Job : వామ్మో… భర్త గవర్నమెంట్ ఉద్యోగం కోసం అలా చేసిన భార్య…

470

Job : ఈ మధ్య కాలంలో కొందరు మితిమీరిన తెలివితేటలను ప్రదర్శిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అలాగే చట్టంలో ఉన్నటువంటి అవకతవకలను గుర్తించి వాటిని అలుసుగా తీసుకుని అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఇటీవలే ఓ మహిళ తన భర్త మరణానంతరం నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించి దాదాపుగా 80 లక్షల రూపాయలకు పైగా జీతం తీసుకున్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని సికార్ జిల్లా పరిసర ప్రాంతంలో మంజుల (పేరు మార్చాం) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే జుల గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుంది. కానీ పెళ్లయిన కొద్ది రోజులకే తన ఇద్దరి భర్తలతో మనస్పర్ధలు, విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. దీంతో మళ్లీ ఇటీవలే మూడో పెళ్లి చేసుకుంది. కానీ ఈ పెళ్లి బంధం కూడా సజావుగా సాగడం లేదు. గత కొద్ది రోజులుగా తన మూడో భర్త తో కూడా మనస్పర్ధలు, విభేదాలు మొదలవడంతో మంజుల ప్రస్తుతం తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మంజుల ప్రవర్తనపై విసిగి పోయిన మూడో భర్త దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఆమె గురించి విస్తుపోయే నిజాలను పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు.

అయితే ఇంతకీ ఆ విస్తుపోయే నిజాలు ఏమిటంటే ఏమిటంటే మంజుల 1996వ సంవత్సరంలో తన మొదటి భర్తని పెళ్లి చేసుకుంది. కానీ 2000వ సంవత్సరంలో తన భర్తతో విడాకులు తీసుకొని ఇదే సంవత్సరంలో మరో వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మంజుల మొదటి భర్త 2001వ సంవత్సరంలో అకస్మాత్తు గుండె పోటు కారణంగా మృతి చెందాడు. అలాగే మంజులతో విడాకులు తీసుకున్న తరువాత తన మొదటి భర్త మళ్లీ వివాహం చేసుకోలేదు. కాగా మంజుల భర్త గవర్నమెంట్ టీచర్ గా పని చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న మంజుల తన మొదటి భర్త మరణానంతరం అతడి మరణ ధ్రువీకరణ పత్రంలో తన భార్య పేరు మంజుల గా నమోదు చేసుకొని నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించింది.

అలాగే ప్రభుత్వ అధికారులకు ఈ నకిలీ ద్రువీకరణ పత్రాలను సమర్పించి గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగం తెచ్చుకుంది. అయితే ఈ విషయాలు అప్పటివరకు గోప్యంగా ఉంచిన మంజుల అనుకోకుండా ఓసారి తన మూడో భర్త తో పంచుకుంది. ఈ విషయాన్ని అలుసుగా చేసుకున్న మూడో భర్త మంజుల చిత్రహింసలకు గురి చేయడం, అలాగే డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడం వంటివి చేసేవాడు.

కానీ ఇటీవల కాలంలో తన భర్త ప్రవర్తనతో విసిగి పోయిన మంజుల తన పిల్లలను తీసుకొని దూరంగా వెళ్ళి పోయింది. దీంతో ఆమెపై కక్షగట్టిన తన మూడో భర్త దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఈ విషయాల గురించి తెలియజేశాడు. ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు మంజుల పై పలు సెక్షన్ల కింద కాదు ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Previous articleనిద్రలో ఈ లాంటి కలలు వస్తే ఎం అవుతుందో తెలుసా…
Next articleచిత్రా రామక్రిష్ణ : స్టాక్ మార్కెట్ గుట్టు ఆ హిమాలయాలలో ఉన్న రహస్య యోగి చేతిలోకి ఎలా వెళ్ళింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here