Megastar-Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో హీరోగా నటించి ఎక్కువ శాతం విజయాలను అందుకుని సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపుగా దక్షిణ భారతదేశంలో తెలియనివారుండరు. అయితే నటుడు చిరంజీవి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి తన నటనా ప్రతిభను నిరూపించుకుని మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీనికితోడు చిరంజీవి కేవలం ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా బిరుదు అందుకోవడంతో అప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే డబ్బు హోదా వంటివి ఉండాలనే పిచ్చి అపోహలు తొలగిపోయాయి. అంతేకాకుండా చాలామంది Megastar-Chiranjeevi ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటనారంగంలో బాగానే రాణిస్తున్నారు.
మొగల్తూరు పరిసర ప్రాంతంలో జన్మించిన చిరంజీవి
అయితే గోదావరి జిల్లాలకే చెందినటువంటి మొగల్తూరు పరిసర ప్రాంతంలో జన్మించిన చిరంజీవి కి చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలో కాలేజీలో కల్చరల్ ఈవెంట్స్ మరియు స్టేజి నాటకాలలో పాల్గొనేవాడు. కానీ చిరంజీవి తండ్రి మాత్రం చిరంజీవి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలని కోరుకునేవాడు. దీంతో చిరంజీవిని నటనవైపు పెద్దగా ప్రోత్సహించ కపోయినప్పటికీ చిరంజీవి మాత్రం కష్టపడి తన తల్లిదండ్రులను ఒప్పించి మద్రాసులో ఉన్నటువంటి ఫిలిం ఇనిస్టిట్యూట్ లో నటన నేర్చుకొని తన సినీ కెరీర్ ని ఆరంభించాడు. ఈ క్రమంలో మొదటగా చిన్నాచితకా పాత్రలలో నటించి క్రమక్రమంగా హీరోగా అవకాశాలు దక్కించుకుని ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంతగా తన సినీ జీవితంలో విజయం సాధించడానికి చిరంజీవి భార్య సతీమణి కొణిదెల సురేఖ ముఖ్య కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా మెగాస్టార్ చిరంజీవి కొణిదల సురేఖ ని 1980వ సంవత్సరంలో ఫిబ్రవరి 20వ తారీఖున పెళ్లి చేసుకున్నాడు. అయితే కొణిదల సురేఖ తెలుగు ప్రముఖ హాస్య నటుడు మరియు పద్మశ్రీ గ్రహీత అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య కూతురని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ అభిమాని మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన పెళ్లి ఫోటోలు మరియు పెళ్లి సమయంలో ముద్రించిన పెళ్లి పత్రికలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి దాదాపుగా 60 సంవత్సరాల వయసు
ఈ విషయం ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవికి దాదాపుగా 60 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా యంగ్ గా కనిపిస్తూ అదే ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. కాగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కరోనావైరస్ పరిస్థితుల కారణంగా చిత్ర విడుదలను కొంత కాలం పాటు వాయిదా వేశారు.
If you like our article
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites