

ఈ క్రమంలో హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను తన ఆవేదనని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అవతల వ్యక్తి మాత్రం వినలేదు. ఇక ఫైనల్ గా నీకు మంచి మోహన్ బాబు క్షమాపణ చెప్పాలా…? అని నాగ శ్రీను ని అడగగా నాగ శ్రీను మాత్రం తనకి మంచి మోహన్ బాబు క్షమాపణ అవసరం లేదని తెలిపాడు. దాంతో అవతలి వ్యక్తి ఏకంగా మంచు విష్ణు లేకపోతే ఈపాటికి నీ పని అయిపోయిండేదని మంచు విష్ణు ఆపడం వల్లే మోహన్ బాబు ఇంత కామ్ గా ఉన్నాడంటూ చెప్పాడు.

దీంతో వీరిద్దరిని సంభాషణ క్లిప్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ప్రస్తుతం టాలీవుడ్ సినీ టౌన్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కి మాత్రం రోజు రోజుకి మద్దతు బాగానే పెరుగుతోంది. కాగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కి ఉద్యోగం లేక పోవడంతో 50 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశాడు.

దీంతో మెగా ఫ్యామిలీ మరియు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి విబేధాలు మరోసారి బయట పడ్డాయని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇరు కుటుంబాల మధ్య వివాదం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం నుంచి ఉందని మరికొందరు అంటున్నారు. మరి చివరికి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Previous articleషేన్ వార్న్ గ్రౌండ్ లోనే కాదు వివాదాలు, రతి క్రీడల్లో కూడా గొప్ప క్రీడాకారుడే
Next articlejanatha garage : జనతా గ్యారేజ్ చిత్రంలో బాబాయ్, అబ్బాయ్ నటించాల్సిందట…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here