Mega hero : ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మెగా బ్రదర్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?

224

Mega hero : టాలీవుడ్ లో 2010వ సంవత్సరంలో బొమ్మరిల్లు మూవీ ఫేమ్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించగా హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జెనీలియా డిసౌజా నటించింది. అలాగే ఈ చిత్రంలో షాజహాన్ పద్మశ్రీ, సంచిత శెట్టి, నైరా బెనర్జీ, ప్రభు, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, సిద్ధు జొన్నలగడ్డ నాగబాబు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

కాగా ఈ చిత్రానికి మెగాబ్రదర్ నాగేంద్రబాబు నిర్మాతగా వ్యవహరించాడు. అలాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ సంగీత స్వరాలు సమకూర్చాడు. నలుగురు హీరోయిన్లను పెట్టి ప్రేమ కొంతకాలమే బాగుంటుందని చెప్పాలని ప్రయత్నించిన బొమ్మరిల్లు భాస్కర్ కి ఆరెంజ్ చిత్రం రూపంలో డిజాస్టర్ పలకరించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ సంగీతం పరంగా మాత్రం మంచి హిట్ అయ్యింది. దీంతో ఇప్పటికీ ఒత్తిడి లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ చిత్రంలోని పాటలు వింటే ఇట్టే మైమరచిపోతారు.

అయితే దాదాపుగా 32 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించి ఈ చిత్రాన్ని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో షూటింగ్ జరిపారు. కానీ ఈ సినిమాని మాత్రం ఇండియాలో రిలీజ్ చేయడంతో ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇంకేముంది డిజాస్టర్ టాక్ రావడంతో నిర్మాత నాగేంద్రబాబు కి దాదాపుగా 25 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. అయితే ఆరెంజ్ చిత్రం కోసం నిర్మాత నాగబాబు అప్పటివరకు తాను సంపాదించిన డబ్బంతా ఖర్చు పెట్టాడు. దీంతో ఆ మధ్య ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగేంద్రబాబు ఆరెంజ్ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో తనకి ఆర్థికంగా నష్టాలు వచ్చాయని దాంతో ఈ ఆర్థిక కష్టాలను తాళలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

కానీ ఈ చిత్రంలో హీరోగా నటించిన రామ్ చరణ్ మాత్రం తను తీసుకున్న నువ్వంటే రెమ్యునరేషన్ ని పూర్తిగా తిరిగి ఇచ్చేశాడని తెలిపాడు. అలాగే తన సోదరులైన మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆర్థిక కష్టాల నుంచి బయట పడడానికి సహాయం చేశారని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో తన తమ్ముడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓ ప్రముఖ అపార్ట్ మెంట్ ని అమ్మేసి మరీ డబ్బులిచ్చాడని కూడా తెలిపాడు.

అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన రుద్రవీణ చిత్రాన్ని కూడా నాగేంద్రబాబు నిర్మించాడు. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్లు మాత్రం రాబట్టలేకపోయింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి తన రెమ్యూనరేషన్ తో పాటు మరింత డబ్బుని ఎదురుగా ఇచ్చాడట. అయితే ఆరెంజ్ చిత్రం ఫ్లాప్ అయిన తర్వాత మళ్లీ నాగేంద్రబాబు నిర్మాణం జోలికి వెళ్ళలేదు. దీంతో ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలురకాల షోలు, ఈవెంట్లలో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాంలో జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.

Previous articleModel : బెలూన్లు అమ్ముకునే అమ్మాయి ఇప్పుడు స్టార్ మోడల్… ఎలాగంటే….?
Next articleఅసలు ఆరోజు 2 గంటలు కారులో ఏం జరిగింది, సంచలన నిజాలు బయట పెట్టిన నటి భావన ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here