Megastar Chiranjeevi పెళ్లి విషయంలో అంత జరిగిందా…?
Megastar Chiranjeevi : ప్రపంచంలో దాదాపుగా 150 కి పైగా చిత్రాలలో హీరోగా నటించి నేటితరం నటీనటులకు ఎంతగానో ఆదర్శంగా నిలుస్తున్న టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ రియల్ లైఫ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేయడం అలాగే కంటి చూపు కోసం కళ్లు దానం వంటివాటిని ప్రోత్సహిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనులను చేస్తున్నారు. కాగా నటుడు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా ఎంతో గొప్ప స్తానాన్ని చేరుకున్నాడు.
అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చేటువంటి ఎంతోమంది యువ నటీనటులకు ఆదర్శంగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటనా రంగంలో మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశం తో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు. కానీ ఆ తర్వాత పలు అనివార్య కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. అనంతరం పర్యాటక శాఖ మంత్రిగా కూడా కొంత కాలం పాటు పని చేశాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి నటనారంగంలో ఇంతటి అభివృద్ధి సాధించడానికి చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
ఇటీవలే కొణిదెల సురేఖ పుట్టినరోజు కావడంతో పలువురు నెటిజన్లు మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన తల్లి కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవితో సురేఖ వివాహం 1980వ సంవత్సరం ఫిబ్రవరి 20 వ తారీఖున జరిగింది. అయితే చిరంజీవి సురేఖ పెళ్లి చేసుకున్న సమయంలో అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నాడు. ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య తో కలిసి పలు చిత్రాల్లో నటించాడు. దీంతో నటుడు అల్లు రామలింగయ్య దృష్టిలో పడ్డాడు చిరంజీవి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటనా ప్రతిభను గుర్తించిన అల్లు రామలింగయ్య అల్లుడు చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో తన తోటి నటీనటులతో కూడా చర్చించి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులను సంప్రదించి వివాహం నిశ్చయించారు.
ఈ విషయం గురించి ప్రముఖ సీనియర్ నటి అయిన రాజ శ్రీ కూడా ఆ మధ్య ఓ షోలో స్పందించింది. ఇందులో భాగంగా అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖ మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించే ముందు తనతో కూడా చర్చించాడని తెలిపింది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీ కి కొత్తగా ఓ కుర్రాడు వచ్చాడని నటన, డ్యాన్స్ లో బాగానే రాణిస్తున్నాడని దాంతో తన కూతురు సురేఖ ని ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నట్లు చిరంజీవి గురించి చెప్పాడట. దాంతో తాను కూడా వెంటనే చిరంజీవితో సురేఖ వివాహం జరగడానికి ఒకే చెప్పానని చెప్పుకొచ్చింది. దీంతో ఒక రకంగా తాను కూడా పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరగడానికి కారణమయ్యాయని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే మెగాస్టార్ చిరంజీవి మరియు కొణిదెల సురేఖ పెళ్లి బంధానికి 40 సంవత్సరాలు పూర్తయింది. అయితే పెళ్లయిన నా తర్వాత చాలా పెద్ద కుటుంబం లోకి అడుగు పెట్టిన సురేఖ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ బాధ్యతలను తలపై ఎత్తుకొని ప్రతి ఒక్కరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకునేది. అలాగే సురేఖతో చిరంజీవి పెళ్లి జరిగిన సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిగా ఉండేవాడు. దీంతో సురేఖ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తన కన్నా కొడుకులా చుకునేది. అందువల్లనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన వదిన సురేఖ ని తల్లితో సమానంగా చూస్తాడు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి షూటింగులతో బిజీబిజీగా ఉన్న సమయంలో కూడా సురేఖ కుటుంభ సభ్యులకు కావాల్సినవి సమకూరుస్తూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఏదేమైనప్పటికి చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఇంతగా విజయం సాధించడానికి ఒకరకంగా ఆయన సతీమణి కొణిదెల సురేఖ కూడా ఒక కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.