జీడీపప్పు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమొ తెలిస్తే అసలు వదలరు .
Jeedipappu : ఏ తీపి వంటకం చేసినా అందులో జీడిపప్పు వేయడం తప్పనిసరిగా ఉంటుంది కదా. దోరగా వేయించిన జీడిపప్పు కాస్తంత ఉప్పు చల్లి కొంతమంది స్నాక్స్గా కూడా తింటూ ఉంటారు. అలాగే జీడిపప్పుతో కాజు పట్టి అంటూ అదనపు రుచి కోసం జీడిపప్పును పేస్టులాగా చేసి వంటల్లో కూడా వేస్తుంటారు. ఇక జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు పన్నీర్ ,జీడిపప్పు బిర్యాని, ఇలా ఎన్నో రకాల వంటల్లో జీడిపప్పును వాడుతూ ఉంటారు. చాలామంది జీడిపప్పు రుచికి మాత్రమే అని అనుకుంటూ ఉంటారు కానీ జీడి పప్పు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలా అని మంచిది కదా అని అతిగా తింటే వీటి వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. జీడి పప్పు తినడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలు తో పాటు నష్టాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Jeedipappu లు రుచిగా ఉంటాయి కాబట్టి తినడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు అయితే వీటిని ఎలా పడితే అలా తినేయకూడదు. దీనిని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి అంటే ప్రతి రోజు 3 నుంచి 5 వరకు నానబెట్టిన జీడిపప్పులను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే నానబెట్టిన జీడిపప్పులో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాట్, షుగర్, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1 బి2 బి3 బి5 బి6 క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే నానబెట్టిన జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. అందుకే ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఎముకల్ని ఇనుము లాగా దృఢంగా మారుస్తాయి. ఎముకలు గట్టిపడటానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం అవుతుంది. కాబట్టి జీడిపప్పును తీసుకుంటే మంచిది. అయితే వీటిని మితంగా నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే జీడిపప్పుని పగటిపూట తినకూడదు. పగటి పూట వీటిలో రసాయనాలు తల నొప్పి గుండెలో మంటను కలిగిస్తాయి. కాబట్టి వీటిని నీటిలో నానబెట్టి సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది. జీడిపప్పు లో ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇవి వెంటనే తక్షణ శక్తిని అందిస్తాయి. వీటి వలన మన నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియా కూడా నసిస్తుంది. దీనితో పంటి నొప్పిని కూడా అరికడుతుంది. ముఖ్యంగా దీనిలో ఉండే మ్యాంగనీస్ అధిక బీపీని రాకుండా చూస్తుంది. అయితే వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే బిపి ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
Jeedipappu ను మితంగా తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. అధిక పరిమాణంలో అంటే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధిక బరువు పెరుగుతారు. ముఖ్యంగా జీడిపప్పు లో మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని మనం మితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజు మూడు నుంచి ఐదు జీడిపప్పులు నానబెట్టి సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచిది. అంతేకాకుండా ఎముకల్లో బలాన్ని పెంచుకోవాలి అనుకునేవారు కూడా వీటిని తినవచ్చు. జీడిపప్పు లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మన శరీర ఉష్ణోగ్రత నియంత్రించడం అలాగే ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. అలాగే జీడిపప్పులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగానూ ఉంటాయి. దీని వలన క్యాన్సర్ సమస్యలు అడ్డుకునే యాంటీ ఆక్సిడెంట్లు కూడా జీడిపప్పులో పుష్కలంగా ఉంటాయి. అలాగే జీడిపప్పును సోడియం ఇది చాలా తక్కువగానే ఉంటుంది.కానీ అధిక మొత్తంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుంది. జీడిపప్పు లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అధికంగా తీసుకున్నప్పుడు శరీరంలో మెగ్నీషియం నిల్వలు ఎక్కువైపోయి రోజువారి అనారోగ్యాలు గనుక ఉన్నట్లయితే వాటి కోసం తీసుకునే మందులు సరిగా పని చేయకుండా ఇది ప్రభావం చూపిస్తాయి. ఇతర అనారోగ్యాలతో మందులు వేసుకునే వారు ఆ సమయంలో జీడిపప్పు తినకుండా ఉంటే మంచిది. బీపీ షుగర్ థైరాయిడ్ కు మందులు వాడే వారు కూడా జీడిపప్పు అధికంగా తినకూడదు. జీడి పప్పు తినడం వల్ల తలనొప్పి మైగ్రేన్ సమస్యలు ఉన్నవారికి అంత మంచిది కాదు. దీనిలో ఉండే ఎమినో యాసిడ్స్ మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారి పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి కాబట్టి అలాంటి సమస్యలు ఉన్న వారు జీడిపప్పును తక్కువగా తీసుకుంటే మంచిది. తక్కువ రేటుకు వస్తుందని చాలా మంది మూడి జీడిపప్పును తీసుకుంటూ ఉంటారు. కానీ మూడు జీడిపప్పును తినడం వల్ల దురద ఎలర్జీ వంటి సమస్యలు వస్తాయి ఎందుకంటే జీడి గింజల నుంచి పప్పు తయారు చేసే ప్రాసెస్ కనుక సరిగా లేనట్లైతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కనుక ముడీ జీడిపప్పుని తినకపోవడమే మంచిది. ఉత్తమమైన నాణ్యత కలిగిన జీడిపప్పును కొనుగోలు చేసి వాడటమే మంచిది. జీడిపప్పు చాలా రుచిగా ఉంటుందని అతిగా తిని అనారోగ్యాన్ని తెచ్చుకోకుండా కేవలం రోజుకు మూడు నుంచి నాలుగు నానబెట్టిన జీడిపప్పులను తినడమే చాలా ఉత్తమం.
If you like our article about Jeedipappu
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites