Mega Hero Chiranjeevi ఆ హీరో ని అప్పుల నుంచి కాపాడటానికి అలా చేశాడట…
Mega Hero Chiranjeevi : ఒకప్పుడు కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరోలలో తమిళ హీరో శరత్ కుమార్ ఒకరు. అయితే నటుడు శరత్ కుమార్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్నచితకా పాత్రలలో నటించాడు. ఆ విధంగా తన ప్రతిభను నిరూపించుకున్న శరత్ కుమార్ క్రమక్రమంగా హీరోగా అవకాశాలు దక్కించుకుని దాదాపుగా 80 కి పైగా చిత్రాలలో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అయితే నటుడు శరత్ కుమార్ ఎప్పుడూ కూడా రిస్క్ చేయడానికి ముందుంటాడు. అందువల్లనే శరత్ కుమార్ సినీ లైఫ్ లో ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. కాగా నటుడు శరత్ కుమార్ ఆ మధ్య ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని సినిమా ఇండస్ట్రీలో తనకున్న సన్నిహితులు, స్నేహితులు మరియు తన సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
ఈ క్రమంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవితో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అలాగే తనకు చిరంజీవి ఆప్త మిత్రుడు చెప్పుకొచ్చాడు. అలాగే గతంలో మెగాస్టార్ చిరంజీవితో జరిగినటువంటి ఓ సంఘటన గురించి తెలిపాడు ఇందులో తాను సినిమా రంగంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఓ సినీ నిర్మాత తన వద్దకు వచ్చి మెగాస్టార్ చిరంజీవి సినిమా డేట్లు ఇప్పిస్తే ఆ సినిమా వల్ల వచ్చేటువంటి లాభం మొత్తం శరత్ కుమార్ కి ఇస్తానని చెప్పాడట.
దీంతో శరత్ కుమార్ చెన్నై నుంచి మెగాస్టార్ చిరంజీవి ని కలవడానికి హైదరాబాద్ కి వెళ్లగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడని అయినప్పటికీ తనని కలవడానికి వెళ్లడంతో సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి తనని ఇంటికి తీసుకెళ్లాడని తెలిపాడు. అలాగే భోజనం చేసిన తర్వాత తనకి సినిమా డేట్లు కావాలని మెగాస్టార్ చిరంజీవితో చెప్పడంతో అందుకు వెంటనే ఒప్పుకున్నాడని అలాగే రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చాడని తెలిపాడు.

ఆ తర్వాత ఆ నిర్మాత ఇచ్చేటువంటి డబ్బుతో తన ఆర్థిక సమస్యలు తీర్చుకోమని అంతేకాకుండా తొందర్లోనే నువ్వు కూడా హీరో అయిపోతావని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని తెలిపాడు. దాంతో మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లే తాను నటుడిగా మంచి విజయం సాధించానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వంటి గొప్ప స్నేహితుడు దొరకడం గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమేనని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా డేట్లు ఇచ్చినప్పటికీ ఆ చిత్రం పట్టాలెక్కలేదని కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత తనకి సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు బాగానే వరించాయని దాంతో తాను అప్పటికే బాగా సెటిల్ అయ్యానని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా నటుడు శరత్ కుమార్ కోలీవుడ్ హీరోయిన్ రాధిక ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ ఇటు సినిమా రంగంలో మాత్రమే కాకుండా వ్యాపార రంగంలో కూడా బాగానే రాణిస్తున్నారు.అయితేప్రస్తుతం రాధిక శరత్ కుమార్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క తమిళ భాషకి చెందిన ఓ ప్రముఖ ఎంటర్ టైన్మెంట్ ఛానల్ ని కూడా నిర్వహిస్తోంది. కాగా ఈ ఛానల్ విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఇక శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కోలీవుడ్ టాలీవుడ్ తదితర భాషలలో వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.
Please Follow : srimedianews.com with bell icon below