Marriage with friend’s wife స్నేహితుడు మరణించాడని….
Marriage with friend’s wife : ఇప్పుడున్న కాలంలో మనుషులు ఒకరినొకరు నమ్మడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఇప్పటి జనరేషన్లో ఎక్కువమంది తమ స్వప్రయోజనాల కోసం ఇతరులను మోసం చేయడం అలాగే తమ స్వప్రయోజనాల కోసం ప్రేమ, ఫ్రెండ్షిప్ వంటి బంధాలను కూడా అపహాస్యం చేయడంవంటి సంఘటనలు కోకొల్లలు. కానీ ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా కలుషితం కానిది మాత్రం ఫ్రెండ్ షిప్ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నిజంగా ఒక వ్యక్తి మన మనసుకి కనెక్ట్ అయి మనతో స్నేహం చేస్తే ఆ స్నేహం జీవితాంతం ఉండిపోతుందని చాలా సందర్భాల్లో కూడా నిరూపితం అయ్యింది. అయితే తాజాగా ఓ వ్యక్తి తన స్నేహితుడు అనారోగ్యం కారణంగా మరణించడంతో అతడి భార్య ని చేరదీసి ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో చేతన్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. కాగా ఇతడి స్వగ్రామం చామరాజనగర్ అయినప్పటికీ ఉద్యోగం నిమిత్తమై బెంగుళూరులో ఉంటున్నాడు. అయితే 2 ఏళ్ల క్రితం చేతన్ కుమార్ కి గుల్బర్గా పరిసర ప్రాంతానికి చెందిన అంబిక అనే యువతితో పెళ్లి అయింది. అందమైన భార్య, మంచి ఉద్యోగం, చక్కగా సాగిపోతున్న జీవితంలోకి కరోనా వచ్చి పడింది. దీంతో ఒక్కసారిగా చేతన్ కుమార్ కుటుంబం ఇబ్బందుల పాలయింది. కాగా చేతన్ కుమార్ కూడా కరోనా వైరస్ బారిన పడటంతో కోలుకోలేక పోయాడు.
అప్పటికకీ బ్రతకడానికి చాలానే ట్రై చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చేతన్ కుమార్ తుదిశ్వాస విడిచాడు. దీంతో పెళ్లి కనీసం మూడేళ్ల కూడా దాటకుండానే ఆ వధువు విధవరాలు అయింది. అలాగే చేతన్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక వైపు తమ కుమారుడి మరణం, మరోవైపు తమ కోడలు చిన్న వయసులోనే విధవరాలు అయ్యిందనే బాధలు వారిని తీవ్రంగా కలచివేశాయి.
చైతన్య కుమార్ కి లోకేష్ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు
అయితే చైతన్య కుమార్ కి లోకేష్ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. కాగా చైతన్య కుమార్ మరియు లోకేష్ లో గతంలో ఒకే కాలేజీలో చదువుకున్నారు. దాంతో చైతన్యకుమార్ ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసం ఉంటున్న ఇప్పటికీ తన స్నేహితుడితో తరచూ మాట్లాడుతూ కష్టసుఖాలను పంచుకునేవాడు. కానీ ఉన్నట్లుండి ఇ లోకేష్ తన ప్రాణ స్నేహితులు చైతన్య కుమార్ ని కోల్పోవడంతో చాలా బాధ పడ్డాడు. అలాగే అతి చిన్న వయసులో విధవరాలైన అంబికను ఆదరించాలని జీవితాంతం ఆమెకి తోడుగా నిలబడాలని అనుకున్నాడు. దాంతో ఈ విషయం గురించి అంబిక తల్లిదండ్రులకు మరియు తన అత్త మామలకు తెలియజేసి అంబికను ఇటీవలే అంబిక ను పెళ్లి చేసుకున్నాడు.
దీంతో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే లోకేష్ చేసిన ఈ పనికి కొందరు అభినందిస్తున్నారు. అలాగే తన స్నేహితుడి మరణాంతరం అతడి భార్య నీ చేరదీసి మంచి లైఫ్ ఇవ్వడంతోపాటు స్నేహితుడనే పదానికి నిజమైన అర్థం చెప్పాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే లోకేష్ వంటి ప్రాణస్నేహితుడు ఉన్నందుకు చేతన్ కుమార్ నిజంగా గ్రేట్ అంటూ పొగుడుతున్నారు.
If you like our article about Marriage with friend’s wife
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites